థర్డ్ MISSION 3

అదేసమయంలో డబల్ కంగ్రాట్స్ మహేష్ అంటూ చేతిని అందుకుంది నా హృదయస్పందన ……
జన్మజన్మల అనుబంధం అన్నట్లు వొళ్ళంతా జలదరించింది – మాటల్లో వర్ణించలేని ఆనందం నేరుగా హృదయం నుండి కళ్ళల్లోకి చేరింది – ఆ అనుభూతిని వర్ణించలేకపోతున్నాను .
” మహేష్ మహేష్ ….. ఏమైంది – కళ్ళల్లో ఏమిటా కన్నీళ్లు ”
కన్నీళ్ళలా కనిపిస్తున్నాయా …… నెంబర్ 2 , ఇవి ఒక మనిషికి పీక్స్ లో ఆనందం కలిగితే వచ్చే సంతోషపు బాస్పాలు – I am సో సో సో soooooo హ్యాపీ …..
” ఎందుకు ? ”
ఎందుకంటే నీకే తెలియకుండా same to same కన్నీళ్లు నీ కళ్ళల్లో కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ……
” అవునవును …… నువ్వు చెప్పినట్లుగానే నాకూ ఆ అనుభూతి కలుగుతోంది చాలా బాగుంది అంటూ సంతోషంతో నవ్వింది – చేతినివదిలి సంతోషపు బాస్పాలను తుడుచుకుంది – మహేష్ ……. ఇంతకూ నెంబర్ 2 అని పిలుస్తున్నావేమిటి ? .
రిజిస్టర్ లో నీ నెంబర్ అదేకదా ….. , నువ్వెలాగో పేరు చెప్పడం లేదు అని అలా కంటిన్యూ అయిపోతున్నాను , ఇప్పుడైనా పేరు చెప్పొచ్చుకదా ……
చిరునవ్వే సమాధానం అయ్యింది .
ప్చ్ ప్చ్ …….

మహేష్ …… అక్కడ ఉన్నావా ? , wait wait వస్తున్నా వస్తున్నా …… హెడ్ మిస్ట్రెస్ ….. సక్సెస్ సక్సెస్ లిస్ట్ లోని రెండవ ప్రాబ్లమ్ కూడా సక్సెస్ అంటూ అంతులేని ఆనందంతో మాదగ్గరికివచ్చి నాచేతిని అందుకుని థాంక్యూ థాంక్యూ థాంక్యూ అంటూ తెగ ఊపుతున్నారు .
మేడం గారూ …… నాకెందుకు ఇన్ని థాంక్స్ లు చెబుతున్నారు – ఇంతకూ మీరెవరు ? – మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నామా ? .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ …… అంటూ తియ్యనైనకోపంతో చేతిపై గిళ్లబోయి నో నో నో అంటూ ఆగి నవ్వుకుంటున్నారు . .
ప్చ్ ప్చ్ మళ్లీ ఫైల్ ……. ok ok మేడం , చెప్పానుకదా మీ లిస్ట్ – మీ సక్సెస్ – మీ సంతోషం ….. అని , ప్చ్ ….. గిల్లోచ్చుకదా అంటూ దీనంగా చూస్తున్నాను – మీ థాంక్స్ లు ఎవరికి కావాలి , నావల్లనే అంటారు నా చిరు కోరికను తీర్చరు .
హెడ్ మిస్ట్రెస్ : అమ్మో జస్ట్ మిస్ …… , నాతో నీ పప్పు ఉడకదులే ……

” ఏమి కోరిక అంటీ …… ? ”
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ …… ఇక్కడే ఉన్నావా ? అంటూ గుండెలపైకి తీసుకుని నుదుటిపై ముద్దుపెట్టారు .
తల్లీ …… తరువాత పేరు ఉంటుంది కదా మేడం , చెప్పండి చెప్పండి ……
హెడ్ మిస్ట్రెస్ : ఓహ్ తన పేరా ……
” అంటీ అంటీ …… అంటూ చేతితో మేడం నోటిని మూసేసి అందమైన నవ్వుతో ఊహూ అంటూ సైగలుచేసింది ” .
మేడం గారేమో …… చిన్న కోరిక తీర్చరు – నెంబర్ 2 ఏమో ….. పేరు చెప్పదు , ఇలాగైతే కష్టం కదా …….
” మహేష్ కోరిక ఏమిటి అంటీ అంటూ నెంబర్ 2 – నెంబర్ 2 ఏమిటి ” అంటూ ఒకసారి ఒకరినొకరు అడిగి నవ్వుకున్నారు .
” తెలుసుకుని మరింత గట్టిగా నవ్వుకున్నారు “.
నవ్వుకోండి నవ్వుకోండి …….

హెడ్ మిస్ట్రెస్ : నవ్వుకుంటాములే …… , మహేష్ …… ” లిస్ట్ – సక్సెస్ – సంతోషం ” అన్నావే అవి నావి కాదు తల్లి …… నెంబర్ 2 వి అంటూ తన మొబైల్ అందుకుని సేవ్ చేసుకున్న లిస్ట్ చూయించారు .
నెంబర్ 2 లిస్ట్ మీతో ఎలా మేడం …… ? .
హెడ్ మిస్ట్రెస్ : అదొక పెద్ద కథ , ఆకలి ఆకలి అంటూ స్టూడెంట్స్ మధ్యలోనుండి తెగ కేకలువేశావుగా పదా ముందు తిందాము .
అవునవును మీ తల్లి నెంబర్2 కూడా తినాలికదా ……
హెడ్ మిస్ట్రెస్ : అలా ఎందుకు పిలుస్తున్నావు ? .
మరి పేరు చెప్పమనండి ……. , సంతోషంగా అపురూపంగా పేరుతోనే పిలుస్తాను .
నా హృదయస్పందన నవ్వుకుని , గెస్ చెయ్యి మహేష్ – ఓన్లీ వన్ గెస్ …….
ఇలాచెప్పావు బాగుంది నెంబర్ 2 …… అంటూ హృదయంపై చేతినివేసుకుని , తన కళ్ళల్లోకే కన్నార్పకుండా చూస్తున్నాను , ప్లీజ్ ప్లీజ్ నెంబర్2 కదలకు ……
” Ok అంటూ మనసు పులకించేలా అందంగా నవ్వుతోంది – ఒక్క చాన్స్ మాత్రమే …….”
తెలిసిపోయింది తెలిసిపోయింది …… , నాకు ప్రాణమైన పేర్లు ఇప్పటికి ( అంటీలు ముగ్గురు – మేడం ) నాలుగు – ప్రియమైన పేర్లు ( ఆక్కయ్యలు ) మూడు ఉన్నప్పటికీ ప్రాణం కంటే ఎక్కువైన పేర్లు మూడు అందులో ఒకరు మా పెద్దమ్మ ఇక రెండు ఉన్నాయి వాటిలో తప్పకుండా ఒకరు అయిఉంటుంది , నెంబర్2 తప్పుగా అనుకోకపోతే నా హృదయంపై చేతిని వెయ్యగలవా ? , నీకు ఇష్టం లేకపోతే …… అనేంతలో ……
నా చేతిని నా హృదయంపైనుండి లాగేసి , నా బుజ్జిహృదయంపై అరచేతినివేసింది – తియ్యదనంతో నవ్వుతోంది .
ఆఅహ్హ్ …… అంటూ కళ్ళు మూతలుపడటంతో చేతులను విశాలంగా చాపి నన్ను నేను మైమరిచినట్లు – వర్ణనకు సాధ్యం కాని మధురానుభూతితో వెనక్కు పడిపోబోయాను …….
మహేష్ మహేష్ …… అంటూ జాగ్రత్తగా పట్టుకుని , ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ …. మహేష్ ok కదా అంటూ నిలబెట్టి నా ప్రక్కనే నిలుచున్నారు .
” తెలిసింది అన్నావుకదా మహేష్ ….. ఎంతసేపు అంటూ తియ్యనైన నవ్వులు ”
రెండు ప్రాణం కంటే ఎక్కువైన పేర్లు …… , నెంబర్2 …… తప్పుగా మాట్లాడితే మేడం కిందపడిన కర్రలతో కోపం తగ్గేదాకా కొట్టు – నీ చేతిపై చేతిని వెయ్యొచ్చా ? అంటూ కళ్ళు బిగుతుగా మూసుకుని అడిగాను – ప్లీజ్ ప్లీజ్ …….
” హ్యాపీగా వెయ్యొచ్చు …… , ఇంత మంచివాడిని ఎందుకు కొడతాను ”
తనతో నిండిపోయిన నా హృదయంపై చేతిని ఉంచిన నా హృదయస్పందన చేతిపై చేతినివేశాను – మధురాతిమధురమైన అనుభూతితో ఆఅహ్హ్ …… అంటూ మళ్లీ పడిపోబోతే మేడం పట్టుకుని నిలబెట్టి నవ్వుకుంటున్నారు …….
థాంక్యూ మేడం ……. , కళ్ళుమూసుకునే ఆదా ఇదా ఆదా ఇదా …… ఇక ఆలస్యం చెయ్యను నెంబర్2 చెప్పేస్తున్నాను – నీ పేరు ” జానకి ” ……
నా హృదయంపై ఉన్న నెంబర్2 చెయ్యి వెనక్కు తీసుకుంది .
కళ్ళుమూసుకునే ప్చ్ ప్చ్ …… కాదన్నమాట , sorry నెంబ …… అనేంతలో ……
” థాంక్యూ థాంక్యూ ……. మహేష్ అంటూ కౌగిలింత ”
చిన్న చేతి స్పర్శకే మైమరిచిపోయాను – కౌగిలింతకు స్వర్గం దాకా వెళ్ళిపోయాను
……
అమ్మో …… ఇద్దరిని పట్టుకోవడం కాస్త కష్టమే , మహేష్ మహేష్ ……. స్పృహలోకి రా …….
నావల్ల కావడం లేదు మేడం …… , జానకి కరెక్ట్ అన్నమాట యాహూ యాహూ …… అంటూ సంతోషంతో కేకలువేస్తూ కలుగుతున్న మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ కళ్ళుతెరిచాను .
Sorry sorry మహేష్ అంటూ వెనక్కు వెళ్ళింది .
లేదు లేదు …… , జానకీ …… ఏమిటా కన్నీళ్లు ? – నావల్లనేనా ఉండు నాకు దెబ్బలుపడాల్సిందే అంటూ కిందపడిన కర్రను అందుకున్నాను .
” ఆనందబాస్పాలకు – కన్నీళ్లను తేడా తెలుసుకదా …… , ఇవి నువ్వు చెప్పినట్లుగా పీక్స్ ఆనందం – అందమైన ఉద్వేగం కలిగినప్పుడు వచ్చే ఆనందబాస్పాలు ……. , థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో sooooo మచ్ …… , ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదు మహేష్ ……. , డబల్ థాంక్స్ – త్రిబుల్ థాంక్స్ …… కాదు కాదు వంద వేలు లక్ష కోటి థాంక్స్ మహేష్ ….. అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది .
జానకీ ……. నాకు అర్థం కావడం లేదు .
జానకి : మహేష్ …… నువ్వు అలా పిలిచిన ప్రతీసారీ ఎంత ఆనందం కలుగుతోందో తెలుసా ? , ఇలాంటి మధురానుభూతి ఉందని కూడా తెలియదు అంటూ మేడం గుండెలపైకి చేరింది .
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ జానకీ ……
జానకి : అంటీ ఉమ్మా ……
జానకి : మీ ఇద్దరికీ ఆకలివేస్తోంది కదూ …… , స్వయంగా నేనే వడ్డించుకుని వస్తాను ఉండండి ……
జానకి అంతులేని స్వచ్ఛమైన ఆనందాన్ని చూస్తూ వెనుకే వెళ్ళాను – మేడం ….. మా వెనుకే ఫాలో అయ్యారు .

ఇద్దరూ …… మధ్యాహ్న భోజనం వరుసలలోనే నిలబడ్డారు . జానకీ – మేడం …… మీరు క్యారెజీ తెచ్చుకోరా ? .
జానకి : మహేష్ …… నువ్వు అలా పిలిచిన ప్రతీసారీ పులకించిపోతున్నాను తెలుసా …… , ఒట్టి థాంక్స్ లతో సరిపెడుతున్నాను sorry sorry …….
మేడం : మాఇద్దరికీ …… స్టూడెంట్స్ తినే ఫుడ్ తినడమే ఇష్టం …….
మళ్లీ టచ్ చేశారు మేడం – జానకీ ……. , నేనుకూడా ఇక్కడే తినాలన్నది పెద్దమ్మ ఆజ్ఞ – నాకూ ఇష్టమే అనుకోండి …….
జానకి : జానకీ జానకీ జానకీ …… అంటీ నావల్ల కావడం లేదు అంటూ పట్టరాని ఆనందంతో మళ్లీ మేడం గుండెలపైకి చేరింది .
హెడ్ మిస్ట్రెస్ : ఎంజాయ్ జానకీ …… , మళ్లీ నిన్ను ఇలా చూస్తాననుకోలేదు , మహేష్ మళ్లీ బిగ్ బిగ్ థాంక్స్ …….
మేడం ….. మీ థాంక్స్ లు తీసుకుని మీ ఆఫీస్ రూంలో ఉంచుకోండి …….
హెడ్ మిస్ట్రెస్ : ఇంతకుముందు నీకోరిక తీరుద్దామనుకున్నాను – మా తల్లి జానకికి ఇంత ఆనందం పంచాక ఇక నెవర్ అంటే నెవర్ అంటూ తియ్యదనంతో నవ్వుతున్న జానకి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి నవ్వుకుంటున్నారు , అదిగో మనవంతు వచ్చింది …….
జానకీ …… మీ అంటీ కౌగిలోనే ఉండు , నేనున్నానుకదా అంటూ మూడు ప్లేట్లు అందుకుని వడ్డించుకున్నాను .
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ జానకీ …… అదే ప్లేసేనా ? .
జానకి : ప్లీజ్ అంటీ ……..
హెడ్ మిస్ట్రెస్ : నీఇష్టం – కానీ కంట్రోల్ చేసుకోవాలి , మహేష్ …… అదిగో అక్కడ బుజ్జి స్టూడెంట్స్ కు వాళ్ళ అమ్మలు ప్రేమతో గోరుముద్దలు తినిపిస్తారో అక్కడ …..
హెడ్ మిస్ట్రెస్ వారి ఆజ్ఞ అంటూ వారి వెనుకే వెళ్లి , స్టోన్ బెంచస్ పై కూర్చున్న ఇద్దరికీ ప్లేట్స్ అందించి ఎదురుగా కూర్చున్నాను .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *