రొమాంటిక్ చర్చ్నింగ్ 24 79

హ్మ్మ్ ఓకే నమ్ముతున్నాను నిన్ను,మళ్లీ అడుగుతున్నా హ్యాండ్ ఇవ్వవు గా అంది నా వైపు చూస్తూ.

అబ్బే అలా ఏమీ జరగదు లెండి ,మీరు నిశ్చింతగా చెప్పొచ్చు అన్నా..

సరే అంటూ,మీరు ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మనీ బాగా గమనించి ఈ బొమ్మకీ మిగిలిన బొమ్మలకీ తేడా చెప్పండి చూద్దాం అంది..

సరే అని అన్నీ చూసి వచ్చి ఈ స్వస్తిక్ బొమ్మతో కంపేర్ చేసాను,నాకైతే ఏమీ తేడా కనిపించలేదు..

ఏంటండీ ఏమీ తేడా లేదుగా అన్నాను ఆశ్చర్యం గా..

హ హ్హా అని అందంగా నవ్వేస్తూ,అంత ఈజీగా పట్టేయడానికి ఇది అంత సులువైన పని అనుకుంటున్నారా??ఇప్పుడు చూడండి అంటూ ఒక ప్లాస్టర్ తీసి ఆ బొమ్మ అంతా కవర్ అయ్యేలా అతికించింది..

కాసేపు అలాగే ఉండనించి ఆ ప్లాస్టర్ పైన ఏదో స్ప్రే కొట్టింది..

మరికొద్దిసేపటికి ఆశ్చర్యం గా ఆ ప్లాస్టర్ అంతా కరిగిపోవడం ,ఆ బొమ్మ స్థానం లో అదే విధంగా ఒక ఇనుము స్వస్తిక్ సింబల్ కనిపించడం జరిగాయి నాకు ఇంకాస్తా ఆశ్చర్యం ని కలుగజేస్తూ..

నేను ఆశ్చర్యం నుండి తేరుకునేలోపే తను మొబైల్ తీసి దాన్ని ఫోటో తీసి ఎవరికో పంపించింది…పంపించిన ఒక్క క్షణం కే ఆమెకి కాల్ వచ్చింది.

హలో తాతయ్యా,ఇదే నా పక్కాగా??

హా అదేనమ్మా ,ఎన్నేళ్ల శ్రమ అమ్మా ఇది,నా బుజ్జి సాధించింది అంటూ సంబరపడిపోయాడు అవతల వ్యక్తి(తను స్పీకర్ ఆన్ చేయడం వల్ల నాకు వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి).

సరేలే తాతయ్యా,ఇప్పుడు నా దగ్గర ఉన్న తాళాలతో దీన్ని తెరిచేయనా??

అక్కడ సెక్యూరిటీ వాళ్ళతో సమస్య వస్తుందేమో ఉమా,కాస్తా జాగ్రత్తగా చెయ్ పని.

ఆ ఇబ్బంది లేదులే తాతయ్యా,ఇక్కడ ఒకతను వాళ్ళని కన్విన్స్ చేసి నన్ను లోపలికి తీసుకొచ్చాడు అంటూ నా వైపు చూసి నవ్వింది అందంగా.

హమ్మయ్యా, దైవ కార్యానికి దేవుడే పంపాడు అమ్మా ఆ మనిషిని…ఇంతకీ ఎలా తెరవాలో తెలుసు గా అన్నాడు..

హా తెలుసు లే తాతయ్యా ఇక ఉంటాను త్వరగా పని పూర్తి చేసి వచ్చేస్తా అంటూ కాల్ కట్ చేసింది..

హ్మ్మ్ అయితే దీన్ని ఓపెన్ చేస్తోంది అన్నమాట అనుకొని, ఇంతకీ మీరేమైనా ప్లాన్ వేసారా ఉమా గారు ఈ కోటలోని సంపద అంతా కొల్లగొట్టడానికి అన్నా నవ్వుతూ..

చివుక్కున నా వైపు చూసి,అంత దిగజారే పనులు మేమెప్పుడూ చేయం అండీ మాకు కొల్లగొట్టే ఖర్మ ఎందుకూ??ఇదంతా మా సంపదే అన్న విషయం మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది అంటూ కోపంగా నన్ను హెచ్చరిస్తూ మాట్లాడింది..

నేను ఆశ్చర్యం గా మీ సంపదా??ఆహా ఎంత బాగా చెప్తున్నారండీ అబద్దాలు అన్నా మళ్లీ నవ్వుతూ..

అబద్దాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదండీ, చూస్తుంటే మీరు నా ప్రయత్నం కి అడ్డు చెప్పేలా ఉన్నారే??బాగన్నా నమ్మాను మిమ్మల్ని అంటూ రుసరుసలాడింది..

ఎందుకైనా మంచిది ఈ ఉమా పంచాయితీ కనుక్కోవాలని నా దగ్గర ఉన్న ఇత్తడి బిళ్ళని అరచేతిలో పెట్టుకొని, ఈ సంపద ,రహస్యాలు మీవే అని నేనెలా నమ్మాలి అన్నా.

మీకు నమ్మకం కలిగితేనే నన్ను ముందుకు పోనిస్తారా??తన కళ్ళు ఎర్రగా అయ్యాయి కోపంతో.

అవునండి ఉమా గారు,నాకు రూఢీ అయితే తప్ప మీరు ముందుకు కదలడానికి వీలు లేదు,ఈ అపూర్వమైన కోట ని నేను చూస్తుండగా ఎవరో కొల్లగొట్టడం జరగదు అన్నా ధైర్యంగా..

నేనెవరనుకున్నావ్??తను భద్రకాళి లా ఘీంకరించింది..

మీరు ఎవరైతే నాకేంటి?? తెరవడానికి వీలు లేదు అన్నా అంతే కోపంతో..

అయితే చూస్తావా నా ప్రతాపం అంటూ తన బ్యాగ్ లోని అచ్చు నాలాగే ఉన్న ఇత్తడి బిళ్ళని తీసుకొని నా పైన ప్రయోగించింది నాకు సంకెళ్లు వేసేలా..

నా చేతులకి సంకెళ్లు పడేసరికి,కొంత నమ్మకం కలిగింది ఆమె పైన అందులోనూ ఈ ఇత్తడి బిళ్ళ సాధ్వి తాలూకు మనుషుల దగ్గరే ఉంటాయి అన్న విషయం గుర్తొచ్చి సరే సరే ఎందుకు అంత కోపం ఉమా గారు,ఇప్పుడు నమ్మానులే నన్ను విముక్తుడిని చేయండి అన్నా నా బలం ప్రయోగించకుండానే..

ఇప్పటికైనా తెలిసిందా నా బలం ఏంటో అని అంటూ నన్ను విముక్తుడిని చేసి,తాళాల గుత్తితో దాన్ని తెరవడానికి ప్రయత్నించింది.ఎంతసేపటికీ దాన్ని తెరవడం ఆమె వల్ల అవ్వట్లేదు..

ఈ ఉమా ఎవరో సాధ్విల తాలూకు మనిషే అని రూఢీ చేసుకొని,నేను ట్రై చేయనా అన్నా ఆమెని చూస్తూ..

నన్ను అవహేళనగా చూస్తూ,నా వల్లే అవ్వడంలేదు ఇక నువ్వు ట్రై చేస్తావా పక్కనుండు బాబూ అని గడ్డి పరకలాగా అవాయిడ్ చేసింది నన్ను..

ఆ మాటకి రోషం తెచ్చుకొని,ఈ తాళాలు పెట్టి ఓపెన్ చేయడం పెద్ద బ్రహ్మ విద్యా అంటూ ఆమె చేతిలో నుండి తాళాల గుత్తి లాక్కొని ఇంతకు ముందు సాధ్విల నివాసంకి వెళ్ళినప్పుడు ఓపెన్ చేసిన అనుభవంతో చిటికెలో దాన్ని అడ్జస్ట్ చేసి తిప్పాను..

నా దెబ్బకి ఒక 10 అడుగుల ఎత్తు,6 అడుగుల పొడవు ఉన్న ఒక ఇనుప ద్వారం తెరుచుకుంది అంతులేని ఆశ్చర్యం కలిగిస్తూ..

ఉమా అయితే నన్ను ఆశ్చర్యం గా చూస్తూ,ఎలా తెరిచావ్ నువ్వు అంటూ నన్ను పరిశీలనగా చూస్తోంది..

అబ్బా అందులో ఏముంది వింత??తాళం విప్పడానికి కూడా విద్యలు అవసరమా అంటూ ఆ మాటని దాటవేసి ఒక మహాద్భుతమైన దృశ్యాన్ని కళ్ళతో చూస్తూ విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాను..

ఉమా ఆ తలుపుని మూసేయాలి లేకుంటే ఎవరైనా వస్తారు అని చెప్పడంతో,ఆ తలుపుని అవలీలగా మూసేసి ఆమె ముందు నిలబడ్డాను..

ఆమె ఆశ్చర్యం గా, సంజయ్ నేను ఈ సాధ్వి తాలూకు మనిషిని,అందులోనూ మట్లి మహారాజ వంశస్థురాలిని..నా వల్లే కానిది నీ వల్ల ఎలా అయింది చెప్పు అని అడిగింది..

ఆమె మాట నన్ను విపరీతమైన ఆశ్చర్యానికి గురి చేసింది తను మట్లి రాజ్యపు వంశస్థురాలిని అన్న మాట చెవిలో దూరి..

1 Comment

  1. Superb broo roju roju ki katha involve chestunnru keep going best of luck

Comments are closed.