అమ్మ వాళ్ళు నలుగురు మా రూమ్ కి వచ్చారు అంతే నాకు భయమేసి పక్కనే ఉన్న నా బెడ్ మీదకి దూకి రగ్గు కప్పుకుని పడుకున్నాను, చిన్నగా రగ్గు కొంచెం తెరిచి చూసాను అత్త అనూని కోపంగా చూసింది.. అంతే నేను కళ్ళు మూసుకున్నాను గట్టిగా… అమ్మ కింద పడిన ప్లేట్ అన్నం తీసుకుని బైటికి వెళ్ళిపోయింది అత్త కూడా లైట్ ఆఫ్ చేసింది అందరు వెళ్లిపోయారు, నేను ఇక లేవలేదు పడుకుండిపోయాను.
సరిత : చూసావా అన్నయ్య వాడికి అను అంటే ఎంత ప్రాణమో, అర్ధ రాత్రి లేచి మరి అన్నం పెట్టుకుని వెళ్ళాడు ఈ పిచ్చిదానికి అర్ధం కావట్లేదు..
వీళ్ళు కలిసిపోతే ఇద్దరినీ ఫారెన్ పంపించి చదివిద్దాం అక్కడే సెటిల్ అవుతారు, ఇద్దరి పెళ్లి కూడా అక్కడే చేద్దాం.
రాజు : అమ్మో నా చెల్లెలు పెద్ద ప్లాన్ వేసిందే…వాళ్లే తెలుసుకుంటారు లేరా పదా… అని తన చెల్లి నుదిటి మీద ముద్దు ఇచ్చి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
పొద్దునే లేచి చదవటం మొదలు పెట్టాను, ఎందుకంటే మాకు రోజు మర్చి రోజు ఎగ్జామ్స్… ఈ రోజంతా అస్సలు అనూ నన్ను చూడలేదు నేను కూడా దాని మొహం చూడకుండా ఉండలేకపోయాను అందుకే సరిగ్గా చదవలేదు.
తెల్లారి ఎగ్జామ్ ఏదో రాసాను అనిపించి బెల్ కొట్టగానే బైటికి వచ్చేసాను, అను మొన్న కనిపించిన అబ్బాయి తోటే మళ్ళీ నవ్వుతూ వచ్చింది, నేను చూస్తున్నాను అని తెలిసి వాడికి బాయ్ చెప్పి హగ్ చేసుకుని, బుగ్గ మీద ముద్దు ఇచ్చింది, నేను కళ్ళు ఆర్పకుండా తననే చూసాను, తను నన్ను ఇప్పుడేం చేస్తావ్ అన్నట్టు ఒక వెకిలి నవ్వు నవ్వుతూ నా ముందుకి వచ్చింది.
నా పక్కకి వచ్చి నిలబడింది పక్కకి జరిగాను, మళ్ళీ నవ్వుతూ నా పక్కకి వచ్చి నన్ను తొంగి చూసింది…పక్కనే ఉన్న వేప చెట్టు దెగ్గర గడ్డిలో కూర్చున్నాను, అను నా దెగ్గరికి వచ్చింది వెకిలి నవ్వుతో..
అను : ఏంటి ఇవ్వాళ ఏమనవా, కావాలంటే ఇంట్లో చెప్పుకో మహా అయితే ఇంకో రెండు దెబ్బలు ఏస్తారు అంతేగా..
ఆదిత్య : చూడు అనురాధ నీ జీవితం నీ ఇష్టం నువ్వెవరితొ అయినా తిరుగు నాకు అనవసరం, నాకు నీతో గొడవపడాలని లేదు కుదిరితే ఫ్రెండ్స్ లా ఉందాం..
ఈలోగా కార్ వచ్చింది, డోర్ తీసి ఎక్కి కూర్చున్నాను ఇవ్వాళ నాన్నే వచ్చాడు.. అను కూడా ఎక్కింది ఇద్దరం సైలెంట్ గా ఉండటం చూసి “ఏమైంది?” అన్నాడు.
ఆదిత్య : ఎందుకు నాన్నా రోజు మీరో మావయ్యో రావడం మీ ఆఫీస్ లో ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు ఎవరో ఒకరిని పంపించొచ్చు కదా?
నాన్న : అలాగా, సరే నీ సలహా నాకు ఇచ్చావ్ గా అలాగే మావయ్యకి కూడా ఇవ్వు.
ఆదిత్య : అలా కాదు మీకు అంత కష్టం ఎందుకని.
నాన్న : అది అంతే బైట పనులు మాకు ఎన్ని ఉన్నా ఇంట్లో పనులు మనమె చేసుకోవాలి.. రేపు ఒక వేళ మేమిద్దరం బిజీ అవుతే నువ్వే చూసుకోవాలి అంతే కానీ పనోళ్ళకి చెప్తా అంటే కుదరదు.
ఆదిత్య : అలాగేలే నాన్నా ఇక పోనీ.
ఆల్రెడీ ఎగ్జామ్ రాసి అలిసిపోయిన నేను తినేసి ఏం మాట్లాడకుండా నా రూమ్కెళ్ళి పడుకున్నాను…
000000
ఇంట్లోకి రాగానే మంజుల మంచినీళ్లు అందించింది, సరిత కూడా వచ్చి సోఫాలో వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చుంది.
రాజు : వాడు ఎందుకో కోపంగా ఉన్నాడు.
మంజుల : నాకేం అలా అనిపించలేదే..
సరిత : ఎందుకు, ఏమైంది?
రాజు : ఏమో వాడి మనసులో ఏముందో వాడు ఎప్పుడైనా చెప్పాడా… మనమూ కనుక్కోలేం.. ఏదో జరిగింది మొత్తానికి.. అనూకి తెలుసేమో.
సరిత : అనూ…అనూ…
అను : గోళ్లు తీసుకుంటున్న అనూ నెయిల్ కట్టర్ తొ వచ్చి “ఏంటి మా?”
సరిత : మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా?
అను : లేదే..
సరిత : ఏం లేదు ఆదిత్య కోపంగా ఉంటేనూ…
అను : నీతో ఏం చెప్పలేదా??
సరిత : ఏంటి.. ఏమైంది మళ్ళీ ?
అను : అది కాదు.. అన్నీ నీతో చెప్పుకుంటాడు కదా, దీని గురించి ఏం చెప్పలేదా?
సరిత : లేదు..సరే నువెళ్ళు..
రాజు : వాడే సెట్ అవుతాడు లే, వదిలేయ్.

Intresting
Yes …….
Hi…
Hi…