రాజసింహుడు కూడా పౌరుషంగా కిందకి దిగి మల్లయుద్ధం కి సిద్ధపడ్డాడు… కర్ణుడు జాగ్రత్త రాజసింహా అని సూచన చేయగా ఒక్కసారిగా పులి లాగా వాడి మీదకి ఉరికాడు.
జ్యోతిరాదిత్యుడు కూడా కొదమసింహంలా కాచుకొని తీవ్రంగా ప్రతిఘటించసాగాడు రాజసింహుడి బలాన్ని….ఒక్క పాతిక నిమిషాలు తీవ్రమైన యుద్ధం జరిగింది…ఆ మాయావి సహనం కోల్పోతూ ఉండగా రాజసింహుడు మాత్రం శాంతంగా అవకాశం కోసం వేచి చూస్తున్నాడు…. ఒక్కసారిగా దొరికిన అవకాశంతో జ్యోతిరాదిత్యుడు యొక్క ఛాతీ పైన ఎగిరి తన్నాడు.రాజసింహుడి బలానికి అల్లంత దూరంలో పడిపోయాడు ఆ మాయావి…వాడు తేరుకునే లోపే మెరుపులా లంఘించాడు రాజసింహుడు,ఒక్క ఉదుటున వాడి ఛాతీ పైన కూర్చొని వాడి భుజాలని తీవ్రంగా కొట్టడం మొదలెట్టాడు…రాజసింహుడి దెబ్బకి భీతిళ్లిపోయాడు ఆ మాయావి,ఆ దెబ్బలని కాచుకోలేక నిస్సహాయుడిగా మిగిలిపోయాడు…విపరీతమైన కోపంతో జ్యోతిరాదిత్యుడు ని దంచుతున్న రాజసింహుడికి ధనుంజయ మహారాజు గొంతు వినిపించింది ఆగు సింహా అని..
ధనుంజయ మహారాజు కి బందీ గా వస్తున్న జ్యోతిరాదిత్యుడు తండ్రి పద్మనాభుడు తన ఓటమిని అంగీకరించి సంధి కోసం వేడుకోవడంతో ధనుంజయుడు రాజసింహుడిని ఆగిపోమన్నాడు…
అందరూ దగ్గరికి రావడంతో సంధి షరతులు నిర్ణయించు రాజ్యవర్ధనా అంటూ ధనుంజయుడు ఆదేశించాడు.
జ్యోతిరాదిత్యుడు అవమాన భారంతో కుంగిపోయాడు తల దించుకొని…ఆత్మనూన్యత లో పడిపోయాడు నేనేంటి?వీడి చేతిలో చావు దెబ్బలు తినడం ఏంటి అని??
సంధి షరతులు గా శిశుపాలుడు రాజ్యం రాజసింహుడికి దక్కగా,మిగిలిన రాజ్యాలని ధనుంజయుడు, రాజ్యవర్ధనుడు పంచుకున్నారు..పద్మనాభుడు తన అర్ధ రాజ్యాన్ని సంధి షరతు గా రాజసింహుడికి అప్పగించాడు….
శత్రు రాజ్యాల వాళ్ళు అందరూ వెళ్లిపోగా,ఇక్కడ ఆనంద సంబరాలు మిన్నంటాయి…
భేతాళుడు ప్రేమగా రాజసింహుడు దగ్గరకు వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు శభాష్ సింహా అంటూ…
ఇదంతా మీ వల్లే సాధ్యం అయింది గురువర్యా,నా తరపు నుండి మరొక గురు దక్షిణ ఈ విజయం అని హుందాగా రాజసింహుడు అన్నాడు..
ధనుంజయ మహారాజు మాత్రం తన అల్లుడిని పొందానన్న ఆనందంతో ఈ విజయాన్ని మరింత ఆనందంగా భావించి మురిసిపోయాడు… ఆ సంతోష సమయంలో ధనుంజయుడు ఒక ప్రకటన జారీ చేసాడు తన కూతుర్లు ని రాజసింహుడికి ఇచ్చి వివాహం జరిపిస్తానని..
ఆ ప్రకటన రాజసింహుడిలో కాస్తంత ఆందోళన రేకెత్తించగా,భేతాళుడు మాత్రం ఇది ముందే జరుగుతుంది అనుకున్నాడో ఏమో మౌనంగా ఉండిపోయాడు..
రాజసింహుడు ధనుంజయుడు దగ్గరకు వచ్చి,మామా నేను భేతాళ గురువర్యుడికి ఒక మాట ఇచ్చాను తన కూతురు అహల్య ని వివాహం ఆడుతానని, ఆ మాటని తప్పలేను అని వినయంగా చెప్పడంతో ధనుంజయ మహారాజు కాస్తా ఆలోచించి శభాష్ రా అల్లుడూ మొత్తానికి రాజనీతి ని కాపాడావు నిజంగా నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది నీ అభిప్రాయం కి నేను విలువ ఇస్తాను చింతించకు అంటూ ధైర్యం చెప్పి భేతాళుడు దగ్గరకు వెళ్లి,భేతాళా నాదొక విన్నపం తీరుస్తావా???అని వినయంగా అడిగాడు.
మహారాజా నన్ను మీరు క్షమించాలి,ఇదొక తెలియక చేసిన పొరపాటు..ముందుగా రాజసింహుడు రాజవంశపు పుత్రుడు అని తెలిస్తే ఈ కోరిక కోరేవాన్ని కాదు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు..
భేతాళా ఇందులో నీ తప్పేమీ లేదు,వాడొక వజ్రం ,వాడిని ఎవ్వరూ పోగొట్టుకోరు…నేను అడిగేది ఏంటంటే ముందుగా నీకిచ్చిన మాట ప్రకారం అహల్య నే పట్టమహిషిగా చేద్దాం కానీ నువ్వు,అహల్య కలిసి పెద్ద మనసు చేసుకొని నా ఇరువురు కుమార్తెలనీ పట్టమహిషలుగా ఆదరిస్తే అంతకన్నా నాకు సంతోషం ఉండదు అన్నాడు..
ఎంతమాట మహారాజా,మీ సూచన ప్రకారమే అంతా జరుగుతుంది అని భేతాళుడు అభయమివ్వగా,ధనుంజయుడు సువర్ణ, ఇంద్రాణి ల వైపు చూసి పుత్రికల్లారా మీకిది సమంజసమేనా అని అడిగాడు..
Sir meeru allredy chadivina episodes malli pedutunnaru