సంవత్సరం:క్రీ.శ 1015 పన్నెండవ మాసం, రేనాటి చోళ వంశం.
మహారాజు: రాజ్యవర్ధనుడు.
ప్రదేశం : సుధామ మహర్షి ఆశ్రమం..
మొదటి లైన్ చదివి ఆశ్చర్యంలో మునిగిపోయాను.
(మిత్రులారా ఇప్పటి నుండి కథ క్రీ.శ 1015 సంవత్సరం నుండి జరుగుతుంది.. ఆ ప్రాంతపు పాత్రలు ప్రస్తుతం జరుగుతున్న పాత్రలకు అవినాభావ సంబంధం ఉంటుంది.ఈ విషయాన్ని గమనించగలరు)
పుస్తకంలోని మొత్తం సమాచారం నాకు కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంటే అందులో లీనం అయిపోయాను..
సుధాముడు,రాజ గురువు..తన ఆశ్రమంలో అనేక రాజ్యాలకి చెందిన యువరాజులకి సకల విద్యలు నేర్పిస్తూ వారిని సకల కళా వల్లభులు గా తీర్చిదిద్దుతూ చుట్టుపక్కల రాజ్యాలచే రాజగురువు అనిపించుకున్నాడు..
తులసీ అని పిలిచాడు సుధాముడు తన ధర్మపత్ని ని..
తులసి పరిగెత్తుకుంటూ వచ్చి,చెప్పండి ఏంటి విషయం అంది..
అది కాదే, యధావిధిగా ఈ సమస్య ఎప్పుడూ వచ్చేదే గా మనకు ,ఏమి చేయాలో అర్థం అవ్వడంలేదు.
హ్మ్మ్ ఇదేమి కొత్త సమస్య కాదులే పతీ, ఇందులో ఆలోచించడానికి ఏముంది??ఎవరు ఈ కార్యానికి అర్హులో వాళ్ళకే నేర్పించండి మీ విద్యలు అన్నీ.
అలాగే నే తులసీ, కానీ సమస్య ఏంటంటే ఆ మట్లి రాజ్యపు యువరాజు “కర్ణుడు”, అజీవిక రాజ్యపు యువరాజు “జ్యోతిరాదిత్యుడు” ఇద్దరూ సమవుజ్జీలుగా ఉన్నారు, ఎవరికి నేర్పించాలో అర్థం అవ్వడం లేదు అని నసిగాడు సుధాముడు..
పతివర్యా, శక్తి సామర్ధ్యాలను పక్కన పెట్టి వ్యక్తిత్వం ఎవరిది మంచిది అయితే వాళ్ళకే ఈ మాయమంత్రపు శక్తుల విద్య అయిన “కర్ణపిశాచిని” ని నేర్పించండి అంది..
ఇద్దరూ మంచివాళ్లే, కానీ కర్ణుడు కొంచెం ఆవేశపరుడు,ఆవేశం అదుపుతప్పి ఈ విద్యని వినాశనానికి వాడతాడేమో అని సందేహంగా ఉన్నది..
అటులైన జ్యోతిరాదిత్యుడు కే నేర్పించండి పతీ,ఈ విద్య నేర్చుకున్నవాడికి ఆవేశం తక్కువ ఉండాలి లేకుంటే ఈ విద్యలని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది..
అలాగే తులసీ,మరి మన శ్రేయోభిలాషి అయిన రేనాటిచోళ రాజ్యవర్ధనుడు కుమారుడు “నక్షత్రుడు” కి ఏమి చేద్దాం?రాజ్యవర్ధనుడు కోపోద్రిక్తుడు అవుతాడేమో అన్న సందేహం వస్తోంది..
మీకా సందేహం అక్కరలేదు రాజగురువా,మీకు ఎవరు ఉత్తముడు అనిపిస్తే వాళ్ళకే ఈ కర్ణపిశాచిని విద్యని బోధించండి అంటూ రాజ్యవర్ధనుడు కంఠం ఠీవిగా వినిపించింది..
చిత్తం మహారాజా,మీరు ఇంత బాగా అర్థం చేసుకుంటారో లేదో అని తెగ మదనపడ్డాను చాలా సంతోషం,రండి ఆసీనులు అవ్వండి అంటూ మర్యాదలు చేసారు తులసి,సుధాములు..
కాసేపు కుశల ప్రశ్నల తర్వాత ,రాజగురువా మా నక్షత్రుడిని ఒక్కసారి పిలిస్తే మాట్లాడి వెళ్తాను, అలాగే మా అల్లుడు మట్లి రాజ్యపు యువరాజైన కర్ణుడిని కూడా పిలవండి..
కాసేపటికి నక్షత్రుడు,కర్ణుడు వచ్చేసరికి మహారాజు ఇద్దరినీ బాగా కలిసిమెలిసి ఉండమని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు..
నక్షత్రుడు,కర్ణుడు ఆశ్రమంలోని రాతిబల్లలు పైన కూర్చొని,ఏరా నక్షత్రా మన గురువర్యులు ఆ జ్యోతిరాదిత్యుడు కి కర్ణపిశాచి విద్యని నేర్పిస్తున్నాడు అని తెలిసింది,నిజమేనా??
అవును రా కర్ణా, నువ్వు ఆ జ్యోతిరాదిత్యుడు చివరి వరకూ పోటీలో నిలబడ్డారు..నీ ఆవేశం మూలాన ఈ విద్యని చేజిక్కించుకొనే అవకాశం జారవిడుచుకున్నావ్ అనవసరంగా..
పోనీలే నక్షత్రా, మనకు కావాల్సింది రాజ్యప్రజల సంక్షేమం మనకు ఆ మాయా విద్యల వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పు?
అలా అని కాదు కర్ణా,ఏ విద్య అయిననూ ఏదో ఒక సమయంలో మనకు ఉపయోగపడుతుంది అన్న విషయం మరువకూడదు..నువ్వు ఆ జ్యోతిరాదిత్యుడు తో అన్ని విద్యలలో సమఉజ్జీవి ఇప్పుడు ఆ కర్ణపిశాచిని విద్యతో వాడు ఒక్క మెట్టు పైకి వెళ్ళాడు అది గమనించు..
వదిలేయ్ నక్షత్రా, ఇక మన చదువు ఇంకొక ఏడు దినాలలో పూర్తి అవుతుంది.ఇంతకీ నీ ఇష్టసఖి అయిన “ఉమామహేశ్వరి”కి నీ ప్రేమ విషయం చెప్పావా లేదా??
హ్మ్మ్మ్ ఇంకనూ చెప్పలేదు రా,ఎందుకో చాలా భయంగా ఉంది నీ చెల్లెలితో..మీ నాన్న ఏమో నాకే ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడు,కానీ నా పైన ఉమా కి ఇష్టం ఉందో లేదో అన్న సందేహం ఉంది.
హబ్బా నక్షత్రా అలా ఏమీ లేదు లే నువ్వు బాధపడకు,పోనీ నేను ఒక్కసారి మాట్లాడనా ఉమా తో??
వద్దు వద్దు కర్ణా,తన మనసు ఎలా చెప్తే అలాగే వెళ్ళాలి..ఈ విషయంలో మన బలవంతం ఉండకూడదు అన్నది మాత్రం గుర్తు పెట్టుకో..
అలాగే లే బావా,నీ ఇష్టం..కానీ నీ అంత మంచోడు మాత్రం మా ఉమా కి భర్తగా రాలేడు అన్నది సత్యం..
అలా ఏమీలేదులే బావా, ఎవరు చెప్పగలరు విధిని,అంతా విధి ప్రకారమే జరగాలి అన్నది గుర్తుపెట్టుకో..
(ఉమామహేశ్వరి ప్రస్తుతం కథలో ఉన్న ఆవిడే,తను ఆ కాలంలో కూడా ఉందా అని ఆశ్చర్యపోయాను…)
హ్మ్మ్ అలాగేలే గానీ,నాకొక సందేహం ఉంది బావా, ఎప్పటినుండో నీకు చెప్పాలని ఉన్నా ఈరోజు చెప్పక తప్పడం లేదు ..
ఏంటి కర్ణా చెప్పు..