నా కథ 3 277

అతని మాటలు నిజమేనేమో అనిపించి అతని వైపు చూసాను… పాదలమీద తలాఉంచి కళ్ళు మూసుకొని ఉన్నాడు…
తల నా వైపే తిరిగి ఉంది… ఏ కదలికా లేదు.. నిద్ర పట్టినట్టు ఉంది….
నేను పరీక్షగా చూసాను…
ముఖం చాలా అలిసిపోయినట్టుగా ఉంది…
నా కళ్ళు కాస్త కిందికి చూశాయి…
షర్ట్ లేని అతని ఒంటి మీద నిండా…… ‘అక్షర’ అనే అక్షరాలు సందులేకుండా ఉన్నాయి…
వాటిని చూడగానే నా మనసు కదిలి పోయింది…
నేను కాళ్ళు కదలకుండా కొద్దిగా పైకి లేచి అతని ఒంటిపై నున్న అక్షరాలని తడిమి చూసాను…
కళ్లలోంచి నీళ్లు పొంగుకొచ్చాయి…
మనసు తన బెట్టు వీడి బుద్ధితో ఏకీభవించింది…
నేను తిరిగి వెనక్కి మంచాన్ని ఆనుకుని కూర్చున్నా….
ఆలోచిస్తుంటే జరిగిందాంట్లో రవి తప్పు లేదని కూడా అనిపించింది… అదీ కాకుండా నేను ఇప్పుడు చేయగలిగేది కూడా ఏమి లేదు అనిపించింది…
ఎలాగు అతనితో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకునే ఆ గదిలోకి అడుగు పెట్టా.. అటువంటప్పుడు అతన్ని క్షమించి ఆ పని చేస్తే కాస్త మనసుకి ఉపశమనం కలుగుతుంది… కాబట్టి జరిగింది ఒక ఆక్సిడెంట్ అనుకోవాలి అని మనసుకి సర్ది చెప్పా…
చాలా సేపు ఆలోచించా నేను… క్రమ క్రమంగా రవి మీద కోపం కాస్తా తగ్గిపోసాగింది…
మరొక్క సారి కళ్ళు మూసుకొని రవి చెప్పిందంతా గుర్తు చేసుకోసాగాను…
ఇప్పుడు రవి చెప్పిన ఒక్కో మాట నా మనసును నింపుతున్న అమృతపు బిందువుల్లా అనిపించసాగాయి…
రవిమీద కోపం పూర్తిగా పోయింది…
తిరిగి చూస్తే రవి ఇంకా నా కాళ్ళమీద అలాగే నిద్రపోతున్నాడు…
అతని మొహం చూస్తుంటే తప్పు చేసి తల్లితో దెబ్బలు తిని… ఏడ్చి ఏడ్చి తల్లి ఒళ్ళోనే తలపెట్టి పడుకున్న చిన్న పిల్లాడిలా అనిపించాడు..
ముందుకి వంగి అతని తల మీద చేయి వేసి నిమిరా… మరో చెయ్యి అతని వీపు మీద వేసి నిమిరా… ఒక్కో పేరును తడుముతూ నా చెయ్యి అతని వీపంతా నిమురుతుంటే.. రవి సడన్ గా లేచాడు…
నేను చిన్నగా నవ్వాను … రవి చటుక్కున లేచి కూర్చున్నాడు….
” నీకు నా మీద కోపం పోయిందా” అని అడిగాడు…
అవును అని తలూపాను…
“థాంక్యూ అక్షరా… థాంక్యూ వెరీ మచ్… నువ్ నన్ను ఇంత త్వరగా క్షమిస్తావని అనుకోలేదు” అన్నాడు నా పాదాలని ఊపుతూ….
“ముందు నువ్ అక్కడనుండి లే పైకి ” అన్నాను నేను..
రవి లేచి మంచం మీద కూర్చున్నాడు…
” అక్షరా … అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను… ఇక మీదట నీకు కష్టం కలిగించే ఏ పనీ చెయ్యను… ” అన్నాడు నా చేతిని తన చేతిలోకి తీసుకొని ఒట్టేస్తూ…
నేను నా మరో చేతిని అతని చేతి మీద వేసాను సరే నమ్ముతున్నాను అన్నట్టుగా…

“థాంక్యూ అక్షరా థాంక్యూ వెరీ మచ్” అంటూ నా చేతుల్ని పట్టుకుని గట్టిగా ఊపాడు రవి… అతని కళ్ళలో సన్నటి కన్నీటి పొర కదలాడింది…
కష్టపడి కన్నీళ్ళని ఆపుతున్నట్టనిపించింది…
వాటిని చూస్తుంటే అతని మాటల్లో నిజాయితీ తెలుస్తుంది నాకు…
అంత వరకు నాలోపల ఉన్న బాధ అంతా చేత్తో తీసినట్టు ఒక్క సారిగా పూర్తిగా పోయింది…
నేను అతని చేతిని తీసుకుని చిన్నగా ముద్దాడి…
“నేనీ పెళ్లికి ఒప్పుకోకుంటే ఏం చేసే వాడివి” అని అడిగా …. మధ్యాహ్నం నుండి నాకు ఆ సందేహం మెదులుతూనే ఉంది… ఆగలేక అడిగేసా…

“కచ్చితంగా నిన్ను బలవంత పెట్టే వాన్ని కాను” అన్నాడు రవి వెంటనే….
నాకు ఎందుకో కొంచెం నిరాశగా అనిపించింది….

“నువ్ వద్దు అంటే… ఏదో ఒకలా నిన్ను కలిసి క్షమాపణ చెప్పి… జరిగిందంతా నీకు చెప్పాలి అనుకున్నా…. అంతా విన్నాక కూడా నువ్ నన్ను వద్దు అంటే మాత్రం నిన్ను బలవంతం చేయకూడదు అనుకున్నా…
నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగకూడదు అనుకున్నా… ఆ మాట మీ అక్కతో కచ్చితంగా చెప్పాను నేను…
అయితే ఒక్కటి మాత్రం నిజం…
నువ్ వద్దు అంటే నేను ఇక ఈ జన్మలో ఎవరినీ పెళ్లి చేసుకునే వాడిని కాదు…”

1 Comment

  1. Upload early remaining parts of this story

Comments are closed.