రివెంజ్! Part 2 Like

శశి : చెప్పేది వినరా.. నేను పిల్లల్ని వద్దనుకుంటున్నాను.

రోహిత్ : ఎందుకూ

శశి : ఈ ఒక్కటి ఒప్పుకో ప్లీజ్

రోహిత్ : సరే ముందు పెళ్లి చేసుకో నిన్ను ఎలా ఒప్పించాలో నాకు తెలీదా ఏంటి. అమ్మా నాన్నా మన పెళ్లి గురించి ఎంత బెంగ పెట్టుకున్నారో నీకు తెలీదు. నీకెప్పుడు చెప్పలేదు. వాళ్ళని నీతో మాట్లాడకుండా ఆపేసాను.

శశి : అయ్యో.. నాతో ఎంత బాగా ఉంటారు, ముందే నువ్వు మాట్లాడానిచ్చుంటే ఈ పాటికి మన పెళ్లి అయిపోయి ఉండేది కదా, ఉండు ఆంటీ అంకుల్ తో నేనే మాట్లాడతాను. అని వెంటనే ఫోన్ చేసింది

రోహిత్ : అంటే ముందే అడిగినా నువ్వు ఒప్పుకునేదానివా అని ఆశ్చర్యంగా చూస్తుంటే శశి సమాధానం చెప్పలేదు. ఓహ్ ఛ, ఇన్నేళ్లు వేస్ట్ చేసానా అని బాధపడుతుంటే, శశి నవ్వుతూ “సారీరా, కెరీర్లొ పడి నేనింకేవి పట్టించుకోలేదు” అంది, మనసులో మాత్రం “కాపాడిన దేవుడినే మర్చిపోయానంటే నేనెంత మునిగిపోయానో అర్ధం అవుతుంది” అని అనుకుంది.

అవతల రోహిత్ తల్లి ఫోను ఎత్తగానే వాళ్ళతో సరదాగా మాట్లాడి చివరికి పెళ్లి నిర్ణయం చెప్పింది. వాళ్ళు చాలా సంతోషించారు. ఫోను పెట్టేసి రోహిత్ వంక చూసి “ఓకే నా, హ్యాపీ” అని బుగ్గ మీద కొడితే ముద్దు పెట్టుకోవాలనిపించి ముందుకు వచ్చాడు. శశి ఆపలేదు. బుగ్గ మీద ముద్దు పెడితే “మొద్దు” అని తిడుతూ కాలర్ పట్టుకుని సిగ్గు పడుతూనే ధైర్యంగా లోపలికి లాక్కెళ్ళింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *