రివెంజ్! Part 2 Like

“దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీదె పెట్టు. నేను నీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాలేదంటే, ఈ సారి నేనే వచ్చి రేప్ చేస్తా” అని పెట్టేసాడు.

ముందు భయపడింది, శ్రావ్య దెగ్గరికి రావడంతో ఫోను తనకిచ్చేసింది.

శ్రావ్య : ఇది నా రూము, నువ్వస్సలు లోపలికి రాకూడదు. అది నీ రూము, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. ఓకే.. వెళ్లి ఫ్రెష్ అవ్వు. నాకు పనుంది తరవాత మాట్లాడుకుందాం అని బైటికి వెళ్ళిపోతూ డోర్ లాక్ చేసుకో ఎవరు కొట్టినా తీయకు, కిచెన్లొ బ్రెడ్ ఉంది కానిచ్చేయి బాయి అని అరుస్తూ వెళ్ళిపోయింది.

శశికి శ్రావ్య మెంటాలిటీ అర్ధం కాలేదు. ముందు లగ్గేజ్ తీసుకుని తన రూములోకి వెళ్ళింది.

స్నానం చేస్తుంటే ఏవేవో ఆలోచనలు. ఇందాక దేవుడు మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. “నీకు డబ్బులు కట్టకపోతే నన్ను రేప్ చేస్తావా, అయితే అస్సలు కట్టను. వడ్డీ మీద చెక్కర వడ్డీ కూడా తీర్చుకో” అని నవ్వుకుంది. వెనక్కి తిరగగానే నిలువు అద్దంలొ తన శరీరం, తన మొహం కనిపించగానే అలా మాట్లాడింది తనేనా అని సిగ్గు పడింది.

“అయినా ఇంత మంచోడివెంట్రా నువ్వు, నా గురించి తెలిసినా, నేను చెడిపోయానని తెలిసినా ఎలా నాకు సాయం చేయాలనిపించింది. ఆమ్మో దేవుడిని పట్టుకుని రా అనొచ్చా” వెంటనే లెంపలు వేసుకుంది, అది కూడా తనే అద్దంలొ చూసుకుని సిగ్గుపడిపోయింది. ఇంతలోనే తన మీద మణి మరియు వాడి అన్నాతమ్ముడి చేతులు పడటం గుర్తొచ్చి కళ్ళు తుడుచుకుంది. వెంటనే తన దేవుడిని తలుచుకుంది “ఎవరు నువ్వు, ఏం పేరు నీ పేరు ?” మళ్ళీ నవ్వుకుంది.

స్నానం చేసి బైటికి వచ్చాక బట్టలు మార్చుకుని తెచ్చిన లగ్గేజ్ తెరిచి సామాను సర్దుకుంది. అమ్మా నాన్నా ఫోటో తగిలించి, ఒకసారి వాళ్ళని తడిమి పాత జ్ఞాపకాలని మర్చిపోవాలని ప్రయత్నిస్తూ అక్కడి నుంచి వచ్చేసింది. కిచెన్ లోకి వెళ్లి చూస్తే బ్రెడ్ ఉంది, ఫ్రిడ్జ్ తెరిస్తే పీనట్ బట్టర్ కనిపించింది. వెంటనే తినేసి డోర్ లాక్ చేసుందా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చెసుకుని వెళ్లి పడుకుంది.

లేచేసరికి బైట శబ్దం అవుతుంటే చూసింది. హాల్లో శ్రావ్య టీవీ చూస్తుంది, బహుశా స్పేర్ కీస్ ఉండుంటాయి అనుకుంది. పలకరించి కూర్చుంది. శ్రావ్య కవర్ తీస్తూ అందులోనుంచి ఫోను తీసి “ఇదిగో నీ కొత్త ఫోన్, కొత్త నెంబర్. కొంచెం సెట్ చేసాను.. చూసుకో” అని ఇచ్చింది. శశికి ఆ రోజంతా కొత్త ఫోనులో తన డేటా మార్చుకోవడానికే సరిపోయింది. రాత్రి తినేసి పడుకుంటుంటే ఫేస్బుక్ నుంచి నోటిఫికేషన్ రావడం చూసి తెరిచింది. అది రోహిత్ నుంచి “ఎలా ఉన్నావ్, నేను గుర్తున్నానా” అని. వెంటనే తన నెంబర్ పంపింది. ఆ వెంటనే కాల్ రాగానే ఎత్తి “హలో” అంది.

రోహిత్ : “ఎలా ఉన్నావ్” చాలా ప్రేమగా అడిగాడు

“బాగున్నాను, నువ్వు ?” అంది భయంగానే

రోహిత్ : లోకల్ నెంబర్, అంటే నువ్వు స్పెయిన్లొ ఉన్నావా

“అవును, బార్సిలోనా. యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనాలొ అడ్మిషన్ వచ్చింది.”

రోహిత్ వెంటనే “అవునా !” అన్నాడు ఆశ్చర్యపోతూ “నేనిక్కడే, లెక్చరర్ గా పనిచేస్తున్నాను”

శశి మనసులోనే అనుకుంది, “తెలుసు, నువ్వున్నావనే ఇక్కడికి వచ్చాను” అయినా ఎందుకులే దాయడం, నిజం చెప్పేద్దాం “తెలుసు రోహిత్, చెప్పాలంటే నువ్వు ఇక్కడ పని చేస్తున్నావని నీ ప్రొఫైల్ చూసాకే ఇక్కడ అడ్మిషన్ కి అప్లై చేసాను”

రోహిత్ ఆనందం మాటల్లోనే తెలుస్తుంది “కలలో కూడా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు శశి.. సారీ.. శశికళ. నిజంగా చాలా సంతోషంగా ఉంది”

“నాకు నీ సాయం కావాలి రోహిత్” చేస్తాడా లేక మనసులో పెట్టుకుని చెయ్యడా అన్న భయంతోనే అడిగింది.

రోహిత్ : కచ్చితంగా.. నువ్వెక్కడ ఉన్నావ్

శశి : రేపు యూనివర్సిటీలొ కలుద్దాం రోహిత్

రోహిత్ : ఓకే, తప్పకుండా.. నీకోసం ఎదురుచూస్తుంటాను.

ఫోను పెట్టేసాక హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చి వదిలి మంచం మీద పడుకుంది. అక్కడ రోహిత్ పరిస్థితి కూడా అంతే కాకపోతే అస్సలు నిద్రపట్టలేదు, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు.

రోజు అలారం మోగనిదే లేవని రోహిత్ ఇవ్వాళ పొద్దున్నే లేచి టీషర్ట్ విప్పేసి అద్దంలొ చూసుకున్నాడు. లైటుగా పొట్ట కనిపించింది. వెంటనే వ్యాయామం మొదలుపెట్టాడు. టైమర్ అయిపోగానే త్వరగా స్నానం చేసి రెడీ అయ్యి మంచి షర్ట్ దాని మీద మాచింగ్ ప్యాంటు వేసుకుని యూనివర్సిటీకి బైలుదేరాడు. దారిలో బొకే కొంటూ దానిలో ప్రత్యేకంగా ఎర్ర గులాబీలు ఉండేలా చేయించి తీసుకెళ్లాడు. యూనివర్సిటీలొ కారు పార్క్ చేసి శశికళకి ఫోను చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *