ఆది – Part 1 691

0000000

అనూ వచ్చి నా బెడ్ పక్కన ఉన్న తన బెడ్ మీద కూర్చుంది..

అను : ఏంటి మా అమ్మకి చెప్పి నన్ను కొట్టించవా?

నేనేం మాట్లాడలేదు అటు తిరిగి పడుకున్నాను, అను కూడా అక్కడ నుండి వెళ్ళిపోయింది.

రాత్రి తినడానికి అందరం కూర్చున్నాం నేను సైలెంట్ గా తినడం చూసి…

సరిత : ఏంట్రా ఆది ఒంట్లో బాలేదా అలా ఉన్నావ్?

ఆదిత్య : లేదత్తా బానే ఉన్నాను.. కొంచెం తలనొప్పిగా ఉందంతే..

సరిత : తిన్నాక టాబ్లెట్ ఇస్తాను వేసుకుని పడుకో..

ఆదిత్య : అలాగే..

అమ్మ అందరికి గాజు గ్లాసుల్లో థంసప్ పోసింది, తినేసి తాగుతూ ఉంటే…నాన్న పిలిచారు..

రాజు : ఆది నెక్స్ట్ ఏ కాలేజీ చూసుకున్నారు ఏమైనా ప్లాన్ చేశారా, ఇద్దరు ఒకే గ్రూప్ తీసుకోండి..

సరిత : అదేంటి అన్నయ్య మళ్ళీ మొదటికొచ్చావ్ ఆల్రెడీ అనుకున్నాంగా ఇద్దరు డాక్టర్స్ అవ్వాలని.. ఇంకేం గ్రూప్ bi.pc తీస్కుంటారు అంతేగా.. అని నన్ను అనూని చూసింది… అను తల ఊపింది.

ఆదిత్య : లేదు నేను mpc తీసుకుందామనుకుంటున్నా నాకు అదే ఇష్టం.

అమ్మ : ఏంటి?

సరిత : అదేంట్రా మొన్నటిదాకా డాక్టర్ అవుతా అన్నావ్ ఇప్పుడేంటి అలా అంటావ్, అనూ కంటే నీకే ఎక్కువ మార్కులు వస్తాయి అలాంటిది నువ్వు ఇంజనీరింగ్ కి వెళ్తావా వద్దు.

మంజుల(అమ్మ) : అలా కాదు ఇద్దరు ఒకటే చదవాలి.. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తామంటే కుదరదు.

రాజు : మంజులా ఊరుకో… ఆదిత్య నాకూ ఇష్టం లేదు ఒకసారి మళ్ళీ ఆలోచించు, ఆవేశంలో నిర్ణయించుకున్నట్టున్నావ్.

రవి (మావయ్య ) : ఏమైంది ఆదిత్య?

వీళ్లందరి మాటలు వింటుంటే నాకు కోపం వస్తుంది, ఏమైందో నాకు తెలీలేదు కానీ నా చేతిలో ఉన్న గాజు గ్లాస్ పగిలి నా చేతిలోనుంచి రక్తం కారుతుంది. ఒక్కసారిగా నా కోపం మొత్తం ఎగిరిపోయింది ఏదో మాములు గాజు గ్లాస్ పగిలింది అంటే మాములే అనుకోవచ్చు కానీ అంత మందం ఉన్న గ్లాస్ కింద పడినా పగలదు అలాంటిది ఇలా అయ్యేసరికి నాకూ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది…

వెంటనే అమ్మా నాన్న అత్తయ్య ముగ్గురు లేచి నాదెగ్గరికి వచ్చారు అమ్మ బాండేజ్ తెచ్చింది, అత్తయ్య ఏడుస్తూ కట్టు కడుతుంది..

సరిత : నీకేది ఇష్టమైతే అదే చెయ్యి అంతేగాని ఇలాంటి పిచ్చి పనులు చేసి మమ్మల్ని బాధ పెట్టొద్దు అని కోపంగా చెప్పి నుదిటి మీద ముద్దు ఇచ్చింది.

నేను లేచి లోపలికి వెళ్లి కూర్చున్నాను అనూ వచ్చి నా ఎదురుగా వచ్చి కూర్చుంది, ఏదో మాట్లాడబోయింది కానీ నేను వినదలుచుకోలేదు వెంటనే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫుల్ సౌండ్ పెట్టుకున్నాను.

అలా పాటలు వింటూ నిద్ర పోయాను… పొద్దున లేచి చూసేసరికి నా బెడ్ మీద నా పక్కనే ఒక చేతిలో తన మొహాన్నీ పెట్టుకుని..కాళ్ళు కింద నేల మీద పెట్టి అలానే పడుకుని ఉంది..

నాకూ ఒక్కసారి అనుమానం వచ్చింది నేను ఎవ్వరికీ తెలీకుండా అనూని ప్రేమిస్తున్నట్టే తను కూడా అలా చేస్తుందేమో అని దీనికి అంత సీన్ లేదులే అనుకుని నా చెయ్యిని అనూ తల కింద నుంచి తీసి లేచి ఫ్రెష్ అయ్యాను..

4 Comments

Comments are closed.