మెల్లిగానే చెబుతున్నా రవి మాటల్లో తీవ్రత తెలుస్తూనే ఉంది నాకు…
“నువ్ ఎవరినైనా చేసుకున్నా సుఖపడే వాడివి కావు” అన్నా నేను…
“ఎందుకు” అన్నాడు రవి…
“ఇలా ఒంటినిండా నా పేరు పొడిపించుకున్నాక ఏ ఆడపిల్ల నీతో సంతోషంగా కాపురం చేసేది” అన్నా నవ్వుతూ అతని బాడీ వైపు చూపిస్తూ…
“నిజమే” అని తను కూడా నవ్వాడు …
చాలా సేపట్నుండి ఒకే పొజిషన్ లో కూర్చువడంతో ఇబ్బందిగా కదిలాను నేను… ఆవలింతలు కూడా వస్తుంటే…
“బాగా అలిసిపోయినట్టున్నావు … ఇక పడుకో అక్షరా.. ” అన్నాడు…
టైం చూస్తే నాలుగు దాటింది… నేను కాస్త కిందకి జరిగి పక్కకు ఒత్తిగిలి పడుకున్నా…
…
..
“అక్షరా.. అక్షరా అని పిలుపు వినబడి మెలకువ వచ్చింది….
పక్కన పడుకున్న రవి కూడా అప్పుడే లేచాడు…
టైం చూస్తే ఎనిమిది దాటింది…
బయటనుండి అక్క పిలుస్తుంది తలుపు మీద చిన్నగా తడుతూ…
వస్తున్నానక్కా అంటూ వెళ్తుంటే…
ఒక్క నిమిషం అన్నాడు రవి…
నేను మధ్యలోనే ఆగి వెనక్కి తిరిగి చూసా ఏమిటన్నట్టు….
రవి నా దగ్గరకు వచ్చి …నా తల్లోని పూలని లాగేసాడు…
నాకేం అర్థం కాలేదు….ప్రశ్నార్థకంగా చూసా…
రవి నా తల మీద చేయి వేసి జుట్టుని చెరిచాడు…
నుదుటి మీద ఉన్న కుంకుమ బొట్టుని కాస్త పైదాకా చేసాడు…
చేతికి అంటిన కుంకుమను తన చెంపకి రాసుకున్నాడు…
“ఇప్పుడు వేళ్లు” అని రవి అన్నాక …నాకు అప్పుడు అర్థం అయ్యింది అతని చేష్టలకి అర్థం ఏమిటో… వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాను…
నేను తలుపు దగ్గరికి వెళ్ళాక మళ్లీ ఒక్క నిమిషం అన్న మాట వినబడింది…
నేను తిరిగి చూసా…
మంచం చుట్టు కట్టిన పూల దండల్ని కొన్నింటిని లాగేసాడు రవి….
తర్వాత మంచం మీద ఉన్న పూలని చెల్లా చెదురు చేసాడు…
కొయ్యకు వేసిన తన లాల్చీ తెచ్చుకుని వేసుకుంటూ… ఇక వెళ్లమంటూ సైగ చేసాడు…
నేను లొలొపలే నవ్వుకుంటూ తలుపు తీసుకొని బయటకు వెళ్ళాను….
అప్పటికే అక్క అక్కణ్ణుంచి వెళ్లిపోయినట్టుంది…
నేను కిచెన్ లోకి వెళ్ళా… అమ్మా, అక్కా, అత్తయ్య అందరూ అక్కడే ఉన్నారు…
నవ్వుతూ వచ్చిన నన్ను చూసి ముందు ఆశ్చర్యపోయినా తరువాత తేరుకుని చాలా సంతోషపడ్డారు వాళ్ళు…
కాఫీ కలిపి ఇచ్చి తీసుకెళ్లి రవికి ఇవ్వమన్నారు…
నేను రవికి కాఫీ ఇచ్చి వస్తుంటే “అక్షరా..ఒక్క నిమిషం” అన్నాడు రవి…
నేను ఏమిటి అన్నట్టు తిరిగి చూసాను…
“ఇలారా… ఇక్కడ కూర్చో” అన్నాడు తన పక్కన మంచంమీద చోటు చూపిస్తూ…
నేను వెళ్లి పక్కన కూర్చున్నా…
“నీకు నా మీద కోపం మొత్తం పోయినట్టేగా ” అన్నాడు నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ…
నేను అవును అన్నట్టు తలూపాను…
“అయితే మనం హనీమూన్ కి వెల్దామా” అన్నాడు..
నేను ఆశ్చర్యంగా చూసాను…
“హనీమూన్ అంటే కూడా ఎక్కడికో కాదు అక్షరా… ముంబై వెళ్దాం… అక్కడ మనకు ఒక మంచి గెస్ట్ హౌస్ ఉంది… కొన్నాళ్ళు మనం అక్కడ ఉండి వద్దాం… మనిద్దరమే ఉంటాం … ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు…. మనం ఒకర్నొకరం అర్థం చేసుకొనేందుకు ఇది ఉపయోగపడుతుంది…” అన్నాడు…
నాకేం చెప్పాలో తెలియలేదు…
“నీకిష్టం ఉంటేనే అక్షరా అన్నాడు తనే మళ్లీ…
“నీ ఇష్టం ” అన్నాను నేను ఏం చెప్పాలో తెలియక…
“అయితే వీలైనంత వరకు ఈ రోజంతా రెస్ట్ తీసుకో అక్షరా… ట్రావెల్లింగ్ లో సరిగా నిద్ర పట్టదు… ఈవెనింగ్ సెవెన్ వరకు రెడీ అవ్వు…” అని చెప్పాడు…
నేను సరే అన్నట్టు తలూపాను…
స్నానాలు చేసి అందరం టిఫిన్ చేస్తుంటే రవి చెప్పాడు అందరితో… ఆ రోజు సాయంత్రమే మేమిద్దరం ముంబై వెళ్తామని…
అమ్మ ఏదో చెప్పబోతుంటే… ” ముంబైలో మాకో గెస్ట్ హౌస్ ఉందత్తయ్యా… అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది… ప్లీజ్ మీరింకేమీ చెప్పొద్దు” అన్నాడు…
అక్క కూడా ” వెళ్లనీ అమ్మా దానికి కూడా కాస్త గాలి మార్పు ఉంటుంది ” అంది నా వైపు చూపిస్తూ…
ఇంకెవరూ ఏమీ మాట్లాడలేదు…
రాత్రి నిద్రలేకపోవడంతో నేను ఆ రోజు మధ్యాహ్నం చాలా సేపు పడుకున్నా….
సాయంత్రం పూట స్నానం చేసి రెడీ అయ్యా … ట్రావెలింగ్ కదా అని చుడీదార్ వేసుకున్నా…
అక్కా వాళ్ళు బ్యాగులు అన్నీ సర్దేశారు…
సెవెన్ అవుతుండగా ఇద్దరం కార్లో బయలుదేరాం…
రైల్వే స్టేషన్ దగ్గర ఒక పెద్ద హోటల్ వద్ద కార్ ఆపాడు ఆపాడు…
“ట్రైన్ లో మీల్స్ బాగుండదు అక్షరా ఇక్కడ తినేసి వెళ్దాం” అన్నాడు…
నేను సరే అని తలూపాను…
ఇద్దరం అందులోకి వెళ్ళాం…
Upload early remaining parts of this story