ఆది – Part 2 190

పలమనేరులో లాడ్జికి వెళ్లి రూమ్ తీసుకుని పడుకున్నాను తగిన మత్తు నన్ను త్వరగానే పడుకోబెట్టింది.

నాన్న : రేయ్ ఇవ్వాళ కాలేజీకి వెళ్ళాలి మర్చిపోయారా, మొదటి రోజే లేట్ గా వెళ్తారా?

అను : నాది అయిపోయింది మావయ్య అయినా కొంతమంది ఎప్పుడూ లేటే…

ఆదిత్య : అయిపోయింది నాన్న వచ్చేసాను పదండి వెళదాం.

నాన్న : వెళదాం కాదు, వెళ్ళొస్తాం అనాలి.

ఆదిత్య : అంటే…

సరిత : “ఇదిగో కీస్” అని గాల్లోకి విసిరింది.

ఆదిత్య : నాకోకే… మరీ అవతల పక్క సంగతీ?

అమ్మ : నీతోటే బాబూ….

ఆదిత్య : నాన్న కార్ తీయ్యి ఇవన్నీ అయ్యే పనులు కాదు.

నాన్న : నేను బిజీ, మావయ్య కూడా ఏరా?

మావయ్య : ఫుల్ బిజీ అల్లుడు దా బావ మనం వెళదాం వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటారులే..

నాన్న : మొన్న కార్ లో ఏం చెప్పాను, ఇప్పుడు నేను మావయ్య ఇద్దరం బిజీ అప్పుడు నువ్వు ఏం చెయ్యాలి.

ఆదిత్య : మన పని మనమే చేసుకోవాలి.

నాన్న : చూసారా అది నా కొడుకు

సరిత : మరీ ఏమనుకున్నావ్ నా అల్లుడంటే చెప్పనవసరం లేదు.. ఒక్క సారి చెప్తే వంద సార్లు అర్ధం చేసుకుంటాడు.

ఆదిత్య : ఏడ్చినట్టే ఉంది.

బైటికి వచ్చి బండి చూసాను… R15..

ఆదిత్య : ఏదో పెద్ద బైక్ అనుకున్నాను R15 కి ఇంత హడావిడి చేశారు, మన దెగ్గర డబ్బులు ఉన్నాయిగా మంచిది తీస్కోవచ్చుగా…

నాన్న : మన దెగ్గర డబ్బులున్నాయ్ నాన్నా కానీ నువేళ్ళే స్పీడ్ ని కంట్రోల్ చేసే అంత లేవు… ఇదీ స్పోర్ట్స్ బైకే… జాగ్రత్తగా వెళ్ళు నీ వెనకాల నా కోడలు ఉందని మర్చిపోకు..

అను : రధసారధి రమ్ము…

ఆదిత్య : చూడు నాన్న నన్ను డ్రైవర్ అని పిలుస్తుంది.

సరిత : అనూ ఇంకోమాట మాట్లాడావంటే ఎర్ర బస్సు ఎక్కించేస్తా ఏమనుకున్నావో..

బండి స్టార్ట్ చేసాను బానే ఉంది అనూని ఎక్కించుకుని ముందుకి పోనించాను మధ్యలో బ్యాగ్ పెట్టింది.

అమ్మ : ఎంజాయ్… అని అరిచింది..

రాజు : మంజూ…

మంజు : కిచెన్ లో పని ఉంది నేను వెళ్తున్నా సరితా రా…

రాజు, సరిత నవ్వుకున్నారు మంజులని చూసి..