అను : బావా..
ఆదిత్య : ఏంటే ఇది కొత్తగా?
అను : చాలా బాగుంది నిన్ను అలా పిలుస్తుంటే, నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను బావ అని పిలుస్తుంటే..
ఆదిత్య : అలాగే పిలువులే నాకూ బాగుంది ఈ కొత్త పిలుపు, కానీ మనం ఇద్దరం ఉన్నప్పుడు మాత్రమే..
అనూ : ఎందుకలా మనం ఇద్దరం కలిసిపోయాం అని తెలిస్తే అమ్మ వాళ్లు ఎంత సంతోష పడతారు..
ఆదిత్య : ముందు సంతోష పడతారు ఆ తరువాత మనల్ని దూరం చెయ్యటానికి విశ్వ ప్రయత్నలు చేస్తారు..
అను : ఎందుకలా?
ఆదిత్య : నేను చెప్పింది చెయ్యి, అందరి ముందు బైట మనం ఇంతకముందు ఎలా దూరంగా ఉండేవాళ్ళమో అలానే ఉందాం, అలా కాకుండా ఇద్దరం కలిసిపోయాం అని ఎవరికైనా తెలిసిందనుకో మనకి ఇలా ప్రైవసీ దొరకదు..నిన్ను ఇలా ముద్దు పెట్టుకోవడం కూడా కుదరదు (అని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను) మనం ఇద్దరం పక్క పక్కన కూర్చుంటే ఎవరో ఒకరు మనకి కాపలాగా కూర్చుంటారు..
అను : (నా బుగ్గ మీద ముద్దు ఇస్తూ) అర్ధమైంది… నీకెన్ని తెలివితేటలు బావా.. సూపర్ నువ్వు…
బావా మరీ….
ఇంతలో ఏదో జీప్ సౌండ్ అయ్యింది, ఎవరో అరుస్తున్నారు మెలుకువ వచ్చి లేచాను.. అది పక్కనే ఉన్న సంధ్య ఫౌండేషన్ నుంచి, టైం చూసుకున్నాను అర్ధరాత్రి రెండు అవుతుంది…టేబుల్ మీద ఉన్న బాటిల్ లో ఆఖరి మందు తాగేసి (ఇదే లాస్ట్ అనుకుని) బాటిల్ డస్ట్ బిన్ లో వేసి బార్ వెనుక డోర్ తీసి బైటికి వెళ్లాను……
బైటికి వచ్చి చూస్తే ముందు ఒక జీప్ ఆగి ఉంది, దాని వెనకాలే ఒక dcm సంధ్యా ఫౌండేషన్ ఇంటి నుంచి ఒక ఇరవై మంది ఆడపిల్లల్ని dcm లోకి ఎక్కిస్తున్నారు, నాకు తెలిసి ఒక పది పదిహేను మంది చిన్న పిల్లలు మాత్రమే ఉండాలి కానీ ఇంత మంది ఆడపిల్లలు ఎక్కడ నుంచి వచ్చారు… వాళ్ల దెగ్గరికి వెళ్లాను..
ఆదిత్య : రేయ్ ఎవడ్రా అక్కడా ఈ టైంలో, ఇక్కడ ఏం పని?
“ఎవడ్రా నువ్వు పారిపో లేకపోతే ప్రాణాలు పోతాయి”
“అన్నా వాడో తాగుబోతోడు అన్నా వాడితో ఎందుకు వదిలేయ్ వాడి దారిన వాడే పోతాడు”
ఆదిత్య : ఎవడ్రా తాగుబోతు నేను మందు మానేసి ఐదు నిముషాలు అవుతుంది..
“రేయ్ పోరా..” అని వెనక్కి నెట్టాడు “పోరా, ఒక్కసారి చెప్తే అర్ధం కాదా ” అంతే నెక్స్ట్ సెకండ్ లో గాల్లో ఎగురుతూ వెళ్లి జీప్ లో పడ్డాడు…
వాడి వెనక ఒక్కొక్కరు అలా నలుగురి కాళ్ళు చేతులు విరిచేసాను చివరిగా ఇద్దరు మిగిలారు చిన్న వాళ్ళు, భయంగానే నా ముందుకి వచ్చారు చూస్తే రౌడీలలా లేరు అందుకే చిన్నగా తన్నాను ఇంకొకడు “తమ్ముడు” అంటూ నా మీదకి వాడికి దొరికిన సగం పగిలిన బాటిల్ తీసుకుని నా మీదకి వచ్చాడు కోపంగా… వాడిని తన్నగానే వాడి చేతిలో ఉన్న బాటిల్ నా చేతికి వచ్చింది వెంటనే వాడి మీదకి విసిరేసాను అంతే వాడు లేవలేదు..

Intresting
Yes …….
Hi…
Hi…