రేఖ మాట్లాడుతూ “అవును సర్, ఆ మణి తమ్ముడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, తల మీద బాటిల్ తో కొట్టారు. బైటికి మాత్రం సొల్లు చెప్పి కవర్ చేస్తున్నారు. ఇంకో విషయం ఊళ్ళో ఉన్న తన అమ్మా నాన్న ఇద్దరు పొద్దున్నే ఆత్మహత్య చేసుకున్నారు”
సూర్య : అవమానంతో తట్టుకోలేకపోయుంటారు, పాపం. అస్సలు ఏం జరిగుంటుంది అంటూనే రేఖని చూసి జామకాయ తింటావా అని తను సగం కొరికిన కాయని చూపించాడు. రేఖ ఇబ్బందిగా వద్దని సైగ చేసింది.
ఇంతలో శివ జామకాయ మొత్తం తినేసి “స్పృహ రావడానికే రెండు రోజులు పట్టింది.. తననే అడుగుదాం” అని లోపలికి వెళుతుంటే సూర్య బైటే ఆగిపోతూ జేబు లోనుంచి ఇంకో జామకాయ తీసి రేఖకి ఇచ్చాడు. నవ్వుతూ తీసుకుంది.
శివ ఒక్కడే లోపలికి వెళ్లి ఎదురుగా ఉన్న టేబుల్ మీద కూర్చున్నాడు, అప్పటికే యూట్యూబులో తన వీడియో చూస్తూ కుమిలిపోతున్న శశికళ ఎదురుగా ఉన్న శివని చూసి కళ్ళు తుడుచుకుంది.
శివ : నాకేమైనా చెప్పాలా
శశి : మా అమ్మా నాన్నా ఫోను ఎత్తటం లేదు, వాళ్ళతో ఎలాగైనా మాట్లాడాలి
శివ : ఏర్పాటు చేస్తాను, ఇంకేమైనా చెప్పాలా
శశి తల వంచుకుంది. ఇప్పుడు నా గురించి ఏం చెప్పకపోయినా యూట్యూబులో ఉన్న నా వీడియో ఎప్పుడో అప్పుడు తప్పక చూస్తాడు అప్పుడు నా గురించి చెడుగా అనుకోవడం కంటే ఇప్పుడే చెప్పేయ్యడం మంచిది నమ్మితే నమ్మాడు లేకపోతే లేదు ఆనుకుని నోరు తెరిచి మొత్తం చెప్పేసింది. చివర్లో “మీరు నన్ను నమ్మకపోయినా ఇదే నిజం” అంది.
శివ : నమ్ముతాను, సూర్యా.. అని కేకేస్తూ బైటికి వెళ్ళాడు.
కాసేపటికి సూర్య లోపలికి వచ్చాడు. “మీ ఊరికి వెళదాం, రెడీ అవ్వండి” అని బైటికి వెళ్ళిపోయాడు. ఇంకాసేపటికి రేఖ బట్టలు తీసుకొచ్చింది, తెల్లవి. శశికళ తయారయ్యి బైటికి వచ్చేసరికి సూర్యా రెడీగా ఉన్నాడు. “వెళదామా” అనగానే అలాగే నంటూ వెంటనే కారు ఎక్కింది, కాని శివ కనపడతాడేమోనని చుట్టూ చూసింది. సూర్య “ఏమైంది” అని అడిగితే తల అడ్డంగా ఊపి మెలకుండా కూర్చుంది.
శివ హైడ్ అవుట్ నుంచి బైలుదేరిన కారు మళ్ళీ తెల్లారి సాయంత్రం తిరిగొచ్చింది. శివ అప్పటికే శశికళ కోసం ఎదురు చూస్తున్నాడు. కారు శబ్దం వినగానే కిటికీ నుంచి తొంగి చూసాడు. కారు దిగిన శశికళ మొహం ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయింది. కన్న తల్లి తండ్రులు ఏ తప్పు చెయ్యకుండా చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో శివకి బాగా తెలుసు. అందుకేనేమో శశికళని చూడగానే జాలేసింది. ఆలోచిస్తుండగానే సూర్య లోపలికొచ్చాడు.
శివ : ఏంటి విశేషాలు
సూర్య : ఆ అమ్మాయి చాలా వరస్ట్ సిట్యుయేషన్లో ఉంది. ఊరంతా కలిసి కొట్టబోయారు, తన అమ్మా నాన్నా చనిపోవడం చూసి ఇదంతా తన వల్లేనని ఏడుస్తూనే ఉంది. అక్కడ కార్యక్రమం అయిపోయాక తన రూముకి తీసుకెళ్లి తన సామానుతో తీసుకొచ్చేసాను.
శివ : ఎందుకు ?
సూర్య : అదేంటి.. మనం సాయం చెయ్యట్లేదా, ఆ నాకొడుకులని అలాగే వదిలేద్దామా
శివ : తనని కాపాడాను అంతే.. అక్కడితో అయిపోయింది. తన జీవితం తన ఇష్టం. మన ముడ్డి కడుక్కోవడానికే టైం లేదు.. వదిలిపెట్టిరాపో
సూర్య : వామ్మో.. నువ్వే మాట్లాడుకో.. ఆ అమ్మాయికి నీ పేరు కావాలంట అదేదో చూడు, అని బైటికి పరిగెత్తాడు
