ఈ విషయం ఇప్పుడే ఇక్కడే మర్చిపో 266

దొంగ: ఎం చావాలని వుందా?, లోపలి నుండి మొత్తం నగలు తీ..

అంటూ గొంతు దగ్గర కట్టి బిగాబెట్టాడు.

అక్క: నిజం చెబుతున్నా.., మా డాడీ బాంక్ employer, నగలన్నీ బాంక్ లాకర్ లోనే వున్నాయి, కావాలంటే మొత్తం బీరువా చెక్ చేస్కో.. నాకు తమ్ముడు కావాలి. ఇంకేం అవసరం లేదు. ఇంట్లో వున్నవన్ని తీసుకెళ్ళు. ప్లీజ్..

దొంగ: బీరువాలో వున్న బట్టల్ని విప్పి కింద పడేయి.

అక్క ఒక్క క్షణం కూడా ఆగకుండా, ఒక్కొక్కటి తీసి ఇదిలించి కిందపడేస్తుంది. అలా కొద్దిసేపటికి బీరువా ఖాళి అయింది.

దొంగ: ఇంట్లో ఇంకా లాకర్లు ఎక్కడున్నాయో చెప్పు, నేను వెతుక్కుంటే వీడి చావు తప్పదు.

అక్క: ఇదొక్కటే వుండేది, నా atm లో 10 వేలు పైగా వుంది, password చెబుతా తీసుకో..

అంటూనే ఇంకో కమ్మ తీసి బెడ్ మీద డబ్బు పక్కన పెట్టింది. చాలసేపయ్యేసరికి నేను ఏడుపు కూడా ఆపేసాను.

అక్క: చూడు, ఇవన్ని తీసుకేల్లినట్టు, ఇంట్లో మా పేరెంట్స్ కి కూడా చెప్పను, అనవసరంగా మమ్మల్ని ఏమైనా చేసి సెక్యూరిటీ ఆఫీసర్ల వరుకు వేళ్ళకు.

దొంగ: ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎక్కడ?

అక్క: పెల్లికేల్లారు, లేకుంటే ఇంట్లో అమ్మ నగలు కూడా ఉండేవి..

అక్క: పూజ గదిలో వెండి సామాగ్రి కూడా వుంటాది, తెచ్చివ్వనా?

దొంగ: పదా..,

అంటూ బెడ్ మీద వున్న, డబ్బు బంగారం జేబులో వేస్కున్నాడు. అక్క వెనకే పూజ గది వరకు వెళ్ళాము. అక్క తొందర తొందరగా అక్కడ వున్నా వెండి విగ్రహాలు, దీపాలు అన్ని తీస్కోని కుప్పగా పట్టుకుంది.

దొంగ: ఏదైనా గుడ్డ లో కట్టు..

అక్క వెంటనే దగ్గరలో వున్న, చున్ని తీస్కోని అందులో పోసి, మూటలా కట్టింది.

దొంగ: ఇంకేం వున్నాయో చెప్పూ త్వరగా..

అక్క: నాకు తెలిసి ఇంతే.., ప్లీజ్ ఇక వదిలేసి వెళ్ళిపో.., నువ్వు సేఫ్ మేము సేఫ్..

అక్క ఇవన్ని అస్సలు ఎడ్చకుండా, ధైర్యంగా చేస్తుంది. నాకు మాత్రం పాస్ వస్తుంది. అక్క మాటలు విని..

దొంగ: మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తారు..?

4 Comments

  1. Super చాల బాగుంది ఇంకా వ్రాయండి

  2. చాల బాగుంది ఇంకా వ్రాయండి

  3. Nee story em leda akka

  4. Excellent story

Comments are closed.