సేల్స్ స్టార్ 4 179

అర్థం అయి రచన ముఖం రక్తం చిమ్మినట్టు ఎర్రబడింది.

గుసగుస లాడుతున్నట్టు అన్నా. “మనం రెడ్డి గార్ని అంత రాక్షసుడి లా చూడక్కర్లేదు అనుకుంటా. ఆయన చాలా సీదా సాదా మనిషి అని, ఆయన కి సిగ్గ్గు ఎక్కువ అని సేన్ గారు చెప్పారు. ఆడవాళ్ళని కన్నెత్తి కూడా చూసే మనిషి కూడా కాడుట ఆయన. అవ్వాళ ఎవరో చెప్పిన మాటలు విని అపార్ధం చేసుకుని ఆయన అలా ప్రవర్తించాడుట. ఆయన భార్య కూడా ఆయన తో కలిసి ఉండటం లేదుట తెలుసా….”

నా మాటల్ని మధ్యలో ఉండగానే రచన “ఆయన మర్యాదస్తుడు, పెద్ద మనిషి. రోజూ జిమ్ లో కసరత్తు చేస్తాడుట, మంచి భోజనప్రియుడుట, అవ్వాళ నన్ను చూసే వరకు వేరే అమ్మాయిలతో అలా ప్రవర్తించ లేదుట. అవునా? ” అంది నవ్వుతూ.

ఈ సారి ఆశ్చర్య పోవటం నా వంతైంది. “ఇవన్నీ నీకెలా తెలుసు ?”

“మా చెవుల్ని తక్కువ అంచనా వెయ్యద్దు. మీరు మాట్లాడుకున్న విషయాల గురించి అత్తయ్య చెప్పింది.”

అమ్మ తెలివితేటల్ని మనసు లోనే అభినందించాను. “డార్లింగ్! వాళ్ళు మనకి కలలో కూడా ఊహించలేని గొప్ప అవకాశాన్ని ఇస్తున్నారు. అర్థం చేసుకోగలవనుకుంటా.”

రచన మాట్లాడలేదు.

“డియర్, ఇంత చక్కటి అవకాశం ఇస్తున్న రెడ్డి గార్ని మనం ఒక సారి మళ్ళీ కలిస్తే బావుంటుంది. కనీసం థాంక్స్ అయినా చెప్పచ్చు.”

“ఆయన మళ్ళీ వింత గా పరవర్తించడని ఏం గారంటీ ?”

“రెడ్డి గారు చాలా అంతర్మధనం లో ఉన్నారు, అలాంటిది ఏదీ ఈ సారి జరిగే అవకాశం లేదు అని సేన్ గారు నాతో అన్నారు. పైగా, నా ఈ ఎక్స్పోర్ట్ అవకాశం ముందుకి కదలటానికి మనం ఆయన్ని కలవటం అవసరం అన్నాడాయన.”

రచనని దగ్గరికి తీసుకుని పెదాల మీద ముద్దు పెట్టుకున్నాను. “నువ్వు ఎంత అందం గా ఉంటావో వో నీకు తెలీదు. నిన్ను చూసిన మొగాళ్ళు ఎంత పిచ్చెక్కి ఉంటారో నన్నడుగు. రెడ్డి గార్ని చూడు. ఆయనకి అన్నీ ఉన్నై, డబ్బు, హోదా, మంచి కండలు తిరిగిన శరీరం, కానీ నీకోసం ఎంత పిచ్చి వ్యామోహం లో ఉన్నాడో. నీ అందం ఆయన్ని మైనం లా కరిగించింది.”