ఆది – Part 1

అందరు పడిపోయారు dcm లోకి ఎక్కించిన అందరిని కిందకి దించి లోపలికి తీసుకొచ్చాను అందరూ థాంక్స్ అన్నా అని ఏడుస్తుంటే చిన్నగా తాగిన మత్తు వదులుతుంది… అనాధ ఆశ్రమం నడిపే ముసలావిడని అడిగితే రెండు రోజుల ముందు వీళ్ళని ఇక్కడికి బలవంతంగా తీకొచ్చారు ఇప్పుడు తీసుకెళ్తున్నారని అందుకే రోజు నలుగురు చెక్ చెయ్యడానికి వస్తున్నారని చెప్పింది.

కింద పడిన ఒకడిని లేపి “ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళని, ఎవరున్నారు దీని వెనక?” అని అడిగాను.. దానికి వాడు భయపడుతూ “మాకేం తెలీదు వీళ్ళని ఈ పదిహేనో తారీకు లంబసింగికి వెళ్లే దారిలో కాలువ దెగ్గర డెలివరీ చెయ్యమని ఆర్డర్ వచ్చింది, మాకు అంతే తెలుసు, నన్ను వదిలేయ్ లేకపోతే మమ్మల్ని ఆ మల్లేష్ చంపేస్తాడు “.

ఆదిత్య : వెళ్లిపోండి…మీరు మళ్ళీ ఈ ఊర్లో కనిపిస్తే మీ ప్రాణాలు అయితే నేను లేకపోతే ఆ మల్లేష్ ఎవరో ఒకరం తీసేస్తాం.

వెంటనే బార్ ఓనర్ అన్నకి ఫోన్ చేసాను రమ్మని, ఆడపిల్లలందరిని బార్ లోపలికి పంపించాను ఇక ముసలావిడకి మల్లేష్ వస్తే ఏం చెప్పాలో చెప్పి బార్ లోపలికి వెళ్తుండగా ఇందాక నేను కొట్టిన వాళ్లలో చివరిగా వచ్చిన వాడి తమ్ముడు అన్నా అన్నా అని ఏడుస్తున్నాడు…

వాడి దెగ్గరికి వెళ్లాను “చూడటానికి బాగున్నారు ఎందుకు ఈ పనులు చూడు ఇప్పుడు మీ అన్న బతకడు గాజు పెంకు గుండెల్లో దిగింది.”

“కాలేజీ ఫీజుకి డబ్బులు లేవన్నా అందుకే ఇష్టం లేకపోయినా వచ్చాం ఇలా అవుతుందని అనుకోలేదు” అని ఏడవటం మొదలు పెట్టాడు.

వాడి మాటలు వినగానే నాకు మత్తు పూర్తిగా ఎగిరింది, వాడి చేతులు పట్టుకుని “కాళ్ళు పట్టు” అన్నాను, ఇద్దరం ఎత్తి బార్ లోకి తీసుకొచ్చి టేబుల్ మీద పడుకోపెట్టి ఒక పేపర్ మీద రాసిచ్చి “పక్కనే rmp హాస్పిటల్ ఉంటుంది వెళ్లి ఏమర్జెన్సీ అని చెప్పి ఇవి పట్టుకురా పో”..

“అన్నా హాస్పిటల్ కి తీసుకెళదామా?”

ఆదిత్య : వాళ్లు చిన్న డాక్టర్లు ఈ కండిషన్ ని హేండిల్ చెయ్యలేరు.. చెప్పింది చెయ్యరా…
పక్కనే ఉన్న అమ్మాయిని చూసి లైట్స్ మొత్తం వెయ్యమని చెప్పాను…

అంతలో వాళ్ల అన్న గిల గిల కొట్టుకోవడం చూసి వెంటనే పరిగెత్తాడు..అక్కడున్న ఆడపిల్లలంతా వాడినే చూస్తున్నారు ఏమవుద్దా అని….నేను వాడి షర్ట్ చించేసాను గాజు ముక్క గుండెకి పక్కన దిగింది. అదృష్టవంతుడు బతుకుతాడు… నా రెండు వేళ్ళతో గాజు ముక్కకి ఆటో వేలు ఇటో వేలు వేసి గట్టిగా ఒత్తి పట్టాను.. ఇప్పుడు గిలగిలా కొట్టుకోవడం ఆపేసి వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు…

ఈలోగా రాసిచ్చిన సామానుతొ వాళ్ళ తమ్ముడు తిరిగి వచ్చాడు… అక్కడున్న ఆడపిల్లల్ని చూస్తూ “మీలో ఎవరైనా మెడికల్ స్టూడెంట్ ఉన్నారా” అనగానే ఒక అమ్మాయి ముందుకి వచ్చింది… మిగతా వారిని చూసి “మీరంతా బెంగుళూరు వాళ్లే అయితే ఎవరింటికి వాళ్లు వెళ్లిపోవచ్చు ఒకవేళ వెళ్ళలేకపోతే…. నీ పేరేంటి?”……”రాము అన్న “… “రాముకి మీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవ్వండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు” అని రాముని చూసాను… రాము నన్ను చూసి ఆ పని మీద పడ్డాడు…

ముందుకి వచ్చిన అమ్మాయిని చూసి “తన గుండెని నేను పట్టుకున్నట్టె ఇలానే గట్టిగా పట్టుకో” అని చెప్పాను… ఈ లోగా నేను వెళ్లి చేతికి సర్జికల్ గ్లోవ్స్ తోడిగి తనకి ఇంజక్షన్ చేసి…scalpel తీసుకుని గుండెకి చాతికి మధ్యలో కోశాను.. రక్తం బైటికి చిల్లుతుంది ఏం కనిపించట్లేదు కళ్ళు మూసుకుని నా రెండు వెళ్ళు లోపలికి దూర్చాను వెతకగా గాజు ముక్క తగిలింది పట్టుకుని బైటికి లాగేసాను.. వేలు పెట్టి అదిమాను రక్తం కారడం ఆగిపోయింది.. కాటన్ తొ మొత్తం తుడిచాను కానీ వేలు తీస్తే రక్తం చిల్లుతుంది.. అలానే లోపల కట్ అయిన దెగ్గర కుట్లు వేసేసాను వేగంగా… రక్తం కారడం ఆగిపోయింది కాటన్ తీసుకుని అప్పటి వరకు కారిన రక్తం మొత్తం తుడిచేసి పై కుట్లు వేసాను… ఆతరువాత చర్మం పైనా కుట్లు వేసాను… వెంటనే ఒక సెలైన్ ఎక్కించి అంబులెన్సుకి ఫోన్ చేసాను…

4 Comments

Comments are closed.