ఆమెను తీసుకొని ముంబయి లో ఉన్న మా గెస్ట్ హౌస్ కి వెళ్ళాను…”
అంటూ చెప్పడం ఆపి పైకి లేచాడు రవి….
రవి చెప్తున్నది నాకేం అర్థం కాలేదు…
అయోమయంగా అనిపించి తలెత్తి అతని వైపు చూసాను…
లేచి నిలబడ్డ రవి తన లాల్చీ తీస్తున్నాడు…
నా కనుబొమ్మలు ముడి పడ్డాయి…
తర్వాత తన బనియన్ కూడా తీసేసాడు…
ఈ సారి నా కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి…
అతని తెల్లటి ఒంటిపై నిండా చిన్న చిన్న అక్షరాలు మూడేసి ఉన్నాయి… చాలా చిన్నగా ఉన్నాయి…
చేతుల మీద తప్ప మెడ కింద నుండి నడుము వరకు ఒంటి నిండా ఉన్నాయి… ఒక్కో పదానికి మధ్య చాలా చిన్న గ్యాప్ ఉంది… రవి తన లాల్చీ బనియన్ కొయ్యకు వేయడానికి వెళ్తుంటే చూసా… వీపు మీద కూడా నిండా ఉన్నాయి… తిరిగి రవి దగ్గరగా వచ్చాక వాటిని సరిగ్గా గమనించి చూసాను… కలిపి చదివితే అన్నీ
… ‘అక్షర’ …అంటే నా పేరు..
” నేను చేసిన తప్పుకు ఇది శిక్షగా భావించా అక్షరా”
అన్నాడు మంచం మీద నా కాళ్ళ దగ్గర కూర్చుంటూ…
“వారం రోజుల పాటు సూదులతో పొడిపించుకున్నాను నీ పేరుని… ఒక్కో సూది పోటు ఆమె గుచ్చుతుంటే కలిగిన బాధతో నీ తరపున నా మీద నేను ప్రతీకారం తీర్చుకున్నాను….”
రవి చెప్తుంటే నేను ఆశ్చర్యంగా చూసాను…
కొన్ని వందల పేర్లు ఉన్నట్టున్నాయి అతని శరీరం మీద…
అన్ని సార్లు అంత చిన్నగా పేర్లు రాస్తే ఎన్ని సూదుల పోట్లు గుచ్చి ఉండాలి…
తలుచుకుంటేనే నా ఒళ్ళు జలదరించింది….
” దీని వల్ల నీకు జరిగిన ఉపకారం ఏమీ ఉండకపోవచ్చు కానీ నాకు మాత్రం ఎవరిమీదో తీవ్రమైన కసి తీర్చుకున్న ఫీలింగ్ కలిగింది…
కొంతలో కొంత సాంత్వన లభించింది…
రక్తాలు కారిన నా శరీరం గాయాలు తగ్గడానికి మరో రెండు వారాలు పట్టింది….
కానీ నా మనసుకు నేను చేసుకున్న గాయం ఇంకా ఫ్రెష్ గా ఉండి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది…
అది నీ గురించే ఆలోచిస్తుంది…
నువ్వెంత బాధపడుతున్నావో అని ఎప్పుడూ బాధ పడుతూనే ఉంది…
ఏం చేస్తే నీకు మేలు జరుగుతుంది అని మదన పడింది………….”
ఇన్నాళ్లు నేనొక్కదాన్నే బాధ పడ్డాను అనుకున్నా నేను… కానీ ఇప్పుడు రవి చెప్తున్నది వింటుంటే రవి కూడా నాతో సమానంగా బాధ పడ్డట్టు అనిపిస్తుంది నాకు…
కానీ ఇదంతా నిజంగా నిజమేనా అని ఒక సందేహం కూడా కలిగింది…
పచ్చబొట్లు అయితే కనబడుతున్నాయి…
కానీ అతను చెప్పేవన్నీ నిజమేనా…
“……….. ముంబై లో ఉన్న మూడు వారాలు నీ గురించే ఆలోచించా అక్షర… కానీ నాకు ఏం చేయాలో తెలియలేదు….
మళ్లీ ఇక్కడికి వచ్చాక ఒక రోజు మీ బావ ఇంటికి వచ్చి మమ్మల్ని డిన్నర్ కి పిలిచాడు…
అమ్మ బలవంతం మీద నేనూ వెళ్ళాను…
అక్కడ వాళ్ళ పెళ్లి ఆల్బమ్ చూస్తుండగా ఒక ఫొటోలో నువ్వొక్కదానివే ఉన్నావ్…
మీ అక్క పెళ్లిలో నువ్ ఎంత అందంగా ఉన్నావో ఆ ఫోటో చూపిస్తుంటే… చాలా సేపు నేను ఆ ఫోటోనే చూస్తూ ఉండి పోయా…
అమ్మ అది గమనించినట్టుంది….
చాలా రోజులుగా అమ్మ నన్ను పెళ్లిచేసుకోమని బతిమాలుతుంది… కానీ నేనే ఒప్పుకోలేదు…ఆ రోజు నేను నీ ఫోటోను అంతసేపు చూడడంతో నన్ను అడిగింది… ఆ అమ్మాయి నచ్చిందా.. పెళ్లి చేసుకుంటావా అని…
పరధ్యానంలోనే అవును అని చెప్పా నేను…
అంతే అమ్మ వెంటనే మీ అక్కని పిలిచి అడిగింది ఎవరు అని…
మా చెల్లెలే అని మీ అక్క చెప్పడంతో అమ్మ డైరెక్ట్ గా పెళ్లి విషయం అడిగేసింది…
మీ అమ్మ వాళ్ళని అడిగి చెప్తా అని మీ అక్క చెప్పింది…
నేను తేరుకుని వారించే లోపే ఇవన్నీ జరిగిపోయాయి…
తర్వాత నాకూ అదే బాగుంటుందనిపించింది…
నిన్ను పెళ్లిచేసుకోవడమే సమస్యకు పరిష్కారంలా తోచింది…
ఇంతకన్నా వేరే మంచి దారి ఏదీ లేదనిపించింది….పెళ్లి చూపులకి వచ్చినపుడు నీతో పర్సనల్ గా మాట్లాడి నీకు సారి చెప్పి నిన్ను ఒప్పిద్దామనుకున్నా… కానీ నువ్ పెళ్లిచూపులు ఏం వద్దు అనే సరికి నీ మనసులో ఏముందో, ఎందుకు పెళ్లిచూపులు వద్దంటున్నావో నాకు అర్థం అయింది…
నిన్ను నేను పెళ్లిచేసుకోవడమే కరెక్ట్ అని నాకా క్షణం ఇంకా గట్టిగా అనిపించింది… ”
అంటూ నా వైపు చూసాడు రవి…
నేను తలదించుకొని అతని మాటలన్నీ వింటున్నాను… .రవి మంచం దిగి కిటికీ వద్దకు వెళ్లి బయటకు చూస్తూ నిలుచున్నాడు…
నేను అతని మాటల్లో నిజానిజాలని బేరీజు వేసుకుంటున్నాను…. రవి చెప్పేదంతా నిజమేనా నమ్మొచ్చా అని ఆలోచిస్తున్న…
ఇంతలో రవి తిరిగి మంచం వద్దకు వచ్చాడు…
మంచం పక్కన కింద కూర్చుని నా కాళ్ళ పై తల ఆనించి నా వైపు చూస్తూ మళ్లీ చెప్పడం మొదలెట్టాడు..
” నిన్ను పాడు చేసాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను అనుకోవద్దు అక్షరా…
నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను ….
ఎంత కష్టమైనా నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను…
కానీ దురదృష్టం కొద్దీ నిన్ను నొప్పించి పెళ్లి చేసుకున్నా…
ఇకనుంచి నా జీవితం నీకు అర్పిస్తున్నాను అక్షరా…
బతికున్నన్నాళ్లు నేను నీకు బానిసను…
నిన్ను అంతగా ఇబ్బంది పెట్టినందుకు నాకు నువ్ ఏ శిక్షయినా విధించు.. ఆనందంగా అనుభవిస్తా… ఇక మీదట నీకు ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకుంటా… నన్ను నమ్ము అక్షరా…..
ఈ ఒక్క సారికి నన్ను క్షమించు… ఈ జీవితంలో మళ్లీ ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను…
Forgive me Akshara… please forgive me”
అంటూ కళ్ళు మూసుకొన్నాడు రవి…
అతని కళ్లలోంచి నీళ్లు కారి నా పాదాలను తడుపుతున్నాయి….
నాకు అంతా కన్ఫ్యూజన్ గా ఉంది రవి చెప్పిందంతా విన్నాక…
నమ్మాలా వద్దా అని తేల్చుకోలేక పోతున్నా నేను…
రవిని క్షమించాలి అంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు… ఆ రాత్రి అతని ప్రవర్తన గుర్తుకొస్తే ఇప్పటికీ విపరీతమైన కోపం వస్తుంది…
కానీ నా బుద్ధి వేరేలా ఆలోచిస్తుంది…
రవి చెప్పిందంతా తిరిగి ఒకసారి మననం చేసుకున్నా…
ఎక్కడా అబద్ధం చెప్పినట్టుగా అనిపించట్లేదు…
కావాలని చేయలేదని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాక కూడా అతని మీద ద్వేషం పెంచుకోవడం తగదని నా బుద్ధి చెబుతోంది..
రవి చెప్పింది మొత్తం నిజమే కావచ్చు అనిపించసాగింది…
మోసం చేసే ఉద్దేశ్యమే ఉంటే తిరిగి నన్ను పెళ్లి చేసుకోవలసిన అవసరం ఏముంది..
నా శరీరం మీద మోజు తీరకనా… అలా అయితే ఇప్పుడు కూడా ఈ రాత్రి అతనికి అడ్డేముండేది…
ఎందుకు సంజాయిషీ ఇచ్చాడు… శరీరాన్ని అనుభవించడానికి ఇప్పుడు అతనికి ఏ అడ్డంకి లేదు కదా…
ఒక వేళ నేను ఒప్పుకోకున్నా ఆ రాత్రిలా ఈ రాత్రీ… బలవంతంగానైనా అనుభవించొచ్చుగా…
కానీ ఎందుకు చేయలేదు…
Upload early remaining parts of this story