రొమాంటిక్ చర్చ్నింగ్ 15 71

ఆ వెర్రి చూపులు ఆపి, నేనడిగిన వాటికి సమాధానం చెప్పు అనేసరికి ఈ లోకం లోకి వచ్చా.

ఏవేవో ప్రశ్నలు అడిగింది,అసలే మనం కాస్త మెరిక గల స్టూడెంట్ కాబట్టి టపీమని జవాబులు చెప్పా..

హ్మ్మ్ మంచి స్టూడెంట్ నే,ఏమంటే కాస్త వంకర బుద్ది అంటూ నన్ను పరిశీలనగా చూసింది.

ఆమె మాటకి నా దగ్గర సమాధానము లేక తల వంచుకున్నా.

చూసినప్పుడు లేని సిగ్గు,ఇప్పుడెందుకు కాస్త నటించడం ఆపు అంది.

మళ్లీ మౌనమే నా సమాధానం,కానీ ఆమె పైన మాత్రం ఎటువంటి బ్యాడ్ ఫీల్ లేదు కానీ చూడాలన్న తాపత్రయం.

ఇక ఆమె కి ఇబ్బంది కలిగించడం ఎందుకని, ఇంద్రాణి గారు మీ గురించి చెప్పొచ్చు గా అన్నా..

నా మాట కి, నీకు “సాధ్వి” కుటుంబం పైన గౌరవం ఉందా? లేదా?? అంది..

ఎందుకు లేదు??ఉండబట్టే గా ఇంత కష్టపడుతున్నారు గా మా వాళ్ళు,నేనూ అన్నా..

ఆ గౌరవం ఉంటే నన్ను ఏ విషయం నేను చెప్పినంత వరకూ అడగకు అంది సూటిగా చూస్తూ..

ఆమె మాటకి మారుమాట్లాడకుండా సరే అని తలూపి,చివరగా ఒక్క సందేహం అన్నా.

ఏంటి చెప్పు.

ఇంతకు ముందు పూజ కి వెళ్లిన “మధనులు” కి ఇలాంటి గండాలు వచ్చాయా?అన్నా..

లేదు ,రాలేదు ఎవ్వరికీ.

మరి నాకే ఎందుకు ఈ పరిస్థితి??

ఎందుకంటే నీ వల్ల మాకు శాప విమోచనం కలుగుతుంది అన్న భయం శత్రువుల్లో ఏర్పడింది గనుక..

శత్రువులా??ఎవరు ఇంద్రాణి గారు..

ముందు ముందు తెలుస్తుంది నీకే..

సరే అని తలూపి,ఇక నేను వెళ్ళొచ్చా అన్నా..

ఏమి అంత తొందర??కాసేపు ఉండు నాకూ బోర్ గా ఉంది అంది..

వద్దండి,ఇక్కడ ఉంటే మిమ్మల్ని నా ప్రశ్నలతో విసిగించి మీకు కోపం తెప్పిస్తానేమో..

అందుకు కాదులే నీ భయం, ఎందుకు వెళ్తాను అంటున్నావో నాకు తెలుసు(ఆమె మొహంలో చిరు మందహాసం).

ఏంటో చెప్పండి అన్నా ఆమె మనసులో ఆలోచన తెలుసుకుందామని..

సరేలే అవన్నీ ఎందుకు అని దాటవేస్తూ,ఏంటి “సువర్ణ” పైన చాలా అభిమానం పెట్టుకున్నావే అంది కళ్ళెగరేస్తూ..

మీకెలా తెలుసు అన్నా.

ఆ మాత్రం తెలియదా??ఇందాకా నీ చూపులు సువర్ణా బొమ్మ పైన ఉండటం గమనించా అంది..

హో అదా ..

హా అదే, ఏంటి విషయం?(తన మొహం లో నా అంతరంగం తెలుసుకోవాలన్న కుతూహలం).

ఏమీ లేదండి,ఆ కల్లా, కపటం తెలియని ఆమె రూపు ఎందుకో నన్ను విపరీతంగా ఆకట్టుకుంది అందుకే ఆ చూపులు,అంత తప్ప ఏమీ లేదు అన్నా..

హ్మ్మ్ అని నిట్టూర్చి,నేను ఏదో ఉందని అనుకున్నానే??(తన కళ్ళల్లో కాస్త చిలిపితనం).

మీరు మరీనూ,ఏమీ లేదండీ బాబూ,అయినా ఆ సుమనోహర అమ్మాయి పైన మధుర భావన పెంచుకోవడం నా స్థాయి కి తగ్గది కాదు అన్నా విశ్వాసం తో.

అందులో తప్పేముంది??నీ పైన వాళ్ళు నమ్మకం పెట్టుకున్నప్పుడు ,నువ్వు మాత్రం వాళ్ళ పైన ఆ ఆశ పెట్టుకోవడం సబబే.

ఏమో అండి, అవన్నీ నేను ఆలోచించలేదు ,ప్రస్తుతానికి నా మదిలో ఉన్న ఒకే ఒక కోరిక ఏంటంటే ఆ అమాయకపు దేవతలకు శాప విమోచనం కలిగించాలన్నదే..

ఆ మాట కి ,ఇంద్రాణి కళ్ళల్లో నుండి కన్నీళ్లు జల జలా రాలాయి ఒక ప్రవాహం లా, ఆమె బాధ కి చిహ్నంగా ఆమె ఎర్రటి మొహం మరి కొంచెం ఎర్రగా అయిపోయింది..

ఆమె బాధ చూసిన నాకూ ఎందుకో బాధ కలిగి,ఏంటండీ మీరు?ఎందుకు ఏడవడం అన్నా..

నీకేమి తెలుసు సంజయ్ ఇది బాధ మాత్రం కాదు,ఇంతవరకూ పూజ కి వచ్చిన ఏ మధనుడూ ఇంత అభిమానంగా ఇచ్చిన కార్యాన్ని చేయలేదు.నిన్ను చూస్తుంటే ఎందుకో తెలియదు ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి నాకు.

మంచివారికి మంచి చేయాలన్న నా ప్రయత్నం ఇది అండీ, ఈ నా ప్రయత్నానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా నా ప్రాణం అడ్డు పెట్టయినా పూర్తి చేస్తా అన్నా కాన్ఫిడెంట్ గా..

2 Comments

  1. Em swamy story రాసేది koncham speed ga rai ledante dengey…endi sodi

  2. Bro next part kuda complete cheya bro

Comments are closed.