పెద్దమ్మ Part 20

బుజ్జిమహేష్ పెదాలపై తియ్యదనం చూస్తుంటేనే అర్థమైపోతోంది , తన ప్రాణమైన దేవత వస్తోందని , నువ్వేనా తల్లీ ……. నిన్ను కలిసిన తరువాతనే బుజ్జిమహేష్ పెదాలపై చిరునవ్వులు చూసాము – మా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండు తల్లీ అని దీవించారు అవ్వలు …….
అవును అవ్వలూ అంటూ అక్కయ్య – చెల్లెళ్లు , అవ్వల బుగ్గలపై ముద్దులుపెట్టి , నాకు రెండువైపులా కూర్చున్నారు .
అవ్వలూ ……. అక్కయ్య – చెల్లెళ్లను కూడా ఆశీర్వదించండి , ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా ……..
అవ్వలు : మా మహేష్ పెదాలపై చిరునవ్వులు …… వీరందరి వలన అన్నమాట – చల్లగా ఉండండి తల్లులూ ……..
అవ్వలూ ……. నా పెదాలపై చిరునవ్వులు చిగురింపచేసినట్లుగానే మన అనాథ శరణాలయంతోపాటు రాష్ట్రంలో ఉన్న అన్నీ అనాథ శరణాలయంలోని పిల్లల పెదాలపై చిరునవ్వులు పూయించడానికే ఇక్కడకు వచ్చారు మేడం – అక్కయ్య – చెల్లెళ్లు ……..

దేవత : ఇంతమంది అనాథ పిల్లలను ప్రాణంలా చూసుకుంటున్న మీరు నిజమైన దేవతలు అంటూ అవ్వల పాదాలను స్పృశించి , అవ్వలతోపాటు అందరికీ స్వీట్స్ అందించారు .
చెల్లెళ్లు : అన్నయ్యా ……. మాటల్లోనే డాడీ వచ్చారు – ఈరోజుతో అన్నయ్య చెప్పినట్లు మా మేడం – అక్కయ్య ….. దేవత – దేవకన్యలు అయిపోతారు అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగునవెళ్లి , సర్ చేతిలోని పెద్ద బ్యాగును అందుకుని చెరొక చేతితో పట్టుకునివస్తున్నారు .
వెంటనే వెళ్లి , చెల్లెళ్ళూ …… నాకు ఇవ్వండి బరువుగా ఉందేమో …….
చెల్లెళ్లు : అమ్మో మా బుజ్జిదేవుడితో మొయిస్తే ఇంకేమైనా ఉందా …… ? , నో నో నో అంటూ ఇష్టంతోనే మోసుకునివచ్చారు . మేడం కాదు కాదు లవ్ యు లవ్ యు దేవతా – అక్కయ్యా …… మీ చేతులతో ఇవ్వండి .
కమిషనర్ సర్ : అవంతికా గారూ …… మీ అకౌంట్ అంటూ బుక్ అందించారు .
బుక్ లో దేవత – అక్కయ్య – చెల్లెళ్ళ పేర్లు ఉండటం చూసి పెదాలపై చిరునవ్వులతో అక్కయ్యకు – చెల్లెళ్లకు చూయించారు .

అవ్వలు : ఈ బ్యాగు ఏమిటి బుజ్జితల్లులూ ……..
చెల్లెళ్లు : అన్నయ్య – మాలానే …… ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ ప్రతీ ఒక్కరి పెదాలపై చిరునవ్వులు చిందింపజేసే మార్గం అవ్వలూ ……. అంటూ బ్యాగు ఓపెన్ చేశారు .
అవ్వలు : ఇంత డబ్బా ……
చెల్లెళ్లు : అవును మొత్తం మన శరణాలయానికే అవ్వలూ ……. , దేవత – అక్కయ్య ప్రేమతో ఇస్తున్నారు .
దేవత : చెల్లెళ్ళూ ……. మొదటిది బుజ్జిదేవకన్యలైన మీరే ఇవ్వాలి అదే మాకు ఆనందం – చెల్లీ ……..
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా …… , అంతకంటే ఆనందం ఏముంటుంది .
చెల్లెళ్లు : హమ్మయ్యా …… , అన్నయ్య అనాథ శరణాలయానికి అన్నయ్య – మేము మాత్రమే ఇవ్వాలని ఆశపడ్డాము – పెద్దమ్మనూ ప్రార్థించాము అలానే జరిగింది అంటూ కొంటె నవ్వులతో నన్ను హత్తుకున్నారు .
దేవత : అమ్మో అమ్మో …….
అక్కయ్య : ముసిముసినవ్వులు నవ్వుకుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా చెల్లెళ్ళూ …… అంటూ దేవతను రెండుచేతులతో చుట్టేసి ముద్దులు కురిపిస్తున్నారు .
మిస్సెస్ కమిషనర్ : చెల్లెళ్ళూ ……. , వాళ్లకు అన్నయ్య – అన్నయ్యకు వాళ్ళు , ఇక ఎవ్వరూ అవసరం లేదు వాళ్లకు ……. , నేను చెబుతూనే ఉన్నాను కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు .
దేవత : ఫక్కున నవ్వేశారు .
చెల్లెళ్లు : దేవత ok అన్నారు యాహూ …… అన్నయ్యలూ రండి అంటూ ఐదుగురమూ కలిసి అవ్వలకు అందించాము .
అవ్వలు : ఇంత డబ్బు అవసరం లేదు తల్లులూ ……..
దేవత – అక్కయ్య : ఇక్కడున్న పిల్లలు మాకు కుటుంబంతో సమానం , ఫుడ్ – కనీస అవసరాలకోసం ఎవ్వరివైపూ ఆశతో చూడకూడదు , అందరూ హెల్తీ ఫుడ్ తిని మంచి మంచి కాలేజ్స్ లో అందరి పిల్లల్లా చదువుకోవాలి .
థాంక్యూ మేడం – లవ్ యు అక్కయ్యా ……. , అవ్వలూ ……
చెల్లెళ్లు : అన్నయ్యా ……. ఒక్కసారి అవ్వల కళ్ళల్లో ఆనందబాస్పాలు చూడండి – ఈ క్షణంతో మేడం – అక్కయ్య …… మీరు చెప్పినట్లుగా దేవతలు అయిపోయారు , ఇంకా మేడం అంటారు ఏమిటి ? – ఇలా భయపడితే కష్టం ……. , అవ్వలూ …… దేవతలే స్వయంగా వచ్చి కష్టాలు తీరుస్తుంటే వద్దు అని ఏమాత్రం అనకూడదు – మీరు తీసుకున్నారు అంతే ఫైనల్ …… – అన్నయ్యా ….. సేఫ్ గా లోపల పెడదాము రండి అంటూ పెద్దమ్మ నిలయం లోకి తీసుకెళ్లి రూమ్ లో జాగ్రత్తగా ఉంచి వచ్చాము . దేవతలూ – మమ్మీ ……. భోజనం రెడీ అయినట్లు వంట గదిలోనుండి ఘుమఘుమలు ……. , మా ఫ్రెండ్స్ …… మనందరినీ లంచ్ కు ఆహ్వానించారు – డాడీ …… ఇక్కడే భోజనం చేద్దాము .
కమిషనర్ సర్ : మీఇష్టం తల్లీ ……
అవ్వలు : మీకిష్టమైతే అందరమూ భోజనం చేద్దాము రండి తల్లులూ …….
దేవత – అక్కయ్య – అందరూ : లవ్ టు లవ్ టు అవ్వలూ ……. , మీ వెనుకే మేము అంటూ కొత్తగా రెడీ అయిన భోజనశాలకు చేరుకున్నారు .
అక్కయ్య : అక్కయ్యా …… ప్రతీ శరణాలయంలో ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది .
దేవత : చెల్లీ …… ఈ డబ్బుతో మారితే చాలా చాలా సంతోషం .
అక్కయ్య : అక్కయ్యా …… మొత్తం శరణాలయాలకు ఈరోజునే డబ్బు చేరితే బాగుంటుంది .
దేవత : ఒక్కరోజులో ఎలా చెల్లీ ……. ? .
కమిషనర్ సర్ : ఆ సంగతి నాకు వదిలెయ్యండి దేవతలూ …….
దేవత : సర్ ……. ? .
కమిషనర్ సర్ : ప్రాణమైన అన్నయ్య కాబట్టి మాటలతో చెప్పారు – నేను కానీ మిమ్మల్ని అలా పిలవకపోతే ……. భూకంపం తెప్పిస్తారు తల్లులు .
అందరూ నవ్వుకున్నారు .
కమిషనర్ సర్ : స్టేట్ లో ఉన్న మొత్తం శరణాలయాలు – వృద్ధాశ్రమాల గురించి మొత్తం సమాచారాన్ని సేకరించమని కంట్రోల్ రూమ్ కు ఆర్డర్ వేసాను , ఏ క్షణమైనా సమాచారం రావచ్చు – so మనం ఇక్కడ ఉండే గంటల్లో మీ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేసేయ్యవచ్చు , ఆ డబ్బు సక్రమంగా పిల్లలకూ – వృద్ధులకే ఖర్చు చేసేలా అక్కడి చీఫ్ సెక్యూరిటీ అధికారి ను చూసుకోమని చెబితే సరి ……..
గుడ్ ఐడియా సర్ అంటూ దేవత – అక్కయ్య ఆనందించారు .

అన్నయ్యా – ఫ్రెండ్స్ – మేడం – అక్కయ్యలూ – బామ్మలూ ……. రండి భోజనానికి అంటూ పిల్లలందరూ ఆప్యాయంగా ఆహ్వానించారు .
దేవత – అక్కయ్య : గుసగుసలాడుకుని , పిల్లలూ …… ఈ పూట మా ప్రియమైన పిల్లలకు మాచేతులతో వడ్డిస్తాము .
Wow సూపర్ నేనుకూడా ……..
చెల్లెళ్లు : ష్ ష్ ష్ అన్నయ్యా ఉమ్మా ఉమ్మా ……. అంటూ నా నోటిని చేతులతో మూసేసి , ప్చ్ ప్చ్ ……. , మాకు – అన్నయ్యకు ……. మా ఫ్రెండ్స్ తోపాటు కలిసి తినాలని ఆశగా ఉంది .
అందరూ నవ్వుకున్నారు .
దేవత – అక్కయ్య : నవ్వుకుని , ఎవరు కాదన్నారు – పిల్లలతోపాటు …… మీకు – మీ అన్నయ్యకు కూడా వడ్డిస్తాము వెళ్లి కూర్చోండి .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు దేవతలూ …… అంటూ చిరునవ్వులు చిందిస్తూ నా చేతిని అందుకుని పిలుచుకునివెళ్లి పిల్లలతోపాటు కూర్చోబెట్టి కూర్చున్నారు .
లవ్ యు చెల్లెళ్ళూ ……. , ఇలా ఇక్కడ అందరితోపాటు కలిసి తిని చాలారోజులయ్యింది అంటూ ఇరువైపులా ఉన్న వైష్ణవి – వర్షిని బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టాను .
వైష్ణవి – వర్షిని : ఏంటే హాసినీ అలా చూస్తున్నావు , ఈరోజు అన్నయ్య ముద్దులన్నీ మావే …….
హాసిని : అన్నయ్య ముద్దులు లేకుండా ఒకరోజు అంటే కష్టమే ఫ్రెండ్స్ …… ప్లీజ్ ప్లీజ్ అప్పుడప్పుడూ మీకు ఎక్కువైన ముద్దులు …….
వైష్ణవి : అన్నయ్యా ……. పాపం ఒకముద్దు పెట్టండి . అదికూడా ముందు మాకు పెట్టి ……..
తియ్యదనంతో నవ్వుకుని , వైష్ణవి – వర్షినిలకు ముద్దులుపెట్టిన తరువాత హాసిని బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
హాసిని : లవ్ యు ఫ్రెండ్స్ అంటూ వర్షిణిని హత్తుకుంది .
మిస్సెస్ కమిషనర్ : చూశావా ఫ్రెండ్ , మనకు ముద్దులుపెట్టడానికి ఎప్పుడైనా ఇలా చేశారా ……. ? అని వైష్ణవి మమ్మీని అడిగారు .
వైష్ణవి మమ్మీ : ఎప్పుడూ లేదు అని నవ్వుకున్నారు .

అవ్వలూ …… మీరూ కూర్చోండి , పిల్లలతోపాటు మీకూ వడ్డించి ఆ ఆనందాన్ని కూడా ఆస్వాధిస్తాము అంటూ మాతోపాటు కూర్చోబెట్టి దేవతలు – మేడమ్స్ మరియు బామ్మలతోపాటు సర్ కూడా సంతోషంతో పిల్లలను పలకరిస్తూ నవ్విస్తూ ప్రేమతో వడ్డిస్తున్నారు .
దేవత – అక్కయ్య మా దగ్గరికి వచ్చారు .
చెల్లెళ్లు : దేవతలే స్వయంగా వడ్డిస్తుండటంతో ……. , మా ఫ్రెండ్స్ – అన్నయ్యలో – మాలో ఆనందం చూడండి దేవతలూ …….
దేవత : మిమ్మల్నీ ……. దీనికంతటికీ కారణం మీ అల్లరి అన్నయ్యే అంటూ చెల్లెళ్లకు చెల్లెళ్లతోపాటు నాకూ ప్రేమతో మొట్టికాయలువేసి , చెల్లెళ్ళ బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టి వడ్డించారు .
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ …… అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి వడ్డించారు .
ఆ వెంటనే మేడం వాళ్ళు – బామ్మలు – సర్ ఒక్కొక్క ఐటమ్ వడ్డించడంతో ప్లేట్స్ మొత్తం నిండిపోయాయి .

అందరికీ వడ్డించడం పూర్తవ్వడంతో పిల్లలందరూ దైవమైన పెద్దమ్మను ప్రార్థించడం మొదలెట్టారు .
చెల్లెళ్ళూ – తమ్ముడూ …… పెద్దమ్మ అనిచెప్పడంతో నాతోపాటు కళ్ళుమూసుకుని పెద్దమ్మను ప్రార్థించి చివరగా ” అన్నదాత సుఖీభవ ” థాంక్యూ పెద్దమ్మా అంటూ తినడం మొదలుపెట్టారు .
అక్కయ్య : అక్కయ్యా …… బ్యూటిఫుల్ కదా , అన్నదాత దైవమైన పెద్దమ్మలానే రేపటి నుండి ప్రతీ అనాథ శరణాలయాలలో పిల్లలందరూ ఇంతే సంతోషంతో ఆరోగ్యకరమైన భోజనం చెయ్యాలి అంటూ ప్రార్థించారు .
దేవత : రేపటి నుండి కాదు చెల్లీ ……. , సర్ వలన ఈరోజు రాత్రికే పిల్లలు సంతోషించేలా చేద్దాము .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా …… అని కౌగిలించుకుని బుగ్గపై ముద్దుపెట్టి , పిల్లలందరికీ ప్రేమతో ఆడిగిమరీ వడ్డిస్తున్నారు .
తమ్ముడూ – చెల్లీ – తల్లీ …… అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వడ్డిస్తుండటంతో పిల్లల ఆనందాలకు అవధులులేనట్లు థాంక్యూ అక్కయ్యలూ – బామ్మలూ …… కుటుంబంతో తింటున్నట్లు , ఇక మేము అనాధలు కానట్లుగా చాలా చాలా ఆనందం కలుగుతోంది ఈరోజు డబల్ తింటాము అని అక్కయ్యా – బామ్మా అంటూ పిలిచిమరీ వడ్డించుకుని సంతృప్తిగా తిని అందరూ ఒకేసారి లేచి ప్రార్థించారు .

ఆయాలు వచ్చి టేబుల్స్ అన్నింటినీ శుభ్రం చేశారు .
చెల్లెళ్ళూ …….. దేవతలు – మేడమ్స్ – బామ్మలకు – కమిషనర్ సర్ కు మనం వడ్ఢిద్దాము .
చెల్లెళ్లు : యే యే యే …… , లవ్ యు లవ్ యు అన్నయ్యా …… అంటూ రెండువైపులా కౌగిలించుకుని ముద్దులుపెట్టారు .
మేముకూడా వడ్డిస్తాము అంటూ పిల్లలందరూ ఉత్సాహం చూయిస్తున్నారు .
వర్షిని : ఒకవైపు హత్తుకున్న హాసినివైపు కోపంతో చూస్తోంది .
హాసిని : అయిపోయాను అంటూ నన్ను వదిలి , లవ్ యు లవ్ యు లవ్ యు వే వర్షిని అంటూ లెంపలువేసుకుని గుంజీలు తీస్తోంది .
వర్షిని : నవ్వుకుని లవ్ యు అన్నయ్యా అంటూ నా చేతిని చుట్టేసి ముద్దుపెట్టి , ఒసేయ్ హాసినీ నేను చెప్పానా ఆపమని …….
హాసిని : లేదు అంటూనే గుంజీలు తీస్తోంది .
దేవత – అక్కయ్య – బామ్మలు ……. అందరూ నవ్వుకున్నారు .
మిస్సెస్ కమిషనర్ …… సర్ చేతిని చుట్టేసి ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదండీ – నా తల్లి ఎప్పుడూ ఇలానే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోతున్నారు .
కమిషనర్ సర్ : ఈ ఆనందాలన్నీ బుజ్జిదేవుడి వల్లనే శ్రీమతీ …… , సగం ముద్దులు ……..
మిస్సెస్ కమిషనర్ : సగం కాదండీ …… , మొత్తం ముద్దులు బుజ్జిదేవుడికే అంటూ సర్ బుగ్గపై ముద్దుపెట్టివచ్చి , లవ్ యు బుజ్జిహీరో అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు . వర్షిణీ – వైష్ణవీ ……. ఆకలేస్తోంది .

చెల్లెళ్లు : అమ్మా – అంటీ – దేవతలూ – బామ్మలూ …… కూర్చోండి కూర్చోండి అంటూ టేబుల్స్ రెడీ చేశారు .
దేవత – ఆక్కయ్యలు వెళ్లి సెక్యూరిటీ అధికారి డ్రైవర్స్ ను పిలుచుకునివచ్చి చివరన కూర్చున్నారు .
పెద్ద పెద్ద పాత్రల నుండీ వడ్డించే పాత్రలలోకి అన్నీ వంటలూ తీసుకుని చెల్లెళ్లకు – పిల్లలకు అందించాను .
చెల్లెళ్లు – పిల్లలు : మొదట మా అన్నయ్య అంటూ వడ్డించే పాత్రను అందించారు .
మా ప్రియమైన చెల్లెళ్ళ ఆర్డర్ అంటూ కమిషనర్ సర్ తో మొదలెట్టి చివరన కూర్చున్న అక్కయ్య – దేవతకు వడ్డించాను . వెనుకే చెల్లెళ్లు – పిల్లలు ……. పోటీపడుతూ వడ్డించడం చూసి అందరూ నవ్వుకున్నారు .

అక్కయ్య : తమ్ముడు – చెల్లెళ్లు – పిల్లలందరూ కలిసి వడ్డించిన వంటలు …… దేవలోకపు అమృతంలా మారిపోయి ఉంటాయేమో అక్కయ్యలూ …….
దేవలోకపు దేవత – దేవకన్యకోసం అమృతం వడ్డించాము చెల్లెళ్ళూ ……. ఆఅహ్హ్ ఎంత అదృష్టం .
చెల్లెళ్లు : అన్నయ్యా ……. దేవత తియ్యనికోపంతో చూస్తున్నారు .
అయితే డేంజర్ అంటూ చెల్లెళ్ళ వెనుక దాక్కున్నాను .
అక్కయ్య : నిజమే కదా దేవతా అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టడంతో …….. దేవత – దేవతతోపాటు అందరూ నవ్వుకున్నారు .
దేవత : చెల్లీ …… నిజమే , అన్నీ వంటలూ బాగున్నాయి , ఇలాంటి భోజనాన్నే ప్రతీ అనాథ పిల్లవాడూ తినాలి , పెద్దమ్మా …… నిజంగా మీరు దేవత థాంక్యూ …….
చెల్లెళ్లు : అన్నయ్యా ……. అక్కయ్య వలన సేఫ్ …….
తొంగి తొంగి చూసి ప్రాణంలా చూస్తున్న అక్కయ్యవైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి తీసుకొచ్చి తీసుకొచ్చి వడ్డించాము .

దేవత – అక్కయ్య : చెల్లెళ్ళూ – పిల్లలూ …… అంటూ ప్రేమతో పిలిచి వడ్డించుకుని తిన్నారు . పిల్లలూ …… మీకంటే ఎక్కువగా తిన్నాము అంత ప్రేమతో వడ్డించారు థాంక్యూ …….
పిల్లలు : థాంక్యూ లన్నీ మా అన్నయ్యకు – ఫ్రెండ్స్ కే చెందాలి , వారి వల్లనే కదా ఇంత ఎంజాయ్ చేసాము .
మిస్సెస్ కమిషనర్ : తల్లులకే కాదు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ అన్నయ్యే ప్రాణం – ఇంకెంతమందిని వశం చేసుకుంటావు బుజ్జిహీరో …….
చెల్లెళ్లు : అందరినీ మమ్మీ – అంటీ …….
సంతృప్తిగా తిని పిల్లలతోపాటు చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చి , పిల్లలతో కలిసి గ్రౌండ్లో కలిసి ఆడారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *