రివెంజ్! Part 2 Like

శశికళకి స్పృహ వచ్చి లేచింది. చూస్తుంటే హాస్టల్లా ఉంది, ఎదురుగా తనని కాపాడిన శివని చూసి వెంటనే లేచి కూర్చుంది. తన శరీరం చూసుకుంటే ఆటో తిరగబడ్డప్పుడు తగిలిన దెబ్బలు ఇప్పుడు లేవు, సైన్స్ స్టూడెంట్ అవడం వల్ల ముందు ఆశ్చర్యపోయినా ఎదురుగా ఉన్న శివని చూసి మాట్లాడబోయింది, కానీ అంతలోపే శివ మాట్లాడాడు.

“ఎలా ఉన్నారు”

శశి ఏవేవో అడగలనుకుంది కానీ శివ గొంతులోని గాంభీర్యం చూసి “బాగున్నాను” అని మాత్రమే అనగలిగింది.

శివ నవ్వుతూ “ముందు రెస్ట్ తీసుకోండి, తరువాత మాట్లాడదాం. ఏమైనా కావాలంటే ఇక్కడ కావాల్సినంత మనుషులు ఉన్నారు” అని వెళ్ళబోతుంటే శశి “ఫోన్ కావాలి” అంది భయంగా

శివ బైట గోడకి కాపలాగా ఉన్న వాళ్ళని చూసి సైగ చెయ్యగానే వాడి ఫోన్ తీసి శశికళకి ఇచ్చాడు. శివ బైటికి వెళ్లగానే “సూర్యా” అని పిలిచాడు.

“ఇక్కడా” అన్న గొంతు వినిపించగానే బైటికి వచ్చి పైకి చూసాడు. చెట్టెక్కి జామకాయ కోస్తూ కిందకి దిగి ఒకటి శివ వైపు విసిరాడు. దాదాపు శివ వయసే సూర్యది కూడా, ఇద్దరు గోడ మీద కూర్చుని తింటూ #శివ : ఆ అమ్మాయి డీటెయిల్స్ ??

సూర్య వెంటనే రేఖా అని పిలిచాడు ఉత్సాహంగా, శివ సూర్య వంక ఎగాదిగా చూస్తూ “అసిస్టెంట్ గా అమ్మాయిని పెట్టుకున్నావా” అని అడిగాడు.

సూర్య : నీకంటే వేరే దారి లేక నన్ను పెట్టుకున్నావ్, నాకే బాధా లేదు అందుకే.. అని సెక్సీగా నడుస్తున్న రేఖ వైపు చూసాడు. నిజమే టైట్ జీన్స్ గ్రే టాపులో చాలా అందంగా ఉంది. ఆ స్టైల్ చూడు. శివ చూడలేదు, ఎందుకంటే తనకి తెలుసు.

రేఖ వస్తూనే “మార్నింగ్ శివ గారు, హాయ్ సూర్యా” అని నవ్వుతూ పలకరించి రెండు పిన్ కొట్టిన పేపర్స్ సూర్యా చేతికిచ్చింది. సూర్యా పేపర్ చూస్తుంటే రేఖ అందులో ఉన్న వివరాలు చెపుతుంది.

రేఖ : పుట్టింది, పెరిగింది ఈస్ట్ గోదావరి, పెద్దాపురం. ఒక్కటే కూతురు అమ్మా, నాన్న ఇద్దరు వ్యవసాయం మీదె ఆధారపడిన కుటుంబం. కెమిస్ట్రీ సబ్జెక్టు అన్నా కెమికల్స్ అన్నా చాలా ఇష్టం. మిగతా సబ్జక్ట్స్ లో మార్కులు తగ్గినా కెమిస్ట్రీలో మాత్రం బైకిబై తెచ్చుకుంది. డిగ్రీ అయిపోయాక తెలిసిన టీచర్ సహాయంతో హైదరాబాదులో పీజీ చేసి కెమిస్ట్ గా జాబ్ చేస్తుంది. సైంటిస్ట్ అవ్వాలని తన గోల్.

సూర్య : బ్యాక్ గ్రౌండ్ క్లియర్ గానే ఉంది, మరి.. అంటుండగానే రేఖ మాట్లాడింది, “ప్రియుడు కూడా ఉన్నాడు పేరు మణి, సంవత్సరం మణితో బాగా డీప్ లవ్ తరువాత పోయిన నెల మొత్తం తన అన్న రాజుతో తిరిగింది”

సూర్య : అదేంటి ?

రేఖ ఏమో అని కళ్ళు ఎగరేసి శివ వంక చూస్తూ “సర్, ఇంకోటి నిన్న పొద్దున్నే మూడు గంటలకి తనకి సంబంధించిన వీడియో ఒకటి ట్రెండింగ్ లో ఉంది.”

సూర్య : ఏ వీడియో

రేఖ సూర్య వైపు ఇబ్బందిగా చూస్తూ “మీరే చూడండి” అని ఫోనులో శశికళ గాంగ్ బ్యాంగ్ వీడియో చూపించింది.

సూర్య : ఓహో.. హ్మ్మ్.. ఎహె.. సూపర్.. సొ, ముందు తమ్ముడితో ఆ తరువాత అన్నతో తిరిగింది, వాళ్ళకి మండి ఈ వీడియో వదిలారన్నమాట. ఆ పని కూడా వాళ్లదే అయ్యుంటుంది. అని వీడియో శివకి చూపించాడు కానీ శివ చూడలేదు.

ఇప్పటివరకు మాట్లాడని శివ కనీసం వాళ్ళ వైపు చూడకుండానే “ఆ అమ్మాయి అలాంటిది కాదనిపిస్తుంది, లేకపోతే నేను కాపాడేవాడిని కాదు, ఇంకోటి.. ఆ వీడియోలో ఆ అమ్మాయి స్పృహలో లేదు” అన్నాడు జామకాయ కొరుకుతూ, సూర్య మళ్ళీ వీడియో చూసి “అవును” అంటూ రేఖ వంక చూసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *