హ హ్హా నీ ఆటలు నా దగ్గర చెల్లవు రా మూర్ఖా, నేను ఉన్నది నీ అంతం కోసమే అన్నది మరవకు…ఇప్పటికే అర్థం అయ్యుంటుంది గా నా బలం ఏంటో అన్నది అంటూ వాడిని అవహేళనగా మాట్లాడాను..
ఒక్కసారిగా వాడి స్వరంలో ఆవేశం పొంగింది, నీ అంతం చూడక మానను రా అంటూ హూంకరించి మాట్లాడటం ఆపేసాడు…
వెళ్ళిపోయాడు అని అర్థం అయ్యి,మీరు భయపడకండి వాడి ఆటలు సాగవు అంటూ ఇద్దరికీ ధైర్యం చెప్పి బయలుదేరాను…
ఇంటికి వచ్చి బెడ్ పైన పడుకొని ఆలోచనలో పడ్డాను ప్రస్తుత పరిస్థితి గురించి… ఒకవేళ నా మధనం సక్రమంగా జరగకపోతే ఎవరినో ఒకరిని కోల్పోక తప్పదు,ఆ పరిస్థితి రాకుండా కష్టపడాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాను…
అన్నింటి కంటే ఎక్కువ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇందులో పవిత్ర రావడం, ఆ విషయమే నన్ను తొలిచివేస్తోంది… ఎక్కడో ముంబై లో ఉన్న పవిత్ర ఇందుకోసమే వచ్చిందా??లేక తనకి ఏ విషయమూ తెలియదా???అంత పద్దతిగా ఉన్న పవిత్ర నిజంగా లేచిపోయిందా?లేక పని పైన ముంబై లో ఉన్నానని చెప్పిందా???తల హీటెక్కింది ప్రశ్నలు,అనుమానాలతో…
ఇలా కాదు డైరెక్ట్ గా అడిగేస్తే పోతుంది గా అని డిసైడ్ అయ్యి పుస్తకాన్ని ఓపెన్ చేసాను…
ఫ్లాష్ బ్యాక్:::
రాజసింహుడు మునుపెప్పుడూ యుద్ధంలో ప్రయోగించని అష్టదిక్కుల వ్యూహం తో తన సైన్యాన్ని ఉరికించాడు ముందుకి…ఆ సైన్యం కి తోడుగా సువర్ణ,ఇంద్రాణి, పద్మలత లు బయలుదేరగా ఉమామహేశ్వరి చంద్రశేఖరుడు పైకి ఉరికింది..కర్ణుడు ,సూర్యకీర్తి లు జ్యోతిరాదిత్యుడు పైకి ఉరకగా,నక్షత్రుడు,రాజ్యవర్ధనుడు, ధనుంజయుడు,శ్రీదేవీ,అహల్య,భేతాళుడు మిగిలిన రాజుల వైపు కత్తి దూసారు…రుద్రదామనుడు కూడా వాళ్ళకి జత కలిసాడు.
యోధ వంశపు యోధులు రెచ్చిపోయారు శతృమూకల పైకి విరుచుకుపడి..సువర్ణ,ఇంద్రాణి,పద్మలత ల వీరత్వం ఒక్కసారిగా చూపించేసరికి శత్రు మూకలు చెల్లాచెదురుగా భీతిళ్ళడం మొదలైంది.
రాజసింహుడు మాత్రం తన సైన్యానికి దారి చూపించి తన అశ్వాన్ని శిశుపాలుడు వైపు ఉరికించాడు…ఒక్క ఉదుటున తన ఖడ్గం ని తీసి శిశుపాలుడు పైకి లంఘించాడు….
శిశుపాలుడు సామాన్యుడేమీ కాదు,రాజసింహుడి దెబ్బని కాచుకొని తిరగబడ్డాడు ప్రతిగా తన యుద్ద నైపుణ్యాలను ప్రదర్శిస్తూ..
రాజసింహుడు తన బలం,తెలివి ప్రదర్శిస్తూ శిశుపాలుడు యొక్క ప్రతి చర్యనీ తిప్పికొడుతూ పైచేయి సాధించసాగాడు.. రాజసింహుడు యొక్క బలం ముందు వాడి ఆటలేమీ చాలకపోవడంతో శిశుపాలుడు తన అస్త్రం అయిన కర్ణపిశాచిని విద్యని ప్రయోగించాడు రాజసింహుడిని వశపరుచుకోవడానికి…
అప్పటికే భేతాళుడు ఈ విషయం చెప్పడంతో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉన్న రాజసింహుడు వాడి కంటి చూపుని పసిగట్టి వాడి మంత్రాన్ని కాచుకొని ఆ ప్రయత్నాన్ని కూడా వమ్ము చేసాడు…
దాంతో శిశుపాలుడు అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు..ఆవేశంతో పట్టుతప్పి ఒక్కసారిగా రాజసింహుడు పైకి ఉరికాడు..అదే అదునుగా భావించిన రాజసింహుడు ఒక్క వేటుతో వాడి తల ని తెగ నరికాడు….ఒక్క క్షణంలో తల వేరయ్యి విగతాజీవిగా పడిపోయాడు శిశుపాలుడు…
తన కసి తీరడంతో విజయోత్సాహం తో తన అశ్వాన్ని జ్యోతిరాదిత్యుడు వైపు అదిలించాడు…
ఒక్క అర్ధ గంటలో యుద్ధ వాతావరణం పూర్తిగా మారిపోయింది… రేనాటి చోళ వంశం,మట్లి వంశం,యోధ వంశం యోధులు శత్రువులని తెగ నరికారు…సువర్ణ, ఇంద్రాణి, పద్మలత ల బలం సైన్యానికి తోడవడంతో ముందుండి ఆ మహాసైన్యాన్ని ఊచకోత కోసారు.. ఉమామహేశ్వరి చంద్రశేఖరుడి తల ని వేరు చేసింది…సూర్యకీర్తి,కర్ణుడు ఆ జ్యోతిరాదిత్యుడు యొక్క మాయల్ని కాచుకుంటూ వాడిని ప్రతిఘటిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు శత్రు రాజులని తెగ నరికారు…
ఒక్క పద్మనాభుడు ఇంకొక ముగ్గురు రాజులు వీరోచితంగా పోరాడుతున్నారు…శత్రు రాజ్యాల సైన్యం చెల్లాచెదురుగా చీలిపోయింది ప్రాణభీతితో…
అప్పుడే రాజసింహుడు కర్ణుడు, సూర్యకీర్తి ల వైపు వచ్చి తన కర్ణపిశాచిని విద్యని ప్రయోగించాడు..ఒక్కసారిగా ముగ్గురి ప్రతిఘటన నితట్టుకోలేక పోయాడు జ్యోతిరాదిత్యుడు…ఇక లాభం లేదనుకుని రాక్షస విద్యలని ప్రయోగించడం మొదలెట్టాడు…రాజసింహుడు ముందుగానే మేల్కొని కర్ణుడు,సూర్యకీర్తి లను పక్కకి వెళ్ళండి అని చెప్పి జ్యోతిరాదిత్యుడు ని కాచుకున్నాడు ధైర్యంగా…కొద్దిగా తెలిసిన విద్యలతో అతి తెలివిగా ఆ మాయావి ని నిలువరించసాగాడు రాజసింహుడు…రాను రానూ జ్యోతిరాదిత్యుడు లో సహనం తగ్గిపోయి ముఖాముఖి యుద్ధానికి సిద్ధమై తన అశ్వాన్ని దిగి రాజసింహుడు ని రెచ్చగొట్టాడు..
Sir meeru allredy chadivina episodes malli pedutunnaru