ఆది – Part 1 691

ఆదిత్య : రాము ఇంకేం భయం లేదు, ఇక్కడనుంచి యాభై కిలోమీటర్ల దూరంలో కొత్తగా ఫ్రీ సర్జరీ క్యాంపు పడింది అడ్రస్ డ్రైవర్ కి చెప్పాను వెళ్ళు… అలాగే నీకు ఫోనెపే ఉందా.. నెంబర్ చెప్పు…. కాలేజీ ఫీజు ఎంత కట్టాలి..

రాము : యాభై వేలు…

ట్రాన్స్ఫర్ చేసాను రాము చేతులు ఎత్తి దణ్ణం పెట్టాడు వద్దని వారించి “ఇది నా నెంబర్ మళ్ళీ మీ అన్నకి సంబంధించిన డౌట్స్ ఉంటే ఫోన్ చెయ్”.

బార్ ఓనర్ అన్నని చూసి “అన్నా నేను ఇక్కడనుంచి వెళ్ళిపోతున్నాను మల్లేష్ వచ్చి ఎంక్వయిరీ చేస్తే ఏం తెలియనట్టే ఉండు నా గురించి అడిగితే తాగుబోతోడు ఎక్కడుంటాడో తెలీదు అని చెప్పు” అని ఇక మిగిలిన ఒక్క అమ్మాయి వైపు చూసాను..

ఆదిత్య : నీ పేరు..మీ ఇల్లు ఎక్కడా..

రజిని : ఇక్కడే అన్నయ్య.

ఆదిత్య : పదా డ్రాప్ చేస్తాను.. అని పక్కనే ఉన్న మందు బాటిల్ తీసుకుని కాళీ చేసేసాను..

రజిని భయపడుతూ చూసింది…

ఆదిత్య : భయపడకు… ఇదే నా ఆఖరి మందు బాటిల్ అందుకే మొత్తం తాగాను.. ఇవ్వాల్టి తొ మందు మానేసాను..

రజిని ని తీసుకుని నా బండి తీసాను చాలా రోజులైంది బుజ్జిముండని ముట్టుకుని చాలా ఇష్టంగా కొనుక్కున్నను నింజా zx 1000cc… తీసి స్టార్ట్ చేసాను దీని సౌండ్ విని కూడా చాలా రోజులైంది…

రజిని ని ఎక్కించుకుని వాళ్ల ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ రోడ్ మీదకి వచ్చాను… అప్పటికే తెల్లారింది.. టిఫిన్ చేసి ఆలోచించాను ఇలా ఎన్ని రోజులు తాగుతూ తిరుగుతూ ఉంటాను ఇప్పుడు ఎలాగో కాళీయే కనీసం ఆ ఆడపిల్లల్ని అయినా రక్షిద్దామని నిర్ణయించుకొని…బండిలో ఫుల్ ట్యాంక్ కొట్టించి…స్టార్ట్ అయ్యాను బెంగుళూరు to లంబసింగి…

…………………………………………………………..

అను : బావా మరి mpc లో జాయిన్ అవుతాను అన్నావ్.. నీకు డాక్టర్ అవ్వటం అంటే ఇష్టం కదా?

ఆదిత్య : అవును అను, నాకు డాక్టర్ అవ్వటం ఇష్టం కానీ ఇలా సర్టిఫికెట్స్ తొ కాదు వేరేలా..

అను : వేరేలా అంటే?

ఆదిత్య : నాకు తెలీదు.. అయినా నువ్వు డాక్టర్ అవుతావ్ గా మళ్ళీ నేనెందుకు?

అను : అయితే నేనూ mpc తీసుకుంటా..

ఆదిత్య : సరే నేనే bipc తీసుకుంటా లే..

అను : ఇప్పుడు దారికొచ్చావ్.. (అని ముద్దు పెట్టింది)

అను : బావా… మళ్ళీ ఒక సారి కిస్ చెయ్యవా?

ఆదిత్య : బాగుందా..

అను : అవును నీ ఎంగిలి వెచ్చగా ఉంది..

4 Comments

Comments are closed.