ఆక్కయ్యలు షేర్ చేసిన లొకేషన్ ద్వారా పరిగెత్తుకుంటూ Durgamma గుడికి చేరుకున్నాను ఆయాసం వచ్చేసింది – కాస్త దూరమే కానీ అమ్మవారి గోపురాన్ని చూడగానే ఎగిరిపోయింది – భక్తితో మొక్కుకున్నాను .
భక్తులు భక్తితో వచ్చి దర్శనం చేసుకుని ప్రశాంతతో వెళ్లిపోతున్నారు – అంటీవాళ్ళు …… నా దేవతలు అమ్మవారి సన్నిధికి వస్తున్నారంటే ఎలా ఉండాలి , దుర్గమ్మతల్లీ …… అంటూ భక్తితో ప్రార్థించాను – నా విన్నపాన్ని పెద్దమ్మకు తెలిసేలా చేసినట్లు కళ్ళుతెరిచేలోపు గోపురం – గుడి ప్రాంగణం మొత్తం …… పండుగరోజున అలంకరించినట్లు పూలతో విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది , పెదాలపై చిరునవ్వుతో అమ్మవారికి – పెద్దమ్మకు మొక్కుకున్నాను , స్కూటీలకు పూజచెయ్యడం కోసం అవసరమైన పూజా సామాగ్రిని తీసుకుని పూజ జరిపించడం కోసం పూజారిగారికి విషయం తెలపడానికి భక్తితో లోపలికివెళ్ళాను .
వచ్చిపోయే భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు – అందరి పెదాలపై చిరునవ్వులు …… ఈరోజు గుడి ఎంత బాగుందో అంటూ గుసగుసలాడుకుంటున్నారు .
మెసేజ్ …… చూస్తే ” బయలుదేరుతున్నాము – ఇంతకూ నువ్వెక్కడ కనిపించడం లేదు ”
కాసేపు అనిచెప్పి గంటలు గంటలు రెడీ అయితే నావల్ల కాదు అందుకే హ్యాపీగా షాపింగ్ వెళ్ళిపోయాను …….
” నో నో నో మహేష్ ……. మీ అంటీల వల్లనే ఆలస్యం – మీ అంటీలను చూడకపోతే ఎలా అంత బాగా రెడీ అయ్యారు ”
అవసరం లేదు నేను ఆల్రెడీ షాపింగ్ లో ఉన్నాను బై బై …….
” ప్చ్ ప్చ్ …… మహేష్ ”
బై బై ……..
అంటీవాళ్ళు 15 నిమిషాలలో వచ్చేస్తారు – ఇంతపెద్ద అమ్మవారి ప్రాంగణం ఇలా ఖాళీగా ఉండకూడదు ఏమిచేద్దామబ్బా ఐడియా …….
దుర్గమ్మ తల్లీ అంటూ కళ్ళుమూసుకున్నాను , పెద్దమ్మా పెద్దమ్మా ……. మా అంటీలకోసం అంటీల పెదాలపై సంతోషమైన చిరునవ్వులకోసం నేనే స్వయంగా వెలిగించాలి ఆ అవకాశాన్ని మీరే ఎలాగైనా కల్పించాలి సమయం కేవలం 14 నిమిషాలు కాదు కాదు ఇక 13 నిమిషాలే ……. అంటూ కళ్ళుతెరిచాను .
అమ్మవారి గర్భగుడి చుట్టూ దీపాలే ……. , థాంక్యూ పెద్దమ్మా అంటూ చేతిలో క్రొవ్వొత్తితో పెద్దమ్మ అనుగ్రహముతో మెరుపువేగంతో 99994 దీపాలను వెలిగించాను అయినాకూడా ఏమాత్రం ఆయాసం లేదు – చెమట చుక్క రాలలేదు , థాంక్యూ పెద్దమ్మా అంటూ అమ్మవారికి భక్తితో మొక్కుకున్నాను .
హృదయస్పందనలో మార్పు …… వచ్చేసారన్నమాట అంటూ ద్వారం దగ్గరికి చేరుకున్నాను .
Wow …… ఆక్కయ్యలు చెప్పినట్లుగానే చిరునవ్వులు చిందిస్తూ స్కూటీలనుండి దిగిన అంటీలు పట్టుచీరలలో దివినుండి భువికి దిగివచ్చిన దేవతల్లా దర్శనమిస్తున్నారు – ముగ్గురిలో ఎవరినిచూడాలో ఆ క్షణం ఎవరిని మిస్ అవుతానో అన్నట్లు కనురెప్ప పడటం లేదు .
తల్లులూ తల్లులూ తల్లులూ ……. ఇవాళ గుడిని ఎంతచక్కగా అలంకరించారో చూడండి …….
ఆక్కయ్యలు : మా దేవతల్లాంటి అమ్మలు వస్తున్నారనే ఆ అమ్మవారే ఇలా అలంకరించి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది అంటూ నా మనసులోని మాటనే చెప్పారు .
అంటీలు : పోండి తల్లులూ అంటూ సిగ్గుపడి , భక్తితో అమ్మవారిని మొక్కుకున్నారు.
ఆక్కయ్యలు : అమ్మలూ …… ఉండండి పూజావస్తువులను తీసుకొస్తాము .
అవసరం లేదు అన్నీ సిద్ధం భక్తులారా అంటూ పూజారిగారు చేరుకున్నారు – స్కూటీలకు పూలహారాలతో అలంకరించి విభూతి కుంకుమ ఉంచారు .
ఆక్కయ్యలు : పూజారిగారూ మీరు మరెవరికోసమో …….
పూజారిగారు : మూడు రెడ్ – బ్లూ – వైట్ స్కూటీలు …… ఆరుగురు భక్తురాళ్లు …… కరెక్టే ……
అవునవును కరెక్టే పూజారిగారూ అంటూ వారిచేతిలోని పూలను అందుకుని స్కూటీలను అందంగా అలంకరిస్తున్నాను .
ఆక్కయ్యలు : మహేష్ మహేష్ మహేష్ …….
Hi hi hi అంటీలూ ……. , గుడి ఆవరణలో అలా కోపం తగదు – ప్రశాంతంగా ఉండాలి – కావాలంటే ఇంటికివెళ్లాక మీ ముందు నిలబడతాను ఎంతసేపైనా కొప్పడోచ్చు అంటూ నవ్వుకుంటున్నాను .
అంటీలు : తల్లులూ …… వేరే పూజాసామాగ్రి తీసుకు ……
ఆక్కయ్యలు : అమ్మలూ ……. అమ్మవారి సన్నిధిలో కోప్పడకూడదు అని పిల్లాడైనా ఎంత ముద్దుగా చెప్పాడు – అమ్మవారి ఆజ్ఞ లేనిదే చీమైనా కుడుతుందా చెప్పండి అంతా అమ్మవారి అనుగ్రహం ……. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ స్మైల్ స్మైల్ ……
అంటీల పెదాలపై సంతోషాన్ని చూసి థాంక్యూ అక్కయ్యలూ అన్నాను .
ఆక్కయ్యలు : షాపింగ్ వెళ్ళావా షాపింగ్ వెళ్ళావా షాపింగ్ వెళ్ళావా అంటూ గిల్లేస్తున్నారు చిరుకోపంతో …….
అంటీలు : అదీ అలా మా వంతు కూడా గిళ్లండి …….
అక్కయ్యలూ ……. మీ వంతు మాత్రమే గిళ్లండి – అంటీలు అంటీలే అంటూ వెళ్లి బుద్ధిగా చేతులుకట్టుకుని నిలబడ్డాను .
ఆక్కయ్యలు నవ్వుకుంటున్నారు .
అంటీలు : నిన్ను టచ్ చెయ్యడం ఇష్టం లేదు అంటూ అక్కయ్యల దగ్గరికి చేరుకున్నారు .
నవ్వుకున్నాను .
అంతలో పూజారిగారు పూజ చేసి స్కూటీల టైర్స్ కింద నిమ్మకాయలు ఉంచి అగరబత్తులు వెలిగించి టెంకాయలు కొట్టమని పిలిచారు .
పూజారిగారూ పూజారిగారూ ……. మా అంటీలకు అంటీలకు ఇవ్వండి .
ఆక్కయ్యలు : అంటీలు అంటీలు …… స్కూటీలు డ్రైవ్ చేసేది మేము మాకే ఇవ్వండి పంతులుగారూ అంటూ నావైపు కోపంతో చూస్తూ స్కూటీలముందు నేలపై పగలకొట్టారు .
అక్కయ్యలూ …… అంతకోపమా మొత్తం చెల్లాచెదురైపోయాయి ……
మరి అంటూ నవ్వుకున్నారు ఆక్కయ్యలు ……..
పూజారిగారు : ఇక ఎటువంటి అడ్డంకులూ కలుగవు – లోపలికివచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి అంటూ లోపలికి వెళ్లిపోతున్నారు .
అంటీలు : పూజారిగారూ ……
పూజారిగారు : ఆ పిల్లాడు ఎప్పుడో ఇచ్చేసాడు అంటూ సంతోషంతో వెళ్లిపోయారు.
అంటీలు : తల్లులూ …… ఆ పిల్లాడి డబ్బులు ఇచ్చెయ్యండి .
ఆక్కయ్యలు : అమ్మలూ ……. , బస్సులో టికెట్ తీసుకున్నాములే దానికి దీనికి చెల్లు …….
అంటీలు : అయితే ok …… , ఆగండాగండి తల్లులూ …… ఆ పిల్లాడికి ఎందుకు తీసుకున్నారు ఐఫోన్ వాడుతున్నాడు ఆ మాత్రం టికెట్ కు పెట్టుకోలేడా ? , నెక్స్ట్ టైం తీసుకోకండి …… బాగా జల్సాలకు అలవాటు పడ్డట్లున్నాడు , నీ దర్శనం అయిపోయింది కదా ఇక ఇంటికివెళ్లు …….
బుద్ధిగా తలదించుకుని వెనుకే ఫాలో అయ్యాను .
అంటీలు : అవునూ …… ఇంతకూ గుడికి వెళుతున్నట్లు ఎలా తెలిసిందబ్బా …… , ఇంకెవరు వీళ్లే చెప్పి ఉంటారు – ఇక్కడ కాదు కానీ ఇంటికివెళ్లాక దెబ్బలుపడతాయి .
ఆక్కయ్యలు : మహేష్ వచ్చాక తెలిసింది మా అమ్మల దెబ్బలు ఎంత తియ్యగా ఉంటాయో – ఇంటికి వెళ్ళాక మేమే గుర్తుచేస్తాములే అమ్మలూ అంటూ చేతులను చుట్టేశారు ……. , థాంక్యూ మహేష్ థాంక్యూ మహేష్ థాంక్యూ మహేష్ …….
అంటీలు : ప్రతీసారీ …… ఆ పిల్లాడికి థాంక్స్ చెప్పనవసరం లేదు అంటూ లోపలికిఅడుగుపెట్టి , సంభ్రమాశ్చర్యాలతో వెలిగిపోతున్న కళ్ళతో అలా చూస్తుండిపోయారు ………
అంటీలను అలాచూస్తుంటే చాలా చాలా ఆనందం కలిగింది – కష్టానికి తగ్గ …… కష్టమేమీపడలేదులే sorry sorry పెద్దమ్మా అంటూ నవ్వుకున్నాను .
Wow బ్యూటిఫుల్ తల్లులూ తల్లులూ …… అంటూ అక్కయ్యల నుదుటిపై ముద్దులుపెట్టి అమితమైన ఆనందంతో వీక్షిస్తున్నారు అంటీలు – అమ్మవారి సన్నిధి చుట్టూ తల్లులూ …… ఖచ్చితంగా లక్ష దీపార్చననే ఎవరు వెలిగించారో కానీ వారి కోరికలన్నీ తీరి సంతోషంగా ఉండాలి .
థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటీలూ ……..
అంటీలు : లక్ష దీపాలు ఒక్కడే వెలిగించినట్లు బిల్డప్ ఇవ్వకు – మేము అన్నది వెలిగించిన భక్తుల కోరికలు తీరాలని …….
అంటే నాకోరికలన్నీ తీరుతాయి అని స్వయంగా నా ప్రాణ …… నాకిష్టమైన అంటీలే అన్నారు ……. యాహూ యాహూ అంటూ సౌండ్ లేకుండా ఆనందిస్తున్నాను .
అంటీలు : ఈ లక్ష దీపాలను నువ్వు ఒక్కడివే వెలిగించావు అంటే మేము నమ్మాలా
……. ? .
లక్ష కాదు అంటీ ……. అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ , మొదలెట్టింది నేనే అయినా ఈ మూడు దీపాలను మా దేవ ….. ముగ్గురు అంటీలు వెలిగిస్తే ఈ లక్ష దీపార్చన మీరే వెలిగించినట్లు – అమ్మవారు అనుగ్రహించి మీ కోరికలన్నింటినీ తీర్చి సంతోషాలను అందిస్తారు .
దీపార్చన అంటే ఆడవారికి ఎంత ప్రాధాన్యమో అప్పుడు అర్థమయ్యింది – నాపై అంతకోపం ఉన్నప్పటికీ సంతోషంతో ధ్వజస్తంభం దగ్గరకువెళ్లి భక్తితో అమ్మవారికి మొక్కుకుని ఒక్కొక్క దీపాన్ని వెలిగించి పొందిన ఆనందం …… నేరుగా నా హృదయానికి చేరిపోయింది .
దుర్గమ్మ తల్లీ ……. ఈ లక్ష దీపార్చనను పూర్తిచేసినది మా అంటీలే కాబట్టి వారి స్వచ్ఛమైన కోరికలన్నింటినీ మీరే తీర్చాలి .
ఆక్కయ్యలు : అంటే ఈ దీపాలన్నింటినీ వెలిగించినది ……. మా మహేష్ అన్నమాట …….
అంటీలు : ఇంత తక్కువ సమయంలో ఎలా వీలౌతుంది తల్లులూ ……. ఎలా నమ్ముతారు ? .
ఆక్కయ్యలు : నమ్మమని మనసు చెప్పేసింది అమ్మలూ ……. అంటూనే నావైపు కోపంతో చూస్తున్నారు , మీ అంటీలు మాత్రమేనా ……. మేంఉన్నామని కూడా గుర్తులేదా అంటూ కళ్ళల్లో చెమ్మ …….
అక్కయ్యలూ …… దీపార్చన విషయంలో మిమ్మల్ని బాధపెడతానా చెప్పండి – లక్షల్లో 99994 మాత్రమే నేను వెలిగించాను అంటూ ధ్వజ స్థంభం మరొకవైపుకు చూయించాను .
కళ్ళల్లో చెమ్మ ఒక్కసారిగా ఆనందబాస్పాలుగా మారిపోయినట్లు థాంక్యూ థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ ముగ్గురూ ఒకేసారి కౌగిలించుకున్నారు .
తల్లులూ తల్లులూ తల్లులూ ……. ఈపిల్లాడి మాయలో పూర్తిగా పడిపోయినట్లు మీ కళ్ళే చెబుతున్నాయి ఇక వదలండి వదలండి …….
అవును వదలండి ……. ఇలా అంటీలు కౌగిలించుకుంటే ఆనందం కానీ వదలండి …….
అక్కయ్యలు : ఊహూ ఊహూ ఊహూ …… వదలమంటే వదలము , ఎంత సంతోషాన్ని పంచావో తెలుసా ……. ? , మాకు తమ్ముడు ఉండి ఉంటే ఎంత ఆనందం కలిగేదే అంతకు రెట్టింపు ఆనందాన్ని పంచావు ……
అంటీలు : ఆ మాటలకు కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఏమీ అనలేక , తల్లులూ …… మేము అమ్మవారి దగ్గరకు వెళుతున్నాము , దీపాలు వెలిగించి రండి అనిచెప్పి వెళ్లిపోయారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ అక్కయ్యలూ …… సరే సరే ……
ఆక్కయ్యలు : వదిలి , అదే నీ అంటీలు కౌగిలించుకుని ఉంటే ఇలా వదిలేమనేవాడివా ? .
ఏమి మాట్లాడుతున్నారు అక్కయ్యలూ ……. , ఉదయం వరకూ కాదు కాదు జీవితాంతం కౌగిలిలోనే ఉండిపోయేవాడిని అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయాను .
ఆక్కయ్యలు కోపంతో దెబ్బలు కురిపిస్తున్నారు – నేనసలు స్పృహలో ఉంటే కదా ……..
ఆక్కయ్యలు నవ్వుకుని నాసమక్షంలో అమ్మవారికి మొక్కుకుని సంతోషంతో దీపాలు వెలిగించి పరవశించిపోతున్నారు .
అక్కయ్యలూ ……. అలాగే ఉండండి అంటూ ఫోటో తీసాను .
ఆక్కయ్యలు : మరి అమ్మలకు ……. , నా నవ్వులను చూసి నీకు ఆడిగాము చూడు మాకు బుద్ధిలేదు , మాకు ఒక పిక్ తీసి ఉంటే అమ్మలకు 100 తీసి ఉంటావు ……
అంత ఖచ్చితం …… wow ……
ఆక్కయ్యలు : 100 తీశావన్నమాట అంటూ మళ్ళీ దెబ్బలు కురిపించారు .
అంటీలూ అంటీలూ ……. అంటూ లోపలికి పరుగులుతీసాను .
అదేసమయానికి పూజ పోర్తయినట్లు అంటీల తరువాత నాకు హారతి – తీర్థం – ప్రసాదం ఇచ్చారు .
సంతోషంతో అమ్మవారి దర్శనం చేసుకున్నాను .
తల్లులూ తల్లులూ తల్లులూ …… పూజ అయ్యింది మొక్కుకోండి అంటూ కుంకుమ ఉంచారు .
ఆశతో ప్రక్కనే నిలబడ్డాను .
అంటీలు : ఊహూ …….
ఆక్కయ్యలు : అమ్మలూ ….. గుడి , మాకోసం ప్లీజ్ ప్లీజ్ ……
సరే ఈ ఒక్కసారికి మీకోసం అంటూ వాసంతి అంటీ …… నా నుదుటిపై కుంకుమ ఉంచారు .
అంటీలూ …… మీరుకూడా ? .
ఆక్కయ్యలు : ప్లీజ్ ప్లీజ్ అమ్మలూ …….
కోపంతో సరే అన్నారు .
అంటీలూ ……. స్మైల్ ? .
అంటీలు : ఫోటోలేమైనా తీస్తున్నారా నవ్వడానికి అంటూనే నవ్వుకుని నాకు కుంకుమ ఉంచారు .
ఆ సంతోషంలో అక్కడికక్కడే ఎగిరి గెంతులెయ్యాలనిపించింది – గుడి కాబట్టి భక్తితో ఆగిపోయాను .
అంటీలు – ఆక్కయ్యలు ……. భక్తితో మొక్కుకుని కనులారా దీపార్చనను వీక్షించేలా సన్నిధిలో కూర్చున్నారు .
వెనుకే వెళ్లి కూర్చున్నాము – ప్రసాదాన్ని స్వీకరించాము .
అంటీలు : తల్లులూ …… ఇంకా వంట చెయ్యాలి వెళదామా ? .
ఆక్కయ్యలు : అమ్మలూ …… లక్ష దీపార్చన – ఇందులో మనం కూడా భాగస్వామ్యం అయ్యాము కాసేపు తనివితీరా ఆనందిద్దాము – వంట ఆలస్యమైనా పర్లేదు అంటూ చేతులను చుట్టేసి నా బుగ్గలపై ముద్దులుపెట్టారు మరొకచేతితో …….

Oh My God Dad story part 2 continue chai brother please 3 years nunchi waiting please, I can pay u alao plz