” ఆరోజు జరిగింది నేను కావాలని చేసింది కాదు అక్షరా… అదంతా అనుకోకుండా జరిగింది…”
“ఎలా నమ్ముతాను “మనసులో అనుకున్నాను నేను..
“నువు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం అక్షరా” అన్నాడు నా మనసు చదివినట్టు..
నేను తలెత్తి అతన్ని చూసాను…
తను నన్ను చూడకుండా తన చేతుల్లో ఉన్న నా చేతుల్ని చూస్తూ చెప్పడం కంటిన్యూ చేసాడు..
“అక్షరా…మీ అక్క పెళ్లిలో నువు కనిపించిన మరుక్షణమే నీ మీద ఇష్టం ఏర్పడింది నాకు… లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో నాకు ఆ క్షణమే తెలిసింది …
నువ్ కనిపించగానే నా మనసులో అనిపించిన దాన్నే నేను నీకు చీటీ మీద రాసి పంపాను..
ఆ రోజ్ నువ్ కనపడిన తర్వాత చాలా సేపటి వరకు మరేదీ కనిపించలేదు నాకు…
నువ్వేటు వెళ్తే నా కళ్ళు అటే తిరిగాయి…
మధ్యాహ్నం ఫ్రెండ్స్ బలవంతంగా నన్ను తీసుకెళ్తేనే వెళ్ళాను…
అంత నచ్చావు నువ్ నాకు…”
“…..”
“ఆ రోజు బయటకు వెళ్లిన తర్వాత నా ఫ్రెండ్స్ అడిగారు ‘ఏంటిరా ఏంటి సంగతి’ అని….
నాకు నువ్ నచ్చావని వాళ్ళతో చెప్పా…
అప్పటివరకు నేను ఏ అమ్మాయిని చూడలేదు…
అలాంటిది మొదటి సారి నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు… నన్ను కంగ్రాట్యులేట్ చేస్తూ పార్టీ కావాలని అడిగారు…
నువ్ కనబడిన సందర్భాన్ని నాక్కూడా సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది…
అందుకే సరే అని పెద్ద హోటల్ కి వెళ్ళాం…
నేను సాధారణంగా తాగను కానీ ఆ రోజు వాళ్ళు నేను తాగితే గానీ తాగను అంటే కొద్దిగా తాగాను…
మాటల మధ్యలో నా లవ్ సక్సెస్ కావాలంటే నేను నీకు అదే రోజు ప్రపోస్ చేయాలని నా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు.. లేదంటే నేను నిన్ను అందుకోలేనన్నారు…
నేను ఛాలెంజ్ కి ఒప్పుకున్నాను…
నిజానికి నాక్కూడా నిన్ను మళ్లీ చూడాలనిపించింది…
ఆ రాత్రికి నీ రూమ్ కి వచ్చి నీకు ప్రపోస్ చెయ్యాలని అనుకున్నాను…
మందు వాసన నోటినుండి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా….
మీరు అప్పగింతలు చేస్తున్నప్పుడే నేను మీ ఇంట్లోకి వచ్చి ఒక గదిలో అటక మీద దాక్కున్నాను…
అందరూ పడుకున్నాక నువ్ ఉన్న గదికి వచ్చాను…”
రవి ఎలా వచ్చాడో చెప్తుంటే ఆశ్చర్యంగా అతన్ని చూశా నేను…
నన్ను పట్టించుకోకుండా రవి చెప్పుకుంటూ వెళ్తున్నాడు…
” నేను నీ గదికి వచ్చే సరికి నువ్ నిద్రపోతున్నావ్…
పెళ్లికోసం వేసుకున్న డ్రెస్ లోనే నిద్రపోతున్నావ్ నువ్వు…
నిద్రలో కూడా చాలా అందంగా కనిపించావు నువ్వు…
నాకు నిన్ను లేపాలనిపించలేదు….
నీ పక్కనే కూర్చుని నిన్నే చూస్తూ కూర్చున్నా…
అలా ఎంతసేపు కూర్చున్నానో నాకూ తెలియదు…
ఎంతసేపు చూసినా తనివి తీరలేదు…
చాలా సేపటి తరువాత నువ్ నిద్రలో కదలడంతో నీ చెయ్యి నా మీద పడింది…
మెత్తటి నీ చెయ్యిని నా చేతుల్లోకి తీసుకుని నిమురుతున్నప్పుడే నువ్ నిద్ర లేచావ్…
తర్వాత జరిగింది నీకు తెలుసు………….”
అని కాసేపు ఆగాడు…
“అవును చాలా బాగా ప్రపోస్ చేశావ్… లోకంలో ఎవరూ చేయని విధంగా” మనసులోనే అనుకున్నా…
రవి మళ్లీ అన్నాడు…
“………….కానీ నేను అలా కావాలని చేయలేదు…
నేను వచ్చింది నీకు ప్రపోస్ చేసి వెల్దామని మాత్రమే…
కానీ నేను వచ్చినపుడు నువ్ పడుకున్న విధానం చూసి ముచ్చటేసింది నాకు…. నీ అందం నన్ను మైమరిపింప జేసింది. . నిన్ను ఎక్కువ సేపు చూడొచ్చని అనిపించి నిన్ను లేపకుండా చూస్తూ కూర్చున్నాను…
నువ్ లేచాక కూడా నాకెలాంటి దురుద్దేశమూ లేదు…
నీకు గుర్తుందో లేదో…
మొదట నువ్ ఎందుకొచ్చావ్ అని అడిగినప్పుడు కూడా నిన్ను చూడలనిపించి వచ్చాననే చెప్పాను…
అది నిజంగా నిజం కూడా…
ఫ్రెండ్స్ ఛాలెంజ్ నాకు అక్కడికి రావాలనే కోరికకు సాకు మాత్రమే….
నిజానికి నిన్ను చూడాలనే వచ్చాను…
నువ్ లేవకుండా ఉండి ఉంటే నేను రాత్రంతా నిన్ను చూస్తూనే గడిపే వాన్ని కావొచ్చు…….”
Upload early remaining parts of this story