పెద్దమ్మ Part 20

విక్రమ్ : పెద్ద పెద్ద వెహికల్స్ రావడం చూసి , మమ్మీ మమ్మీ ……. మన లగేజీ వచ్చింది అంటూ పరుగున బయటకువెళ్లాడు .
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు శ్రీవారూ …… , బుజ్జిహీరో కాదు కాదు బుజ్జిమగాడా …….. ఇకనుండీ మేముకూడా ఇక్కడే , మీరు టీవీ చూస్తూ ఉండండి డిన్నర్ సమయానికి లగేజీ మొత్తం లోపల సర్ధించేస్తాము .
నేను లేకుండానా నోవే అంటూ హాసిని బుగ్గపై చేతితో ముద్దుపెట్టి పరుగుతీసాను .
హాసిని : అన్నయ్యా అన్నయ్యా ……. నేనూ వస్తాను ఆగు ……
హాసిని చేతిని అందుకుని వాళ్ళు కొత్తగా ఉండబోవు బిల్డింగ్ దగ్గరకువెళ్లాము . వెనుకే మిస్సెస్ కమిషనర్ – బామ్మ వచ్చారు , లోపలికివెళ్లి వర్కర్స్ తెచ్చిన బాక్సస్ ఎంప్టీ చేసి సరైన స్థానంలో సర్దుతున్నారు .

వర్కర్స్ తోపాటు ఒక బాక్స్ ను అందుకుని లోపలికివెళ్ళాను .
బుజ్జిహీరో బుజ్జిహీరో …….. అంటూ మెయిన్ గేట్ దగ్గరికి కమిషనర్ సర్ పరుగునవచ్చి వెంటనే అందుకుని లోపలికితీసుకెళ్లి ఉంచి వచ్చారు . నో నో నో …. లగేజీ లోపల పెట్టేందుకు చాలామందే ఉన్నారు , బుజ్జిదేవుడితో పనిచేయిస్తే ఇక ఏమైనా ఉందా మీ మేడం గారు – పిల్లలు నన్ను వాయించేస్తారు , హమ్మయ్యా …… మీ మేడం గారు చూడలేదు – హాసినీ డార్లింగ్ …… మీ మమ్మీకి చెప్పకు ప్లీజ్ ప్లీజ్ …….
హాసిని : లవ్ యు డాడీ ఉమ్మా ఉమ్మా …… , అన్నయ్యా …… కావాలంటే అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని ఆర్డర్ వెయ్యండి .
కమిషనర్ సర్ : Yes yes yes …….
సర్ ……. మీకు సంబంధించిన దేనిలోనైనా నేను సహాయం చెయ్యకుండా ఉండలేను . చెల్లీ …… ప్లీజ్ ప్లీజ్ …….
హాసిని : నో అంటే నో అన్నయ్యా ……. , డాడీ …… అది మా లగేజీ – మా రూమ్ లో జాగ్రత్తగా పెట్టించండి – బోలెడన్ని టాయ్స్ ఉన్నాయి – అవంటే అన్నయ్యకు నాకు చాలా ఇష్టం అని తెలుసుకదా …….
కమిషనర్ సర్ : బాయ్స్ …… వాటిని జాగ్రత్తగా ఫస్ట్ ఫ్లోర్ లోని ఫస్ట్ రూంలో జాగ్రత్తగా ఉంచండి .
వర్కర్స్ : Yes సర్ …….
అయితే ఒకపనిచేస్తాను చెల్లీ – తమ్ముడి రూమ్ ను నేనే అందంగా సర్దుతాను , చెల్లీ …… ok ok అనవా ప్లీజ్ ప్లీజ్ ……
హాసిని : లవ్ టు అన్నయ్యా …… పదండి ముగ్గురమూ కలిసి సర్దుదాము అని పైకివెళ్లాము .

వర్కర్స్ …… తెచ్చిన బాక్సస్ ను ప్రక్కన పెట్టించి ముందుగా రెండు బుజ్జి బెడ్స్ ను చెల్లికి – తమ్ముడికి ఇష్టమైన దగ్గర వేయించాము . అంతలో మరొక బుజ్జి బెడ్ వచ్చింది …….
అన్నలూ ……. ఈ గదిలో రెండు బెడ్స్ మాత్రమే , ప్రక్క గదిలోకి అయిఉంటుంది , సర్ ను అడగండి ……..
నో నో నో …… న్యూ బెడ్ ఫర్ మా బుజ్జిదేవుడికోసం , బంగారుతల్లీ …… మీ అన్నయ్య ఎప్పుడైనా పడుకోవాలని అనుకుంటే ఇక్కడికే వచ్చి పడుకోవడం కోసం తెప్పించాను , ఎక్కడ వేయించమంటారు అని సర్ అడిగారు .
లవ్ యు డాడీ – లవ్ యు డాడీ అంటూ సంతోషంతో వెళ్లి సర్ ను హత్తుకున్నారు . యాహూ …… ఇకనుండీ మా ముగ్గురి రూమ్ – అన్నయ్యా అన్నయ్యా …… మధ్యలో మధ్యలో అనిచెప్పండి అంటూ చేతులు అందుకున్నారు .
సర్ …… అంటూ సంతోషంతో కళ్ళల్లో నుండి బాస్పాలు వచ్చేసాయి .
హాసిని : అన్నయ్యా …… ఎందుకు ఏడుస్తున్నారు ? .

అవి ఏడుపు వలన వచ్చిన కన్నీళ్లు కాదు చెల్లీ ……. , సంతోషంతో వస్తున్న ఆనందబాస్పాలు అంటూ అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ లోపలికివచ్చి , సర్ కు థాంక్యూ చెప్పి హాసినికి ముద్దులుపెట్టారు – అంతేలే చెల్లీ …… మీకు , సర్ కు , మీ మమ్మీకి ….. బుజ్జిదేవుడు అంటేనే ఇష్టం నా బెడ్ ఎక్కడ ? , ఎక్కడ చెప్పు చెల్లీ ? ఈ ఈ ఈ …… అంటూ హాసిని బెడ్ పై కూర్చుని యాక్టింగ్ చేస్తున్నారు .
కమిషనర్ సర్ : మీ పెద్ద అక్కయ్య కూడా వచ్చి ఇలా యాక్టింగ్ …… అదే అదే ఏడ్చేలోపు ఏకంగా రెండు కాట్స్ – బెడ్స్ తెప్పించేస్తాను .
హాసిని : నో నో నో డాడీ …… , ప్లేస్ సరిపోదు …….
అక్కయ్య : అంటే మేము ఇష్టం లేదు అనేకదా ……. ఈ ఈ ఈ ……
హాసిని : బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకుని , యాక్టింగ్ చాలు అక్కయ్యా …… మాకు తెలుసులే అంటూ అంటూ ముద్దుపెట్టింది – అక్కయ్యా ……. మనిద్దరం ఈ బెడ్ పై పడుకుందాము మీకిష్టమైతేనే …….
అక్కయ్య : లవ్ టు లవ్ టు చెల్లీ …… , ఇందుకు బెడ్స్ వద్దన్నావా …… , ఈ మట్టి బుర్రకు అర్థమే కాలేదు – ఇష్టమైతేనే ఏమిటి చెల్లీ ……. చాలా చాలా చాలా ….. చాలా ఇష్టం ఉమ్మా ఉమ్మా ……. , మరి అక్కయ్య …… ? .
హాసిని : అదిగో అన్నయ్యతోపాటు అన్నయ్య బెడ్ పైన ……..
కమిషనర్ సర్ : ప్రాబ్లమ్ solved …… , మీ మిగతా ఐటమ్స్ పంపిస్తాను అని వెళ్లిపోయారు .

అక్కయ్య : వాఁహ్హ్ ……. ఉమ్మా ఉమ్మా , తమ్ముడూ …… నీకిష్టమే కదా ……
ఇక అంతే నా దేవత నుండి దెబ్బలే దెబ్బలు అంటూ నవ్వుకున్నాము .
అక్కయ్య : మా బుజ్జిహీరోనే బుజ్జిదేవుడు అని తెలిస్తే అలా ఏమీ జరగదులే తమ్ముడూ ……. అని గుసగుసలాడుకున్నారు .
అక్కయ్యా ………
అక్కయ్య : ఏమీలేదు ఏమీలేదు తమ్ముడూ …… , అలా జరిగేంతవరకూ నేను ….. తమ్ముడి బెడ్ పై – అక్కయ్య …… హాసిని బెడ్ పై షేర్ చేసుకుందాము .
హాసిని : Ok అక్కయ్యా …….
అక్కయ్య : లవ్ యు చెల్లీ …… , తమ్ముడూ …… నన్ను పిలవకుండానే పిల్లల రూమ్ ను సర్దేస్తున్నారు కదూ నేను మళ్ళీ బుంగమూతిపెట్టుకున్నాను .
ఇలా బుంగమూతిపెట్టినప్పుడు ఏమిచెయ్యాలో మాకు తెలుసు అక్కయ్యా …… , చెల్లీ ……. రెడీ 3 2 1 అంటూ ఒకేసారి చెరొకవైపునుండీ అక్కయ్య బుగ్గలపై ముద్దులు కురిపించాము పెదాలపై చిరునవ్వు విరిసేంతవరకూ ……..
అక్కయ్య : అమ్మో అమ్మో ……. క్షణంలో అలక మాన్పించేశారు అంటూ ఇద్దరినీ ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
అక్కయ్యా …… మన దేవత ఒంటరిగా ఉన్నారా …… ? .
అక్కయ్య : కంగారుపడకు తమ్ముడూ ……. , ఇద్దరమూ వచ్చాము , కింద వంట గదిలో వంట సామానులను సర్దడంలో సహాయం చేస్తున్నారు – ఎంతైనా దేవత దేవతే ……..
అక్కయ్యా ……. మీరు దర్జాగా కూర్చుని , అందంగా ఎక్కడ ఏమి ఉంచాలో ఆర్డర్ వెయ్యండి అంటూ ముద్దుపెట్టి లేచాము .
అక్కయ్య : తమ్ముడూ …… సర్దడంలో సహాయం చేసేది కళ్ళు కాదు చేతులు , ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ …… లెట్ మీ హెల్ప్ అంటూ ఇద్దరికీ ఆపకుండా ముద్దులు కురిపిస్తున్నారు.
ఇన్ని ముద్దులుపెడితే ఒప్పుకోకుండా ఉండగలమా ……..
అక్కయ్య : లవ్ యు లవ్ యు తమ్ముడూ – చెల్లీ …… అంటూ ముద్దులుపెట్టి బాక్సస్ ఒక్కొక్కటే ఓపెన్ చేశారు .
నలుగురమూ కలిసి ఉత్సాహంగా చిరునవ్వులు చిందిస్తూ మధ్యమధ్యలో ముద్దులు ఆస్వాదిస్తూ …… , 15 మినిట్స్ కు ఒకసారి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి కిందకువెళ్లి దేవతను చూసి పెదాలపై చిరునవ్వులతో మరింత ఉత్సాహంతో రెండు గంటల్లో పూర్తిచేసాము .

Wow బ్యూటిఫుల్ సూపర్ ……. అంటూ మిస్సెస్ కమిషనర్ – నా దేవత – బామ్మ లోపలికివచ్చారు . ఎంత అందంగా రూమ్ సర్దుకున్నారు ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……
హాసిని : అన్నయ్య – అక్కయ్య ……. మమ్మీ , మీ ముద్దులన్నీ …… అన్నయ్యకు – అక్కయ్యకే …….
నో నో నో కేవలం అక్కయ్యకు మాత్రమే మేడమ్స్ …… , అక్కయ్య ఆర్డర్ వేసినట్లుగా మేము సర్దాము అంతే …….
అక్కయ్య : నో నో నో ……. , నలుగురమూ కలిసే అక్కయ్యలూ – బామ్మా ……. , మీముద్దులన్నీ నలుగురికీ సమానంగా …….
నలుగురికి నలుగురూ సరిపోయారు అంటూ నవ్వుకున్నారు .

హాసిని : మేడం – బామ్మా – మమ్మీ ……. ఇది కుడివైపున్నది నా బెడ్ – ఎడమవైపున ఉన్నది అన్నయ్య బెడ్ – మధ్యలో ఉన్నది అన్నయ్య బెడ్ …… , అన్నయ్యకోసం …… డాడీ నే కొత్త బెడ్ తెప్పించారు .
దేవత : మీకు – సర్ కు – మీ మమ్మీకి …… మీ అన్నయ్య అంటేనే ఇష్టం , నేను – చెల్లి ……. ఈ ఈ ఈ ……
హాసిని – విక్రమ్ – అక్కయ్యతోపాటు నేనూ లోలోపలే నవ్వుకున్నాను .
దేవత ఆశ్చర్యపోయారు .
అక్కయ్య : అక్కయ్యా …… రెండుగంటల ముందు మీ ప్లేస్ లో నేను ఉన్నాను అంటూ వెళ్లి దేవత చేతిని చుట్టేశారు .
దేవతకు అర్థమై నవ్వుకున్నారు . చెల్లీ …… ఎవరెవరు ఎక్కడో చెప్పు మరి …….
హాసిని : మేడం ….. మీరు , నేను …… ఈ బెడ్ పై – అన్నయ్య , అక్కయ్య …… ఈ బెడ్ పై …….
దేవత : అయితే ok , లేకపోతే మూడో కన్ను తెరిచేసేదానిని ……. అంటూ నవ్వుకున్నారు .
బామ్మ : ఈరోజు నుండే అలా పడుకుంటారా ….. ? .
అక్కయ్య : బామ్మా …… అంటూ సిగ్గుపడుతూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , బామ్మ గుండెలపైకి చేరారు ఆశతో …….
హాసిని : అన్నయ్య – అక్కయ్య – మేడం కు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు …….
బామ్మ : ఆర్డర్ వేయొచ్చుకదా హాసిని తల్లీ …… ప్చ్ …… , చిట్టితల్లీ …… బాధపడకు మేంఉన్నాము కదా …….
అక్కయ్య : లవ్ యు బామ్మా ……. , ఎన్నిరోజులైనా నెలలైనా సంవత్సరాలైనా సంతోషంగా ఎదురుచూస్తాను – మొదట అక్కయ్య తరువాతనే నేను …….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *