కామదేవత – Part 15 70

మధు సమాధానం చెప్పేక.. వాడేడి? అడిగేడు సుందరం.. ఇప్పుడే మీరు వొచ్చేముందే బయటకి వెళ్ళేడు సమాధానం చెప్పింది సుశీల.

ఇంకా వూరినించీ వొచ్చి రెండుగంటలు కాలేదు.. అప్పుడే వూరిమీద పడ్డాడా వాడు? అని సుందరం అడుగుతుండగా..

లేదు నాన్నగారూ.. స్కూళ్ళుతెరిచి 2/3 రోజులైపోయిందిగా.. నేను మిస్స్ ఐపోయిన నోట్స్ తెచ్చుకుందామని పక్కవీధిలో వున్న ఫ్రెండ్ ఇంటికివెళ్ళేను అని సమాధానం చెపుతూ పవన్ ఇంట్లో అడుగుపెట్టేడు..

నువ్వు మరీ అంత నటించెయ్యకురా.. నీసంగతి నాకు తెలియదా? ఇంట్లో ఎదో అల్లరిపని చేసుంటావు.. తప్పించుకోవడానికి బయటకి పారిపోయి నోట్స్ కోసమని నాకు కధలు చెపుతున్నావు అన్నాడు సుందరం

మధు, పవన్ ఇద్దరూ వాళ్ళమ్మ సుశీల ముఖంలోకి చూసేడు.. సుశీల కొద్దిగా అల్లరిగా నవ్వుతూ.. అదేం కాదులెండి.. నాకు అదేచెప్పి వెళ్ళేడు.. మీరు అడిగినప్పుడు అంత వివరం చెప్పకుండా “బయటకి వెళ్ళేడని” మాత్రమే చెప్పేను.. అని కొడుకుని వెనకేసుకొచ్చింది సుశీల..

నువ్వేమీ వాడిని వెనకేసుకురానక్కరలేదు.. ర..రా.. రా.. భోజనం చేద్దం.. రాత్రి బ్రహ్మం ఇంట్లో పెద్ద పూజ జరిగింది.. నాకూ అమ్మకీ అస్సలు నిద్దరలేదు.. నాకు నిద్దరూపేస్తున్నాది.. ఓ రెండుగంటలు నిద్దరపోయి లేచేక.. మీరిద్దరూ మీతాతగారి వూరి ముచ్చట్లు చెపుదురుగాని అంటూ సుందరం భోజనానికి కూర్చున్నాడు..

సుందరం తో పాటుగా మధు, పవన్, సుశీలలు కూడా భోజనాలకి కూర్చున్నారు..