తన కురులు గాలికి అలా అలా ఎగురుతూ ఉంటీ నాలో ఉన్న కవి రక రకలైన పాటలు తెగ పాడుతున్నడు. ఇవ్వాళ నిజంగా నా జీవితంలో మరిచిపోలేని రోజు. ఇద్దరం ఇంటికి వెళ్ళేటప్పటికి చిన్నగా వర్షపు జల్లు మొదలయ్యింది.సరిగ్గా ఇంటి దగ్గిరికి వెళ్ళే సరికి వర్షం ఎక్కువైంది,ఇద్దరం చిన్న పరుగందుకుని ఇంట్లోకి వెళ్ళాం, మొత్తానికి ఇద్దరం తడిచాం.కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తెరుచుకుంది, తీసింది అత్త, “రేయ్, ఎక్కడకెళ్ళార్రా ఇంతసేపు? త్వరగా లోపలికి రండి..” అంటూ మమ్మల్ని ఆశ్చర్యంగా చూసింది. “ఏం లేదత్తా, అలా బీచ్ దగ్గరకు వెళ్ళామా, అకాడ మాట్లాడుకుంటూ ఉండిపోయాము…” “అవునమ్మా, అలా సముద్రం ఒడ్డున కూర్చుంటే అస్సలు టైం తెలీలేదు.” “హుం.. సరే సరే ముందు తలలు తుడుచుకోంది జలుబు చేస్తుంది, అను నువ్వెళ్ళి బట్టలు సర్దుకో, రేపు పొద్దున్నే మన ప్రయాణం.” “ఒకే మమ్మీ.” అంటూ అను లోపలికి వెళ్ళిపోయింది. నేను అత్త ఇచ్చిన టవల్ తీస్కుని తుడుచుకుంటూ పైన నా రూం లోకి వెళ్ళిపోయా.రూంలోకి వెళ్ళినాక, ఇప్పటిదాక జరిగిన దాన్ని తలుచుకుంటూ నా మనసు పులకించి పోతుంది. ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.కాని అంత సాహసం ఇంట్లో చెయ్యలేం ఇప్చ్..అని నిట్టూర్చి బట్టలు మార్చుకుని,తడి బట్టలు అలా బాల్కనీలో చెయిర్ మీద వేశి వెనక్కు తిరిగి చూస్తే అత్త నా రూంలోకి వస్తున్నది.ఒక్క నిముషం నాకు లైట్*గా వణుకు మొదలయ్యింది.కొంపదీసి అత్తకు తెలిసిపోయిందా? ఎంటో చూద్దాం అని, “ఎంటత్తా? ఎమైంది?” “రెయ్, చిన్నా నీతో కొంచెం మాట్లాడాలి..”
