నా కథ 3 277

భోజనం పూర్తయేసరికి ఎనిమిదిన్నర దాటింది…
“ట్రైన్ ఈ రోజు వన్ అవర్ లేట్ అంట అక్షరా… అంత సేపు ఇక్కడే ఉందాం ” అంటూ అందులోనే ఒక గదికి తీసుకెళ్లాడు…
నన్ను కాసేపు పడుకోమని చెప్పి తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు…
నేను రవినే గమనిస్తూ కూర్చున్నా…
ఎవరికో instructions ఇస్తున్నాడు…
కాసేపయ్యాక మళ్లీ నా దగ్గరికి వచ్చాడు…
“బోర్ కొడుతుందా….. టీవీ చూస్తుండు… నేనిప్పుడే వచ్చేస్తా” అని టీవీ ఆన్ చేసి రిమోట్ నా చేతికిచ్చి బయటకు వెళ్ళాడు…
నేను చానెల్స్ మారుస్తూ కూర్చున్నా…
పదిహేను ఇరవై నిమిషాల తరువాత రవి తిరిగి వచ్చాడు…. చేతిలో రెండు మూడు కవర్లు ఉన్నాయి..
వస్తూనే…”అక్షరా .. ఫ్రెష్ అయ్యి ఇదిగో ఇది కట్టుకో… కొంచెం తొందరగా కట్టుకో ట్రైన్ టైం అవుతుంది”.. అంటూ నా చేతికి ఒక కవర్ ఇచ్చాడు….
కవర్లో ఏముందో అని తీసి చూసా నేను…
అది నిన్న నేను కట్టుకున్న చీరే.. పొద్దున విప్పేసా…
“ఇదెక్కడిదీ” అని అడిగా…
“నేనే తీసుకొచ్చా… డీటెయిల్స్ తర్వాత చెప్తా గానీ కాస్త తొందరగా కట్టుకొని ఇవన్నీ పెట్టుకో… నేను మళ్ళీ వస్తా” అంటూ తన చేతిలో ఉన్న మరో రెండు కవర్లు ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు…
నేను ఆ కవర్లు తీసి చూసా…
ఒక దాంట్లో పూలు ఉన్నాయి…
మరో దాంట్లో రాత్రి నేను పెట్టుకున్న నగలు ఉన్నాయి…
అంటే ఇప్పుడు నేను రాత్రిలా రెడీ అవ్వాలన్న మాట… అనుకున్నా…
కొంపదీసి ఇక్కడే ఈ రాత్రి గడుపుదాం అంటాడా అని డౌట్ వచ్చింది…
కానీ ట్రైన్ టైం అవుతుంది అంటున్నాడుగా… మరి ఇదంతా ఎందుకో అర్థం కాలేదు…
ఏదైనా కానీ అని ఆ చీర కట్టుకొని అవన్నీ పెట్టుకున్నా… అద్దం లో చూసుకుంటే దాదాపు రాత్రి ఉన్నట్టే ఉన్నాను…
ఇంతలో రవి వచ్చి రెడీనా అని అడిగాడు…
ఆ.. అంటూ అతని వైపు తిరిగా నేను…
“బ్యూటిఫుల్ ” అని తనలో తానే అనుకున్నట్టుగా పలికాడు రవి…
నాకు కాస్త సిగ్గేసి తల దించుకున్నా….
నా దగ్గరగా వచ్చి చేయి పట్టుకొని ..సరే పద ఇక వెళ్దాం అని బయటకు దారి తీసాడు… నేను మౌనంగా రవితో పాటు నడిచాను…
పది నిమిషాల్లో కారు స్టేషన్ కి చేరుకుంది…
ఇద్దరం ప్లాట్ఫారం మీదకి చేరుకునే సరికి అక్కడ రాజు ఉన్నాడు…
నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు…
నేను కూడా చిన్నగా నవ్వాను…
“అంతా ఓకే నా” అని రాజుని అడిగాడు రవి..
“ఆ వెళ్లి చూడు ” అన్నాడు రాజు…
“ఒక్క నిమిషం అక్షరా ” అంటూ రవి అక్కడున్న ట్రైన్ లోకి వెళ్ళాడు…
రాజు ఎవరికో డబ్బులిస్తున్నాడు…
ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్నారు అతని వద్ద …
అందరికీ ఇవ్వాలి కాబోలు..
నేను చుట్టూ చూసాను చాలా మంది నన్నే చూస్తున్నట్టనిపించింది…
నాకు ఇబ్బందిగా అనిపించి ట్రైన్ వైపు చూస్తూ నిలబడ్డా రవి వస్తాడేమో అని…
రాజు అందరికీ డబ్బులిచ్చి నా దగ్గరికి వచ్చాడు…
ఎవరు వాళ్ళు డబ్బులెందుకు ఇచ్చావ్ వాళ్ళకి అని అడిగా నేను…
రవి వాళ్లకేదో పని చెప్పాడట…
పేమెంట్ నన్ను చేయమన్నాడు అన్నాడు రాజు…
రాజు ఒక్కడే నన్ను ఆ డ్రెస్ లో చూసి ఆశ్చర్య పోకుండా చూసింది అనిపించింది నాకు…
ఇంతలో ట్రైన్ బయలుదేరబోతున్నట్టు కూత వినిపించింది…
“ట్రైన్ స్టార్ట్ అయ్యేట్టుంది మీరు ఎక్కండి” అన్నాడు రాజు…
“మరి రవి” అన్నా నేను…
“రవి లోపలే ఉన్నాడు పదండి ” అంటూ ట్రైన్ ఎక్కించాడు రాజు…
తనూ ఎక్కి నా ముందు నడిచాడు…
నేనెప్పుడూ ట్రైన్ లో 1st క్లాస్ లో వెళ్ళలేదు..
లోపల ఒక కారిడార్ లా ఉండి వరుసగా గదులు ఉన్నట్టుగా ఉన్నాయి…. రాజు నన్నొక గది ముందుకు తీసుకెళ్లి ఇదే మీ కూపే అన్నాడు…
“లోపలికి వెళ్ళండి” అని చెప్పి డోర్ తీయబోయిన వాడల్లా ఆగి “ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి” అంటూ వేగంగా వెళ్లి కిందికి దిగాడు…
ఇంతలో ట్రైన్ చిన్నగా కదిలింది…. నేను అయోమయంగా చూస్తూ ఉండగా ఎవరో ఒక అమ్మాయి ట్రైన్ ఎక్కి గబ గబా నా దగ్గరకు వచ్చింది…
తన చేతిలో ఉన్న గ్లాస్ నా చేతిలో పెట్టి “ఇది తీసుకోని మిమ్మల్ని లోపలికి వెల్లమన్నారు అండీ”… అనేసి వేగంగా వెళ్లి కదులుతున్న ట్రైన్ దిగేసింది..
నేను ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వెళ్లిన వైపే చూస్తూ నిలబడ్డా…
ట్రైన్ వేగం అందుకుంది….
అయోమయంగానే డోర్ తీసి లోపలికి వెళ్ళాను…
డోర్ దానంతట అదే మూసుకోగా…
లోపల గది చూసి నేను అవాక్కాయి పోయాను…

1 Comment

  1. Upload early remaining parts of this story

Comments are closed.