ఆది – Part 1 658

ఇక నా గురించి చెప్పాలంటే ముందుగా మీకు ముఖ్యమైన వాళ్ళని పరిచయం చెయ్యాలి, ఇది ఇద్దరు అన్నా చెల్లెలితొ మొదలయిన కధ.

అవును ఆ అన్న ఎవరో కాదు మా నాన్న గోవింద రాజు తన చెల్లెలు అంటే నా అత్త సరిత…..కాలేజీ వయసులోనే అమ్మా నాన్నని పోగొట్టుకున్నారు ఇద్దరు ఒంటరి వారు అయ్యారు, ఇంతమంది చుట్టాలలో ఎవరైనా చేరదీస్తారని చాలా ఎదురు చూసారు కానీ అది జరగదని తొందరగానే అర్ధం చేసుకున్నారు, నాన్న కష్ట పడి జాబ్ చేస్తూనే చదివాడు అత్త కూడా ఇంటి దెగ్గర ట్యూషన్స్ చెప్తూ చాలా సాయంగా ఉండేది.

డబ్బులు లేకపోతే సొంత వాళ్లే దెగ్గరికి రానివ్వలేదు అన్న విషయం మా నాన్న తలలోకి బాగా ఎక్కేసింది, ఆ పట్టుదల తోనే కసిగా చదివి జాబ్ కొట్టాడు, ఫ్రెండ్స్ సాయంతొ రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు.

ఇప్పుడు మాకు చుట్టాలకి కొదవ లేదు అంతా సంతోషమె, అందరూ మా మాట వినేవాళ్ళే.

మా నాన్న గోవింద రాజు : చూడాల్సిన కష్టాలన్ని చూసేసాడు ఎంత పెద్ద ప్రాబ్లెమ్ వచ్చినా సునయసంగా నవ్వుతూ పరిష్కరించగలడు.

అమ్మ మంజుల : ఏమి తెలియదు మమ్మల్ని ప్రేమించడం తప్ప, కానీ నాన్న నేను తను చెప్పింది వినకపోతే మాత్రం భద్రకాళి అవతారం ఎత్తుతుంది.

ఇక అత్త సరిత : మంచిది కానీ తన మాటే నెగ్గాలంటుంది అయినా తను చూపించే ప్రేమలో అవేవి మనకి కనిపించవు, తనకి ఫారెన్ వెళ్లి చదువుకోవాలని అక్కడే సెటిల్ అవ్వాలని కోరిక కానీ అది తీరలేదు ఇప్పుడు డబ్బులున్నా వెళ్లే అవకాశం ఉన్నా అన్నని వదలలేక అలా ఉండిపోయింది

మావయ్య రవి చంద్ర : అత్త చెప్పినవాటికి తల ఊపుతూ ఉంటాడు. (అంతేగా అంతేగా టైపు)

అమ్మా నాన్నది పెద్దలు కుదిర్చిన వివాహమే, అమ్మకి ఏమి తెలియదని అమాయకురాలని మంచిదని నాన్నకి, అత్తకి త్వరగానే తెలిసింది. అందుకే నాన్నకి అత్తకి అమ్మ అంటే ప్రాణం, ఆ తరువాత అత్తయ్య రవి మావయ్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కానీ పెళ్ళికి ముందు నాన్న షరతు పెట్టాడు అది ఏంటంటే తనతో పాటే అత్తని మావయ్యని తనతోనే కలిసి ఉండాలని….దానికి అత్తయ్య మావయ్య సంతోషంగా ఒప్పుకున్నారు.

సంవత్సరానికి నేను పుట్టాను అమ్మ వాళ్ళ సంతోషాలకి అవధులు లేవు పుట్టడం పుట్టడమే మగ పిల్లాడిని పుట్టడంతొ ఇక చాలు అనుకున్నారు.

నేను పుట్టిన సంవత్సరానికి అదీ పుట్టింది, అత్త కూడా ఇక తన కూతురికి మొగుడ్ని నేనే అని కంఫర్మ్ చేసేసి మేము ఇద్దరం చాలనుకుని అమ్మా అత్త ఇద్దరు గర్భసంచి ఆపరేషన్ కూడా చేపించేసుకున్నారు.

నా పేరు ఆదిత్య
నా మరదలి పేరు అనురాధ.

పేరుకే అమ్మకి పుట్టాను కానీ పెరిగింది మొత్తం అత్త ఓళ్ళోనే , అత్తకి కూడా అను కంటే నేనంటేనే ఇష్టం.

అమ్మ పాల కంటే అత్తయ్య పాలే ఎక్కువ తాగి పెరిగాను, పాపం మా అమ్మ ఇక చేసేది లేక అనూతో సర్దుకునేది.

నాన్న మావయ్య ఇద్దరు కలిసి బిజినెస్ ని ఇంకా పెంచారు దానితో ఊర్లో మంచి పనులు చేసి పేరు కూడా సంపాదించారు.

నా పుట్టుక మొత్తం అను తోనే సరిపోయింది ఒకే సంవత్సరం తేడా అవ్వడం తొ నన్ను ఒక సంవత్సరం ఆపి మరి ఇద్దరినీ ఒకేసారి స్కూల్ లో జాయిన్ చేశారు.

కాకపోతే ఒక చిన్న సమస్య ఏది కొన్నా ఇద్దరం కలిసే ఆడుకోవాలని ఇద్దరికీ కలిపి ఒక్కటే కొనేవారు.

అక్కడే నాకు దానికి గొడవ జరిగేది ఇద్దరం ఒక్కదానితో సర్దుకోడం కష్టామయ్యేది నేను ఊరుకున్నా అను అస్సలు ఊరుకునేది కాదు , వాళ్ళకి అది సరదాగ ఉండేది కానీ మాకు ఇద్దరి మధ్యలో రోజు రోజుకి దూరం పెరుగుతూ వస్తుంది….అందరి ముందు నటించినా, మేమిద్దరం బానే మాట్లాడుకున్నా ఎక్కడో గ్యాప్ ఉంది మా ఇద్దరి మధ్యలో…

4 Comments

Comments are closed.