నైట్ షిఫ్ట్ 3 263

(కొద్దిసేపు విన్యా అక్క మాటల్లో కథ విందాం )

నా పెళ్లి అయ్యి 7సంవత్సరాలు అవుతుంది. నా పెళ్లి అప్పుడు నాకు 23సంవత్సరాలు. నాకు ఇప్పుడు 5సంవత్సరం బాబు ఉన్నాడు. మా అమ్మ దగ్గరే ఎక్కువగా ఉంటాడు. నేను ఒక మిడిల్ క్లాస్ నుండే వచ్చాను. డిగ్రీ వరకు చదువుకున్న. ఇక్కడే ఇదే సిటీలో పుట్టి పెరిగాను. నా ఫ్రెండ్స్ లో ఒకరిద్దరు బాగా రిచ్. అందులో ఒకదాని మ్యారేజ్ ఉంటే స్కై బ్లూ కలర్ గాగ్రా వేసుకొని ఇంకా నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం.

అక్కడ చాలా సరదాగా గడిపాము. అప్పుడు మీ బావ కుడా ఆ మ్యారేజ్కి వొచ్చారంట. పెళ్లిలో నన్ను చూసి రెండవ రోజు మా ఇంటికి చెప్పాబెట్టకుండ కారులో వచ్చారు.

ఆయన, వాళ్ల అమ్మ, అక్క ఇంకో పెద్ద మనిషి దిగారు. మా అమ్మానాన్న వాళ్ళతో చెప్పారు. ఇలా మీ అమ్మాయిని మా వాడు పెళ్ళిలో చూసి ఇష్టపడ్డాడు. మీకు ఇష్టముంటే మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకుంటాం అంది. అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చూస్కుంటా, కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా చేస్తూన్నాడు. మాకు ఊర్లో పంట పొలాలు ఉన్నాయి. ఇంకా మాకు ఒక రైస్ మిల్లు కూడా ఉంది ఊర్లో. మావాడే అప్పుడప్పుడు వెల్లి లావాదేవీలు చూసుకుని వస్తుంటాడు. ఇదిగో ఇది నా కూతురు. పెళ్లయింది. అమెరికాలో ఉంటుంది. మొన్ననే వచ్చింది. మీకు ఇష్టమైతే ఒక 15రోజుల్లో పెళ్లి. అది చూసుకుని నేను కుడా అమెరికా వెళ్తాను అంది ఆవిడ.

ఇదంతా పక్క గదిలోపల నుండీ నేను వింటున్నాను. మా అమ్మవాళ్ళు మీ స్థోమతకు మేము సరిపోలేం. కట్నకానుకలు మేము ఇచ్చుకోలేము అన్నారు. మాకు అలాంటివి ఏమి వొద్దు. మేమే అన్ని చూసుకుంటామన్నారు. ఒకసారి అమ్మాయిని చూపిస్తారా అంది ఆవిడ. సరే అని నన్ను త్వరగా రెడీ చేసి వాళ్ల ముందుకు తీసుకొని వెళ్ళింది అమ్మ. వాళ్లకు నేను చాలా బాగా నచ్చేసాను అన్నారు. అమ్మాయి మా వాడిని కూడా చూడు నచ్చాడో లేదో చెప్పు అన్నారు. నేను తల ఎత్తి ఆయనవైపు చూసాను. ఎర్రగా, కొంచెం లావుగా మంచి హైట్తో ఉన్నాడు. నన్నే చూస్తున్నాడు. నాకు కూడా బాగా నాచ్చేసాడు. ఎలా ఉన్నాడు నచ్చాడా మా తమ్ముడు అని మీ బావ వాల్ల అక్క అడిగింది. నేను సిగ్గుపడుతూ తల ఊపాను నచ్చాడని.