ఆ తరువాత మెలుకువ లోనే కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు మేఘా శైలు మాట్లాడుకోవడం, మేఘా తనని లవ్ చేస్తుంది అని తెలుసుకోవడం, తనకు మళ్ళీ కొత్త ప్రాబ్లెమ్ రాకూడదు అని పైగా తను మేడమ్ లాగే ఉండడం తో తనకు తన స్టోరీ చెప్పెద్దం అనుకోవడం, అలా అనుకుని మేడం గురించి మేడం పట్ల చేసిన దారుణం గురించి మేడం కూతురికే చెప్పేయడం ఆ తరువాత తను మేడం కూతురే అని తెలుసుకోవడం ఇవ్వన్నీ వరుసగా జరిగిపోయాయి..
మేడం కూతురికే మేడం గురించి చెప్పానే అని అనుకుంటూ ఉండగా తను అక్కడ నుండి వెళ్లిపోవడం తో ఎం చేయాలో తెలియలేదు. ఆ తరువాత డాక్టర్ నా డిటైల్స్ అడగగానే ఎవరిని కాంటాక్ట్ చేయాలో అర్దం కాలేదు ఇక తప్పక సిద్దు నాన్న డిటైల్స్ ఇచ్చేయడం, వాళ్ళు మరుసటి రోజు (నాలుగవ రోజు) సిద్దు నాన్న కు కాల్ చేయడం జరిగిపోయాయ్..
ఏమే త్వరగా రా, భరత్ గాడికి మూడు రోజుల క్రితం ఆక్సిడెంట్ అయ్యిందట ఇప్పుడు మెడికల్ క్యాంప్ లో ఉన్నాడంట అంటూ పిలుపు వినగానే పడుకున్న నేను ఒక్కసారిగా లేచి పరుగు లాంటి నడకతో హాల్ లోకి వెళ్ళాను..
వెధవధి ఆ ఆక్సిడెంట్ వాడికే జరగాల్లా నాకైనా బాగుణ్ణు, ఎలా ఉన్నాడో ఏమో అని మనసులో బాధ పడుతూ కళ్ళు తుడుచుకుంటూ ఉండగా పక్కన్నే కూర్చున్న భరత్ అమ్మ అప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏమైనా అయ్యిందేమో అని అంతా ఈ మాయదారి సిటీ వల్లనే, ఆయన రానీ ఇద్దరం కలిసి వాన్ని ఊరికి తీసుకు పోతాం అని అంటూ ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉండగా కాసేపటికి మెడికల్ క్యాంప్ వచ్చింది. వెంటనే బండి లో నుండి దిగి లోపలికి వెళ్ళాం. మనసులో అందరి దేవుళ్ళకు మొక్కుకుంటూ ఛా వాడు అడిగింది ఎదో ఇచ్చి ఉండాల్సింది అనొసరంగా ఇంత పెద్దగా అయ్యేలా చేశా మొత్తం నాదే తప్పు అని అనుకుంటూ కంగారుగా ఎక్కడున్నాడో కనుక్కుని వెళ్ళాం.
భరత్ మాటల్లో..
బెడ్ మీద పడుకున్న నాకు ఎవరో వచ్చినట్లుగా అనిపించగానే కళ్ళు తెరిచా, మా అమ్మ, సిద్దు నాన్న, సిద్దు ఇంకా మేడం అందరూ నా దగ్గరకు రావడం కనిపించింది. మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను నా దెబ్బలనీ చూసి ఏడుస్తూ ఉంటే నేనేమో మేడం వంక చూసా తను ఏమంటుందో అని. తన వైపుకు చూడబోయెంత లో తనే తల తిప్పేసుకుని బయటకు వెళ్లిపోయింది వెళ్ళేటప్పుడు చూసా తను కళ్ళ నుండి వచ్చే నీళ్లను తుడుచుకోవడం..
ఆరోజు అదే చూడడం మేడం ను.. ఆ తరువాత అస్సలు కనిపించలేదు తను.
కాసేపటికి మా నాన్న రావడం, నన్ను వేరే హాస్పిటల్ లో చేరిపించడం అక్కడ రెండు రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడం ఆ మరుసటి రోజు తిరిగి ఇంటికి రావడం జరిగాయి. గడిచిన ఈ ఏడు రోజుల్లో ఒకే ఒక్కసారి చూసా మేడం ను. తను కావాలనే నా ముందుకు రావట్లేదు అని నాకు తెలుసు.
స్టోరీ అసంపూర్తిగా వదిలేస్తే ఎదో వెలితి గా ఉంటుంది. మీరు చేయి తిరిగిన రచయితలా రాస్తున్నారు. మీ శైలి చూస్తుంటే బోబ్బా రమణ గారిలా అనిపిస్తోంది. Any how కధ పూర్తి చేయాలని అనుక్కున్నారు. సంతోషం
స్టోరీ అసంపూర్తిగా వదిలేస్తే ఎదో వెలితి గా ఉంటుంది. మీరు చేయి తిరిగిన రచయితలా రాస్తున్నారు. మీ శైలి చూస్తుంటే బోబ్బా రమణ గారిలా అనిపిస్తోంది. Any how కధ పూర్తి చేయాలని అనుక్కున్నారు. సంతోషం
Bro you’re writing the repeated story, again and again
Anna story chala bagundhi…..evaru charpparu bhagaledhani…asalu ippude ..ineterestinggaa vundhi…ilage contnue ..chei anna…
story bagundhi bro continue cheyandi
Story chepende cheptunnav koddiga chusuko
Waiting for next update plz update fast
Bro update ivvu bro plzzz , chala wait chestunna
Fast ga post chey bro plss
Anna roju oka update ivvandi..naa stry chala interest gaa vundhi…
Nice story
Keep updating
Why you not posted the next nar
Next part bro
Nee bondha story bagany undhi mali mali 2&3times anduku pettav
Story chaala baagundi. Please continue