దుర్గ – పల్లెపడుచు తో – Part 3 48

ఆ దివ్యమైన కురులు, గౌరితో సహా ఇప్పుడు తన కౌగిలిలో నొక్కుకుపోతూండగా వాటిని వాసన చూస్తూన్న దుర్గలో, ప్రకృతి సహజమైన పశువాంఛ చెలరేగింది.

సమయం సందర్భం లేకుండా, పోలీసు డ్రెస్ లోనే రతి కార్యానికి సిద్దమవడం వృత్తి పరంగా తప్పేమోనని దుర్గకు ఒక్కక్షణం అనిపించింది. కానీ, ఆ టైట్ యూనిఫారంలో రెచ్చగొడుతున్న గౌరి బిగువులూ, తన దడ్డు దెబ్బ కోసం కేసి ఆమె పడుతున్న ఆత్రమూ, దుర్గ సంశయాలను ప్రక్కకు తోసేసాయి.

ఒత్తైన జుట్టుతో నిండిన గౌరి తలను సుతారంగా ఒత్తుతూ, వేళ్ళతో ఆమె తల పైభాగాన్ని సుతారంగా మర్థనా చేసింది. గౌరి మొహంపై పడుతున్న కురులను ప్రక్కకు సవరిస్తూ, ఏదో కావాలన్నట్టుగా బేలగా, ఆరాధనగా తననే చూస్తున్న గౌరికళ్ళల్లో కళ్ళు పెట్టిచూసింది. చక్కగా నూనె రాసి,చిక్కటినలుపుతో తళుక్కుమంటూ, చెవులను కప్పుతూన్న కేశ పాయలను చెవులవెనుకకు తోస్తూ, ఆడతనానికి అర్థం చెప్పుతూన్న గౌరికురుల సౌందర్యాన్ని దుర్గ ఆస్వాదించసాగింది.

గౌరిని కౌగలించుకుని ఆమె పిరుదులను నిమురుతున్న తన చేతులను ఆమె వీపు మీదకు తీసుకుని వచ్చింది దుర్గ. వెనుక వైపు పాలిండ్లలా ఎత్తుగా ఉన్న గౌరి రెండు వెన్ను భాగాలపై చేతులు వేసి నొక్కింది. భుజాలను పిసికింది. ఒళ్ళు జలదరించిన గౌరి, దుర్గ వీపుని వేళ్లతో గిచ్చింది. గౌరి అందమైన మొహాన్ని దుర్గ తన గరకు చేతులలోకి పొదువుకొని, బుగ్గలు నిమిరింది. చెవులూ, చుబుకం, మెడలూ నిమిరింది.

తనను చుట్టుముట్తేస్తున్న, కరడుకట్టిన,బలిష్టమైన దుర్గ స్కంధాల ధృడత్వాన్ని చూసి గౌరి మోహితురాలయ్యింది. ఐదేళ్ళ క్రిందటి తన జ్నాపకాల దొంతరలలో నిక్షిప్తమైపోయిన దానిని గుర్తుకు తెస్తూ, ఇప్పుడు దుర్గ నుండి గుప్పు గుప్పున వెలువడుతూ తనను కమ్ముకుంటున్న సహజమైన స్వేద సుగంధం గౌరికి ఒక తీవ్రమయిన ఉత్ప్రేరకంగా పని చేస్తూండగా, దానిని గుండెల నిండుగా పీలుస్తూంటే ఆమెలోని స్థ్రీ హార్మోనులు ఉత్తేజితమయ్యాయి.

తన అరచేతులలోకి ఉన్న గౌరి ముఖారవిందాన్ని దుర్గ ప్రేమగా, కోరికతో ,తాదాత్మ్యతతో చూసుకుంది.

ఇదివరకులా ఆ అందాన్ని క్రూరంగా దునుమాడాలని లేదు. గౌరి అందాలను ఆస్వాదించాలనీ, లాలించాలనీ , ప్రేమించాలనీ, స్వాధీన పరచుకోవాలనీ, స్వంతం చేసుకోవాలనీ, జుర్రుకోవాలనీ దుర్గమనసు అర్రులు చాస్తూ ఉంది.

విశాలమైన గౌరి కళ్ళల్లో కూడా దుర్గకు, తనను వశపరచుకోమన్నట్టు, తనతో ఏకం చేసుకోమన్నట్టు, తనలో నిండిపొమ్మన్నట్లు, సందేహాతీతంగా ఒక తీవ్రమయిన వాంఛ కనబడింది. అవధులు దాటిన ఆ తీవ్రమైన కోరిక విప్పారిన గౌరి కన్నులలో స్పష్టంగా కనిపిస్తోంది.