తాతయ్యా మీరు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయండి నేను మన వంశస్థుల నివాసాన్ని కనిపెట్టాను అంటూ అడ్రెస్ చెప్పి కాల్ కట్ చేసింది..
ఉమా గారు మీ వాళ్ళందరూ వచ్చే వరకూ మా ఇంటికి వెళ్దాం పదండి,అందరూ వచ్చాక కలిసి వెళ్తే బాగుంటుంది అన్నాను.
.
నీ సలహా బాగుంది సంజయ్ పద అంటూ ఇంటి వైపు బయలుదేరాము..
తొలుత పంకజం అత్త ఇంటికి వెళ్ళాము,అత్త ఉమా ని చూసి ఎవరు రా సంజయ్ ఈ అమ్మాయి అని అడిగింది..
అత్తకి కళ్ళతో సైగ చేసి,అత్తా ఈ అమ్మాయి ఎవరో సాధ్విల వంశస్థురాలు అంట మన ఊరి కోట దగ్గర ఉంటే ఇలా తీసుకొచ్చాను అని టూకీగా చెప్పాను.
నా సైగల అర్థం తెలుసుకున్న అత్త, అవునా రావమ్మా అంటూ తనకి నమస్కరించి లోపలికి తీసుకెళ్లింది..
ఉమా ఆప్యాయంగా నమస్కరించి ఫ్రెషప్ అవ్వడానికి లోనికి వెళ్లడంతో,అత్త ఆదరాబాదరా నా దగ్గరికి వచ్చి ఏంది రా నువ్వనేది అంటూ ఆశ్చర్యం గా అడిగింది…జరిగిన విషయం అంతా చెప్పేసరికి ఆనందంగా నిట్టూర్చి ఒరేయ్ నువ్వే ఆ మధనుడివి అని ఎందుకు చెప్పలేదు అని ఆరా తీసింది..
అదేంటే అత్తా మీరే జాగ్రత్తగా ఉండమన్నారు గా అందుకే తనెవరో పూర్తిగా తెలిసేవరకూ చెప్పకూడదు అని అనుకున్నాను
..
హ్మ్మ్ నిజమేలే కానీ తను మాత్రం ఖచ్చితంగా ఆ సాధ్వి ల తరపు అమ్మాయి లాగే ఉంది రా అంది నమ్మకంగా..
ఎలా చెప్తావే అత్తా అంత నమ్మకంగా??
తన బొట్టు ని గమనించావా ఇంతకీ??ఆ ఆహార్యం,పద్ధతులు అన్నీ ఆ సాధ్వి ల తరపువే అందుకే చెప్తున్నా..
అలాగేలే,ఎవరో వాళ్ళ బంధువులు వస్తున్నారంట అప్పటి వరకూ కామ్ గా ఉండటం బెస్ట్ .అంతలోపు తను వచ్చేసరికి మా మాటలు ఆపేసి తనతో మాట్లాడటం మొదలెట్టాము..
పంకజం గారూ మీకు సాధ్విల గురించి ఏమైనా తెలుసా అంది ఉమా..
తెలియకపోవడం ఏంటి ఉమా??మధనం కి సంబంధించిన పనులు అన్నీ మా వంశం వాళ్లే చూస్తారు..వాళ్ళ దయతోనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము అని నమ్మకంగా చెప్పింది..
హో అవునా??మీరేనా అయితే ఆ ఏర్పాట్లు చూసేది?? ఇంతకీ మీరు అంజన రెడ్డి వారసులేనా అంది..
అవును ఉమా ఆయనే మా కుల పెద్ద,సాధ్విల బాగోగులు అన్నీ చూసుకుంటూ వాళ్ళకి చాలా నమ్మకంగా ఉండేవాడు .
చాలా సంతోషం పంకజం గారు,ఇదిగో ఈ సంజయ్ లేకపోతే నా పనులు ఏవీ ఇంత సులువుగా అయ్యేవి కావు..దేవుడి దయ వల్ల ఇతని సహాయంతో అన్నీ చక్కదిద్దుకున్నాను…వందల సంవత్సరాల నుండి చేస్తున్న మా ప్రయత్నాలకు ఈరోజు సంజయ్ సహాయంతో ఒక మంచి ముగింపు లభించేలా ఉంది..చాలా థాంక్స్ సంజయ్ అంటూ అభిమానంగా మాట్లాడింది.
ఇందులో థాంక్స్ లు ఎందుకులే ఉమా,వాడు ఎప్పుడూ మా అందరి కన్నా ఆ సాధ్విల బాగోగులు చూసేవాడు,నువ్వు సాధ్విల తరపు మనిషి అని తెలిస్తే సహాయం చేయకుండా ఉంటాడా చెప్పు..అందుకే నీకు ఈ చిన్న సహాయం చేసుంటాడు
.
అందుకేనా నన్ను ఆ కోటలో తలుపుని ఓపెన్ చేయకుండా అడ్డుకున్నావ్ సంజయ్??చాలా సంతోషం మా వాళ్ళ పైన నీకు ఉన్న అభిమానంకి ,నీ కృషిని మేము వదులుకోము సంజయ్..లోపలికి వెళ్ళాక నీకు అంతా శుభం జరిగేలా నేను ఏర్పాట్లు చేయిస్తాను సరేనా అంది నవ్వుతూ..
అలాగేలే ఉమా గారు అన్నాను నవ్వేస్తూ..(నా నవ్వుకి అర్థం తెలీదు ఉమా కి).
అలా మాటల్లో ఒక రెండు గంటలు గడిచిపోయాయి,ఉమా ఆ సాధ్విల తాలూకు విషయాలన్నీ చాలా క్లియర్ గా చెప్పింది..తను చెప్పినవి అన్నీ నిజాలే అన్న విషయం నాకు తెలిసొచ్చింది…
ఇంతలోపు వాళ్ల తరపు మనుషుల నుండి కాల్ రావడం,పంకజం గారి ఇంటికి రండి అని చెప్పడం,వాళ్ళు రావడం జరిగిపోయాయి..
ఆ ఇద్దరు మనుషుల్ని చూడగానే అప్రయత్నంగా నే నా చేతులు వాళ్ళకి నమస్కరించేలా చేసాయి..ఇద్దరూ ఆజానుభాహులు,రాజసం వాళ్ళ మొహంలో ఉట్టిపడుతోంది..
పెద్దాయన మాట్లాడుతూ నా పేరు “మహాపతి”,వీడు నా కొడుకు “రుద్రపతి” అని పరిచయం చేసుకున్నాడు..ఇంతలోపు ఉమా నా గురించి చెప్పడంతో ఆయన లేచి నా దగ్గరకు వచ్చి నాయనా ఒక్కసారి నిలబడి నీ కుడి చేతిని చూపించు అన్నాడు..
తటపటాయిస్తూ నే లేచి,ఆయనకి నా కుడి చేతిని చూపించాను..ఆయన నా చేతిని చూస్తూ తన ముఖకవళికలు మార్చేస్తూ ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోయాడు..
అందరమూ ఏమైంది ఏమైంది అని ఆయన్ని పలకరించగా, ఆయన తేరుకొని ఒక్కసారిగా నా పాదాల పైన పడిపోయాడు..
ఒక్కసారిగా అందరిలోనూ ఆశ్చర్యం అధికం అయ్యింది,అయ్యో ఏంటండీ మహాపతి గారూ ఈ పని అంటూ ఆయన్ను లేవదీసాను..
మహాప్రభో మీకు ఏమైనా మా ఉమా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమాపణలు, ఈరోజుటితో మా జన్మ ధన్యం అయింది అంటూ ఆనందభాష్పాలు విదిల్చి మాట్లాడుతున్నాడు..
తాతయ్యా ఎవరు ఈ సంజయ్??ఏంటి మీరు నమస్కరించడం అంటూ ఉమా కంగారుగా అడగగా, అమ్మా ఉమా ఈ సంజయ్ ఎవరనుకున్నావ్ మన వంశాన్ని నిలబెట్టిన మహా వీరుడు తల్లీ,నువ్వేమీ ఇబ్బంది పెట్టలేదుగా ఈ మహాప్రభువుని అన్నాడు..
ఏంటండీ మహాపతి గారు,మేము ఎల్లప్పుడూ మీ సేవకులం అన్న విషయం మీరు మరిచి ఇలా చేయడం అన్నాను..
Send full story