పొద్దు పొద్దున్నే బార్ కి వెళ్లి ఒక ఫుల్ చెప్పాను, వెళ్లి నా కేబిన్ లో కూర్చున్నాను…
ఏంటి బార్ లో సెపరేట్ కేబిన్ కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోకండి, గత ఆరు నెలలుగా రోజు పొద్దున నుంచి రాత్రి నాకు నిద్ర వచ్చే వరకు ఇక్కడే ఉంటాను ఈ బార్ కి మనమే ప్రైమ్ కస్టమర్, నెలకి నా కేబిన్ అందులోని టీవీ నా అరెంజ్ మెంట్స్ కోసం ఇరవై వేలు ఇస్తాను మళ్ళీ మందుకు వేరే.
అందుకే నేను ఎంత సేపు ఉన్నా తాగి పడిపోయినా కూడా నాకు ఎవ్వరు అడ్డు చెప్పరు, చాలా రోజులు మందు ఎక్కువై పడిపోయి పొద్దున్న వరకు ఉన్న రోజులు కూడా ఉన్నాయి అందుకే నాకోసం బార్ ఓనర్ బెడ్ కూడా ఏపించాడు.
ఇక్కడికి నేను మొదటి రోజు వచ్చినప్పుడు అంతా నన్ను ఆఫీస్ ఎంప్లొయ్ పార్టీ కోసం వచ్చాడు అనుకున్నారు.
ఆ తరువాత రోజూ వస్తుంటే అడిక్ట్ అవుతున్నాడేమో అనుకున్నారు, కొన్ని రోజులకి తాగుబోతు అనుకున్నారు ఆతరువాత లవ్ ఫెయిల్యూర్ అనుకున్నారు.
ఇప్పుడు అందరికీ నేనంటే జాలి ఆఖరికి బార్ ఓనర్ కూడా నేను మందు మానెయ్యాలి అని కోరుకుంటున్నాడు, జనాలకి ఎప్పుడు పక్క వాడి మీద జాలి, కరుణ, దయ చూపించడమంటే ఇష్టం, కొంతమందికి టైం పాస్, ఇంకొంతమందికి సరదా.
ఇక నా గురించి చెప్పాలంటే నేను లవ్ లోనే కాదు కెరీర్ లో కూడా ఫెయిల్ అయ్యాను, అవును నేనొక mbbs డ్రాప్ అవుట్ ని, చదవలేక కాదు చదువడం ఇష్టం లేక వదిలేసాను.
నాకు ఇలా జరగటానికి నేను ఇలా అయిపోడానికి అన్నిటికి నేనే కారణం, ఎందువల్లనో తెలుసా హోప్… ఇతరుల మీద ఆశలు పెట్టుకోడం అవతలి వాళ్ళని గుడ్డిగా నమ్మడం.
చిన్న వయసులోనే అనుభవంతొ చెప్తున్నా… పక్కనోడి కోసం నీ జీవితం ఆపేస్తే నీకోసం వాళ్ళు ఆగిపోతారని అనుకోడం నీ భ్రమ, ఎవ్వడి జీవితం వాడిది…. కలిసుంటారు, ప్రేమగా మాట్లాడతారు, అవసరం వస్తే ఆదుకుంటారు కానీ ఇవన్నీ వాళ్ళు ఇబ్బంది పడనంత వరకే వాళ్ళ దాకా వస్తే నిన్నెంటి ఆ దేవుణ్ణి కూడా పట్టించుకోరు.
ఇదంతా వీడు తాగి మాట్లాడుతూ సొల్లు వేస్తున్నాడు అనుకోవద్దు, నేను చెప్పినవన్నీ అందరికీ తెలిసినా కానీ పట్టించుకోని పచ్చి నిజాలు, ఇంకోటి ఇది నా గురించి నేను ఎంత మందు తాగినా మత్తు ఎక్కినా బాడీ, నా ఆలోచనలు హైపర్ యాక్టీవ్ గా ఉంటాయి, తాగి పడిపోయినా నాకు కావాల్సినప్పుడు లేవగలను, ఎలా అంటే నన్ను అడగకండి నాకు తెలీదు, ఇప్పుడిప్పుడే మీడియం సైజు టీషర్ట్స్ నుంచి లార్జ్ సైజు టిషర్ట్స్ కి మారాను చూడడానికి స్లిమ్ గా ఉన్నా బలం చాలా ఎక్కువ, నా బలం నాకు తెలుసు.
ఇక ఇప్పుడే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను తాగే ఆఖరి మందు బాటిల్ ఇదే కాబట్టి, ఎందుకు మానేస్తున్నానంటే నాకు విరక్తి పుట్టింది తాగి తాగి మందు అంటే అసహ్యం పెరిగింది ఇక మీదట నేను తాగబోయేది లేదు.
(ఈలోగా ఒకటే సౌండ్) ఎహె ఈ నా కొడుకుల గోల ఎక్కువైంది ఈ మధ్య… బార్ పక్కనే అనాధ ఆశ్రమం ఒకటి ఉంది.. చిన్నదే.. ఇరవై మంది చిన్న పిల్లలు.. పేరు సంధ్యా ఫౌండేషన్స్….వాళ్ళని కాళీ చెయ్యమని రోజు ఒక నలుగురు గొడవ..”ఏంటన్నా మళ్ళీ వాళ్లేనా?” అని ఓనర్ అన్నని చూస్తూ అడిగాను… “అవును తమ్ముడు ఇప్పుడు కూడా రేపటి వరకు కాళీ చెయ్యకపోతే మెడ పట్టి బైటికి గెంటుతామని వార్నింగ్ ఇచ్చి పోయారు, రేపు మల్లేష్ వస్తాడట వాడు వస్తే ఏమవుద్దొ ఏంటో రేపు క్లోజ్ తమ్ముడు” అన్నాడు.. “ఇవ్వాలె లాస్ట్ అన్నా రేపటి నుంచి నీకు కనిపించను”… “ఏంటి తమ్ముడు ఎటైనా వెళ్తున్నావా?”….. “లేదన్నా మందు మానేస్తున్నా ఇవ్వాలె లాస్ట్”…. ” నిజంగా చాలా సంతోషం తమ్ముడు, అప్పుడప్పుడు వస్తూ ఉండు మొత్తానికే మానేస్తే నాకు కష్టం” ఇద్దరం నవ్వుకున్నాం, అన్న షటర్ కిందకి లాగి వెళ్ళిపోయాడు నేను పడుకున్నా…
Intresting
Yes …….
Hi…
Hi…