రివెంజ్! Part 2 Like

“శశికళ, వచ్చావా”

“హా రోహిత్, మొదటిసారి కదా ఫ్రెండుతో పాటు వస్తున్నా. దెగ్గరికి వచ్చేసాం అంటుంది.”

“ఓకే, నేను పార్కింగ్ లోనే ఉంటాను, ఇద్దరం కలిసి వెళదాం.”

“థాంక్స్ రోహిత్”

“ముందైతే రా” అని ఫోను పెట్టేసి శశి కోసం ఎదురు చూస్తూ మధ్యమధ్యలో టైం చూస్తూ నిలుచున్నాడు. చూస్తుండగానే ఒక కారు లోపలికి వచ్చింది, అందులో నుంచి శశి దిగింది. తన కారులో ఉన్న బొకే తీసి ఎదురు వెళుతూ శశిని చూడగానే ఒక్క నిమిషం ఆగిపోయాడు, చాలా మారిపోయింది శశి అనుకున్నాడు మనుసులోనే వెంటనే అమ్మాయిల ముందు ఎర్రిపప్ప అవ్వకురా అనుకుంటూనే వెళ్లి శశిని చూసి నవ్వుతూ “ఎలా ఉన్నావ్” అని తనకి బొకే అందించాడు. శశికళ గమనించకపోయినా శ్రావ్య గమనించింది, వెంటనే “ఓహ్.. రెడ్ రోసెస్. హౌ స్వీట్” అంది. రోహిత్ అది వినగానే నవ్వుతూ తల గోక్కుని శశి వైపు చూసాడు. తను కూడా చిన్నగా నవ్వింది, రోహిత్ ని చూసి “థాంక్యూ” అనగానే సంబరపడిపోయాడు.

శ్రావ్య : నేను వెళ్ళనా మరి ?

రోహిత్ వెంటనే “ప్లీజ్, మీరు వెళ్ళండి. నేను చూసుకుంటాను” అనగానే శ్రావ్య నవ్వుతూ శశి వైపు చూసి “ఓకే బాయి, ఈవెనింగ్ పికప్ చేసుకుంటాను, ఫోన్ చేయి” అని కారు ఎక్కుతుంటే రోహిత్ వెంటనే “మీకెందుకు శ్రమ, నేను డ్రాప్ చేస్తాను” అని శశి వంక చూసాడు. శ్రావ్య కూడా శశి వంకే చూసింది. శశి ఓకే వెళ్ళమని శ్రావ్యని సైగ చేసేసరికి రోహిత్ కి అడ్రస్ చెప్పి “ఓకే బై” అని వెళ్ళిపోయింది. శ్రావ్య వెళ్ళిపోయాక రోహిత్ కొంచెం మామూలు అయ్యాడు.

రోహిత్ : “ఇంకా అందరూ ఎలా ఉన్నారు, అమ్మా, నాన్నా, నీ సైంటిస్ట్ కల ఎక్కడికి వరకు రీచ్ అయ్యావు”, వరస పెట్టి మరి అన్ని గుర్తుపెట్టుకుని అడుగుతుంటే ఏడుపు వచ్చేసి ఆపుకోలేక బోరున ఏడ్చేసింది. రోహిత్ కంగారుపడి శశికళని ముట్టుకుందామని దెగ్గరికి వెళ్లినా చెయ్యి వెయ్యలేక ఆగిపోయాడు. “శశి..!” అని పిలవగానే కంట్రోల్ చేసుకుని కళ్ళు తుడుచుకుంది.

వెంటనే సారీ చెపుతూ చున్నీతో కళ్ళు తుడుచుకుని వెళదామా అన్నట్టు చూస్తే రోహిత్ ముందు నడిచాడు వెనకే నడిచింది శశి. ముందు కేఫ్ కి తీసుకెళ్లి కాఫీ ఆర్డర్ చేసి టిష్యూస్ తెచ్చిచ్చాడు. థాంక్స్ చెపుతూ తీసుకుంది. సెల్ఫ్ సర్వీస్ అవ్వడం వల్ల వెంటనే వెళ్లి కాఫీ కూడా తెచ్చి టేబుల్ మీద పెట్టి ఎదురుగా కూర్చున్నాడు. చాలాసేపటి మౌనం తరువాత “శశి, నాకేమైనా చెపుతావా” అని నెమ్మదిగా అడిగితే జరిగింది మొత్తం చెప్పింది. ఆఖరికి ప్రెగ్నెన్సీ తీయించుకున్న సంగతి కూడా దాచకుండా చెప్పింది. అన్నీ చెప్పినా తనని కాపాడిన శివ అనే వ్యక్తి గురించి మాత్రం చెప్పలేదు.

అంతా విన్న రోహిత్ నిశచేష్టగా అయిపోయాడు, జాలి పడాలో, బాధ పడాలో అర్ధం కాలేదు. ఈ రెండిటికి బదులు మూడోది.. కోపం వచ్చింది. లేచి తిడదాం అనుకున్నాడు. అదే నన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఇవేవి జరిగేవి కాదు కదా అని అడగాలనుకున్నాడు.

కానీ ఈలోపే శశి : నీ లాంటి వాడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే కాదని వెధవని ప్రేమించి చివరికి నేను కూడా వెధవని అయ్యాను రోహిత్. నిన్ను బాధపెట్టినందుకు నాకు తాగిన శాస్తే జరిగింది. ఇప్పుడు నాతో చుట్టాలు లేరు, స్నేహితులు లేరు, అమ్మా నాన్నా లేరు, ఎవరూ లేరు. ఒంటరిగా మిగిలిపోయాను. చివరికి అందరినీ కాదన్న నా కల ఒక్కటే నా చేతుల్లో మిగిలింది. ఇది కూడా జరగకపోతే ఇక నా బ్రతుక్కి అర్ధంలేదు.

రోహిత్ ఏం మాట్లాడలేకపోయాడు. “నేను నిన్ను వదిలేసి రాలేదు శశి, ఆ రోజు నేను నీకు ప్రొపోజ్ చేసినప్పుడు నేనంటే ఇష్టం లేదని నువ్వు చెప్పలేదు, నేను ఐ లవ్ యు చెప్పినప్పుడు కూడా నువ్వు ఇబ్బంది పడలేదు, నాకింకా గుర్తున్నాయి కేవలం నీ కల కోసమే నన్ను కాదన్నావని నాకు అర్ధమైంది. నీ కల నిజమయ్యేవరకు నువ్వు ఎవ్వరినీ పట్టించుకోవని అర్ధమయ్యి నీకు దూరంగా వచ్చేసాను. నువ్వు కాదన్నాక చాలా బాధ పడ్డాను, నా ఎదుగుదల ఆగిపోతే రేపు నువ్వు సైంటిస్ట్ అయ్యాక నేను నీకు సరిపోను అనిపిస్తుందేమో అన్న ఆలోచనలో ఇదిగో ఇలా కెరీర్ వెతుక్కుంటూ చివరికి ఇక్కడ చేరాను.”

శశి కళ్లెమ్మటి నీళ్లు కారిపోయాయి, “సారీ రోహిత్” అని మాత్రమే అనగలిగింది. ఇన్నేళ్లు కన్న కలలు, శశికళ మీద పెంచుకున్న ఆశలు పది నిమిషాల్లోనే ఒక్కసారిగా ఆవిరి అవ్వడంతో రోహిత్ ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. వెంటనే లేచి “సరే ముందు నిన్ను జాయిన్ చేస్తాను పదా, నీ కోర్ సబ్జెక్ట్ ఏంటి ?” అని అడిగితే శశి లేచి నిలబడి “నానో టెక్నాలజీ” అంటూ తన ఫైల్ అందించింది. చూస్తూనే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటుకి తీసుకెళ్లి అక్కడ ఉన్న వాళ్లకి పరిచయం చేసి చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *