సాయంత్రం వరకు పనులన్నీ పూర్తి చేసుకుని రోహిత్ కి ఫోన్ చేద్దాం అనుకుంటుండగా రోహిత్ నుంచే ఫోన్ రావడంతో పోనీలే ఆనుకుని ఎత్తింది.
రోహిత్ : ఎక్కడున్నావ్, నేను పార్కింగ్ దెగ్గరె ఉన్నాను. నీ పని అయిపోతే నిన్ను డ్రాప్ చేస్తాను.
“వస్తున్నాను” అని పెట్టేసి పార్కింగ్ దెగ్గరికి వెళ్లి మౌనంగా రోహిత్ కారు ఎక్కి కూర్చుంది. ఇద్దరు చాలాసేపు ఏం మాట్లాడుకోలేదు. శశి రోహిత్ వంక చూస్తూ “నీ గురించి ఏం చెప్పలేదు” అంది. రోహిత్ ఏం మాట్లాడలేదు, ఇవ్వాళ తనని ఎటైనా తీసుకెళ్లాలి ఏవేవో చెప్పాలి అనుకున్నాడు కానీ..
రోహిత్ : నా దెగ్గర చెప్పుకోవడానికేంలేదు. రొటీన్ లైఫ్, అలవాటు పడిపోయాను.
అంతే ఇంకేం మాట్లాడుకోలేదు. ఆల్రెడీ పెళ్లి కాలేదని చెప్పకనే చెప్పేసాడు. శశిని తన ఇంటి దెగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు.
తెల్లారి నుంచి శశికళ సైంటిస్ట్ ప్రయాణం మొదలయింది. రోజుకి నాలుగు గంటలు మాత్రమే పడుకుంటూ నాలుగేళ్లలో మూడు పీజీలు చేసింది. నానో టెక్నాలజీ, నానో పార్టికల్స్, చిప్స్ గురించి చాలా లోతైన అవగాహన సంపాదించింది. ఇంకో రెండేళ్లు ఆస్ట్రేలియాలొ ప్రముఖ పేరు గాంచిన సైంటిస్ట్ దెగ్గర అసిస్టెంటుగా పనిచేసింది. వీటన్నిటితోపాటు ముఖ్యంగా మనిషి మెదడులొ ఉండే స్థితి, తెలివిని ఒక చిప్పులొ పొందుపరిచే జ్ఞానాన్ని సంపాదించింది, కాదు ఆవిష్కరించింది. దీన్ని పరీక్షించి నోబెల్ ప్రైజ్ బహుమతి అందుకోవాలని ఇంకో రెండేళ్లు వృధా చేసింది. చివరికి ఈ ఆలోచన మానవాళికి మంచి కంటే చెడె ఎక్కువ జరుగుతుందని, దీని వల్ల తన ప్రాణానికి కూడా ముప్పు పొంచొచ్చని ముందే పసిగట్టి ఆ ప్రయత్నం మానుకుని ఎవ్వరికి తెలీకుండా సంబంధించిన రికార్డ్స్ మొత్తం చేరిపేసి, తిరిగి స్పెయిన్ వచ్చేసింది.
ఈ ఆరేళ్ళలొ తనకి తోడుగా ఉంటూ మంచి సలహాలు ఇచ్చి ప్రోత్సాహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ మాత్రమే.. శశితో స్నేహం చేసి తను కూడా ఒంటరిగానే మిగిలిపోయాడు. రోహిత్ తో కలిసి చిన్న ప్రయోగాలు చేసే కంపెనీ ఒకటి పెట్టింది. ప్రయోగాలు చేసే వాళ్ళు డబ్బు కట్టి రిజిస్టర్ చేసుకుంటే కావాల్సినవన్నీ కంపెనీనే సమాకూర్చి పెడుతుంది, అంతే కాకుండా ఆ ప్రయోగం సఫలం అవ్వడానికి తమ వంతు కృషి చేస్తారు. ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తుంది కంపెనీకి.
రోజూ రాత్రి స్నానం చేసి పడుకునేముందు రోహిత్ తో మాట్లాడడం ఒక అలవాటు అయిపోయింది. ఈరోజు రోహిత్ ఇంకా ఫోన్ చెయ్యలేదు.
అనేకానేక ప్రాజెక్టుల్లో తనదైనా ముద్ర వేసి, సొంత ఇల్లు, సొంత కారు. పేరు, పలుకుబడి, జీవితానికి సరిపడా బ్యాంకు బాలన్స్ అన్ని సంపాదించుకుంది, అయినా ఒంటరిగానే బ్రతుకుతుంది. తనని పెళ్లి చేసుకుంటానని రోహిత్ అడగను లేదు, తనని పెళ్లి చేసుకోమని అడిగే ధైర్యం శశికి లేదు. తన జీవితంలొ ఎంత మార్పు తెచ్చుకున్నా గతాన్ని చెరపలేదు కదా, ఏవేవో ఆలోచిస్తుంటే రోహిత్ నుంచి ఫోను చూసి అన్ని మర్చిపోయి నవ్వుతూ ఎత్తింది
శశి : ఏంట్రా ఇవ్వాళ లేట్ అయ్యింది
రోహిత్ : శశి.. నీకోటి పంపిస్తున్నాను చూడు అంటుండగానే శశి ఫోనుకి ఒక ఫోటో వచ్చింది.
అదో తెలుగు న్యూస్ పేపర్ కటింగ్. “నాసాకి సంబంధించిన ఎలక్ట్రానిక్ రాకెట్ ప్రయోగంలొ తగు సూచనలు చేసిన తెలుగు మహిళా సైంటిస్ట్ శశికళ” అని పక్కన చిన్న ఫోటో కూడా వేసారు. కింద మ్యాటర్ ఉంది.
