దానికి తోడు మేము నడుస్తూ తూలి కింద పడే వయసులో నా ఖర్మ కాలి దానికి లిప్ కిస్ పెట్టా దాన్ని ఎలా ఫోటో తీసారో లేక వీళ్ళే అలా నాతో ముద్దు పెట్టించి తీయించారో తెలీదు కానీ, ఆ ఫోటోని పెద్ద ఫ్రేమ్ కట్టించి పెట్టారు.
ఎప్పుడైనా మేము గొడవ చేస్తే అది చూపించి ఏడిపించేవారు సగం మా మధ్య దూరం పెరగటానికి ఆ ఫోటో కూడా ఒక కారణమే.
కానీ ఎక్కడో అది నన్ను ఎంత ఏడిపించినా, ఎంత అల్లరి చేసినా దాన్ని కోప్పడే ముందు నాకు చెవుల్లో “అది నీ పెళ్ళాం, అది నీ పెళ్ళాం” అని రీసౌండ్ వినిపించేది అలా ఎందుకు వినిపిస్తుంది అంటే మా అమ్మా అత్త ఇద్దరు కలిసి నాకు చెప్పడం వల్ల…ABCD నేర్పించాల్సిన వయసులో కూడా అనూ నీ పెళ్ళాం అని నేర్పించేవాళ్ళు, అందుకే దాన్ని ఏమైనా అందామంటే మనసు రాదు, నేనేమనట్లేదని అది ఇంకా రెచ్చిపోయ్యేది అయినా సహనంగానే ఉండేవాడిని అందుకే నేనంటే దానికి చులకన.
ఇక చిన్నప్పటి నుంచి మాకు పడదుగా అందుకే స్కూల్ లో కూడా మాకు పరిచయం లేనట్టే ఉండేవాళ్ళం, అమ్మ అత్తా నాన్న వాళ్ల ముందే మేము బావ మరదళ్ళం, ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు పరిచయస్తులం ఇక బైటికి వెళ్తే అదెవరో, నేనెవరో..
నా మీద ఇంక్ పొయ్యడం, ఐస్ క్యూబ్స్ నా షర్ట్ లో వెయ్యడం ఎన్ని చెయ్యాలో అన్నీ చేసేది అమ్మగారు, ఒక రోజు నేను డ్రాయింగ్ చేస్తుండగా కదిలించింది, వారం రోజులుగా ఒకటే పెయింటింగ్ ఇష్టంగా వేస్తున్నా, కోపంలో కొట్టబోయాను అది భయపడి కళ్ళు మూసుకుంది కానీ కొట్టలేకపోయాను, దాని మొహం అలాంటిది ప్రేమించడం తప్ప ద్వేషంచలేము.
మళ్ళీ SCC ఎగ్జామ్స్ అప్పుడు అనుకుంటా మొదటి సారి అను మీద కోపగించుకున్నాను, ఇద్దరికీ ఒకే సెంటర్ పడింది, ఎగ్జామ్ రాసి బైటికి వచ్చి అను కోసం, నాన్న వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను, ఎవరో అబ్బాయితొ మాట్లాడుతూ బైటికి వచ్చింది, నా కళ్ళలో కోపం చూసిందో ఏమో కావాలనే నవ్వుతూ తగులుకుంటూ మాట్లాడుతూ నన్ను చూస్తూ నడుస్తుంది, వెళ్ళేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి మరి వచ్చింది.
ఆదిత్య : ఎవడు వాడు?
అను : వాడు వీడెంటి సరిగ్గా మాట్లాడు, ఓహో అయ్యగారికి జెలసీ వచ్చిందా అయినా ఎవరైతే నీకెందుకు, నా ఇష్టం… కొంపదీసి అత్త వాళ్ళు అనేదానికి మనసులో నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశలు అయితే పెట్టుకోలేదు కదా..
ఆదిత్య : ఛీ… నీతోనా దానికంటే చావడం మేలు, అయినా ఎప్పుడు నన్ను ఏడిపిస్తావ్గా ఇంటికి పదా నీ సంగతి చెప్తా ఇవ్వాళ.
అను : ఏం చేస్తావ్?
ఆదిత్య : నువ్వు పదా నీకుంది ఇవ్వాళ..
ఇంతలో మావయ్య కార్ తీసుకుని వచ్చాడు, ఎక్కి ఇంటికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళగానే అత్తయ్య దెగ్గరికి వెళ్లి నేను చూసింది మొత్తం పూస గుచ్చినట్టు చెప్పాను…..ఆ తరువాతే తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేసానో, బెల్ట్ తీసుకుని అను ఒంటి మీద వాతలు పడేలా కొట్టింది నాకు బాధేసింది, అను నన్ను కోపంగా చూస్తూ ఏడ్చుకుంటూ అమ్మ దెగ్గరికి వెళ్ళిపోయింది….నేను అత్త ముందుకి వెళ్లాను, అత్త ఇంకా కోపంగానే ఉంది.
ఆదిత్య : సారీ అత్త, నా వల్లే ఇదంతా…
సరిత : నువ్వే తప్పు చెయ్యలేదు ఆదిత్య , ఇంకెప్పుడైనా అది ఇలాగ పిచ్చి పనులు చేసినా నాకు చెప్పాలి, అప్పుడే కదా అను తప్పు చెయ్యకుండా చెయ్యగలం.
నేను ఇంకేం మాట్లాడలేదు ఆ రాత్రి అను అన్నం తినలేదు, అత్తకి కోపం వచ్చి “ఇప్పుడు అది తినకపోతే కొంపలేం మునిగిపోవు” అంది.
నాకు రాత్రి నిద్ర పట్టలేదు, అర్ధ రాత్రికి ప్లేట్ లో అన్నం కూర వేసుకుని మా రూమ్ లో ఉన్న అను బెడ్ దెగ్గరికి వెళ్లి తనని లేపాను, నిద్రలో లేచి నన్ను చూసి కోపంగా “ఎందుకోచ్చావ్?” అంది, అన్నం ప్లేట్ తన పక్కన పెట్టాను.. “నాకేం అవసరం లేదు అని విసిరేసింది, ప్లేట్ గాల్లో ఎగిరి కింద పడి గుండ్రంగా తిరుగుతూ పెద్ద సౌండ్ చేసింది, అంతే అందరూ లేచారు, మా రూమ్ లో లైట్లు వెలిగాయి.

Intresting
Yes …….
Hi…
Hi…