రివెంజ్! Part 2 Like

ఇవన్నీ పక్కన పెడితే తన ప్రెగ్నెన్సీ తీయించాడు, చదువుకోవడానికి, వెళ్ళడానికి డబ్బు ఇచ్చాడు. జీవితంలో ఇంకో అవకాశం ఇచ్చాడు. మరోసారి యూట్యూబులో తన వీడియో కోసం వెతికింది కానీ కనిపించలేదు, కచ్చితంగా శివ పనే అని అనుకుంది. ఎయిర్ హాస్టస్ ఫోను ఆపమని చెబుతుంటే అలాగేనంటూ ఫ్లైట్ మోడులో పెట్టేసి కళ్ళు తుడుచుకుంది.

ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది. ముందు భయం వేసినా ధైర్యం తెచ్చుకుంది. అన్ని క్లియర్ చేసుకుని బైటికి వస్తూనే మనసులో అనుకుంది “అయినా భయపడడానికి నా దెగ్గర ఏమున్నాయి, నాకేమైనా అయితే అమ్మా నాన్నా ఎలా అనుకోవడానికి ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. అయితే అందనంత ఎత్తుకి ఎదుగుదాం లేదంటే పాతళం.. ఆమ్మో అలా అయితే తను కాపాడిన ప్రాణం అలా ఎలా వేస్ట్ చేస్తాను. ముందు మన గోల్ రీచ్ అవ్వాలి, తరువాత పగ తీర్చుకోవాలి, ఆ తరువాత సేవ. # నన్ను నమ్మి నాకో అవకాశం ఇచ్చిన నా దేవుడికి ఎంతో కొంత తిరిగివ్వాలి కదా” తనలో తనే నవ్వుకుంది.

బైటికి వచ్చి చూస్తే జనాలు అంతా తెల్లగా పాలిపోయి ఉన్నారు, అయినా మనకెందుకులే అని బైటికి వచ్చింది. ఎలాగోలా దేశం దాటి వచ్చాను ఇప్పుడు ఏంటి, కనీసం రోహిత్ నెంబర్ కూడా లేదు. వెంటనే ఫేస్బుక్ తెరిచి మెసేజ్ పెట్టింది. “హాయ్ రోహిత్, ఎలా ఉన్నావ్”

శశి ఫోను చూస్తుంటే ఇంతలో ఎవరో ఒకమ్మాయి వేగంగా వచ్చి “మిస్ శశికళ ?” అనగానే ఉలిక్కిపడి చూసింది. ఆశ్చర్యపోతూనే వెంటనే “అవును” అంది, ఆ వెంటనే ఎదురుగా ఉన్న అమ్మాయికి తెలుగు వచ్చో రాదోనని “ఎస్ ఐయామ్” అంది. చూస్తే తెలుగు అమ్మాయిలాగే ఉంది కాని వేషాధారణ మాత్రం అస్సలు ఇండియాలానే లేదు. ఆ అమ్మాయి మాత్రం నవ్వుతూ తన ఫోనులో ఎవరికో వీడియో కాల్ చేసింది.

“హేయి రేఖా.. మీ అమ్మాయి వచ్చింది, ఇదిగో మాట్లాడు” అని స్క్రీన్ శశికళ వైపు తిప్పగానే. శశి ఆ అమ్మాయి తనని కాపాడిన వ్యక్తి పక్కన ఉండే సూర్య అసిస్టెంట్ అని గుర్తుపట్టి పలకరించి నిండు కళ్ళతో కృతజ్ఞతగా చూస్తూ థాంక్స్ చెప్పింది.

రేఖ : నువ్వేం కంగారు పడకు, అంతా తను చూసుకుంటుంది. ఓకే.. ఒకసారి తనకివ్వు అనగానే శశి ఫోను ఆ అమ్మాయి చేతికిచ్చింది. ఇద్దరు ఏమో మాట్లాడుకున్నాక ఆ అమ్మాయి ఫోను పెట్టేసి శశి వంక చూస్తు “వెళదామా” అనేసరికి అలాగేనంటూ తన వెనకే నడిచింది.

“నా పేరు శ్రావ్య, కాల్ మి శ్రావ్స్.. ఓకే”

శశి : అలాగేనండి

శ్రావ్య : అండి, గారు లాంటివి వద్దు. పేరు పెట్టి పిలిచేయి, సరదాగా ఉండు. సరదాగా చదువుకో, సరదాగా సాధించు. ఇష్టముంటే ఇక్కడే సెటిల్ అయిపో లేదంటే ఇండియా వెళ్ళిపో.ఆల్రెడీ ఇల్లు ఉంది చూడనవసరం లేదు. ముందు అక్కడికి వెళదాం. మిగతావి కారులో మాట్లాడుకుందాం, పదా అంది నవ్వుతూ

నారింజ రంగు ఫోర్డ్ మస్టాంగ్ ఎక్కి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. లగ్గేజ్ తీసుకుని శ్రావ్య వెనకే వెళ్ళింది. తొడల వరకే ఉన్న షార్ట్ జీన్స్.. శ్రావ్య తన వెనక జేబులో నుంచి కీస్ బైటికి తీస్తుంటే ఉబ్బిన పిర్రలు కనిపించి శశి వెంటనే మొహం తిప్పేసుకుంది. ఇద్దరు రూములోకి వెళ్లారు.

శ్రావ్య : ఇదే నా ఇల్లు, ఇక నుంచి మన ఇద్దరిది. ఈ ఏరియాని సిడె పల్లర్స్ అంటారు. ఇక్కడి నుంచి నీ యూనివర్సిటీ నలభై నిమిషాలు, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. నీ చదువు అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. నీ ఖర్చులు మొత్తం రేఖ నాతో మాట్లాడింది. సొ అస్సలు టెన్షన్ పడకు. అని శ్రావ్య లొడాలోడా వాగుతుంటే శ్రావ్య ఫోను మోగింది. వెంటనే ఎత్తి “హలో.. ఒక్క నిమిషం” అని ఫోను శశికళకి ఇచ్చింది.

శశి ఫోను అందుకుని “హలో” అనగానే అవతల నుంచి “అంతా ఓకేనా” అన్న గొంతు వినపడగానే అది తన దేవుడిదని తెలిసి వెంటనే “సార్” అంది ఆనందంతో

“నువ్వు సెటిల్ అయ్యేవరకు అక్కడే ఉండు, ఖర్చులు మొత్తం నేనే భరిస్తాను. ఈరోజు నుంచి లెక్క రాస్తారు. నువ్వు వాడే ప్రతీ రూపాయి నాకు వడ్డీతో సహా కట్టాలి ఉద్యోగం వచ్చాక, అర్ధమైందా” చాలా సీరియస్ గా ఉందా గొంతు

“హా సర్” అంది నెమ్మదిగా శశి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *