ఇక డైలీ కాలేజ్ కి వెళ్తూ బాగా చదివేవాడిని. కొంచెం క్లోజ్ అయ్యారు క్లాస్ లో అంతా. ఇక న్యూ ఇయర్ వచ్చింది. అక్కడ ప్రతి క్లాస్ లో కేక్ కట్ చేస్తారు అంట. క్లాస్ లోని వాళ్ళు అంతా మనీ కలెక్ట్ చేసి సెలబ్రేషన్ చేస్తారు అని చెప్పారు. మా క్లాస్ లో ఒకడు బాగా రిచ్ వాడు అమ్మాయిల ముందు ఓవర్ యాక్షన్ చేసి నేనే తెస్తాను అని వాడే తెచ్చాడు అన్ని. 31st సాయంత్రం క్లాసెస్ అయిపోయాక ఒక్కో క్లాస్ కి ఒక్కో సార్ వెళ్లి కట్ చేస్తారు. మాది కో – ఎడ్యుకేషన్ అందుకే ప్రిన్సిపాల్ వచ్చాడు. కేక్ కట్ చేసి మీరు తినండి అని వెళ్ళిపోయాడు. అందరూ గ్రీటింగ్ కార్డ్స్ చాక్లెట్స్ ఎక్సేంజ్ చేసుకుంటున్నారు. నాకు తెలియదు. మా బెంచ్ లో ఉండే వాళ్ళు కొన్ని చాక్ లెట్స్ అండ్ కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చారు. నేను నాకు ఇచినవి వేరే వాళ్ళకి ఇచ్చి మేనేజ్ చేశాను. భవ్య కేక్ అందరికీ ఇచ్చింది. మౌనిక తన కేక్ నాకు ఇచ్చింది అపుడు అంతా బిజీగా ఉన్న టైమ్ లో. నేను వద్దు అన్నాను. తను తీసుకో అని ఇచ్చింది. గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఇది ఎవరికీ ఇవ్వకు అంది. సరే అన్నాను. నేను ఇంటికి వెళ్లి పడుకున్న. రాత్రి జాహ్నవి ఫోన్ చేసింది ఎగ్జాక్ట్ 12 కి. విష్ చేసింది. నేను పొద్దున వరకు మాట్లాడాను. మాట్లాడుతూ ఉండగా నాకు మౌనిక ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ కనిపించింది. తీసి చూసాను. అందులో నంబర్ రాసి కాల్ మీ అని ఉంది. జాహ్నవి కి బై చెప్పి అందులో ఉన్న నంబర్ కి కాల్ చేశాను. వాళ్ల అమ్మ ఫోన్ ఎత్తింది. ఎవరు అంది. మాట్లాడకుండా ఉంటే డౌట్ వస్తుంది అని మౌనిక ఫ్రెండ్ ని విష్ చేద్దాం అని చేశాను అని చెప్పాను. ఆమె సరే ఫోన్ ఇస్తా అని మౌనిక కి ఫోన్ ఇచ్చింది. విష్ చేశాను తను థాంక్స్ చెప్పి విష్ యూ ద సేమ్ అంది. కట్ చేసింది. 20 నిమిషాలకి మెసేజ్ వచ్చింది. ఇప్పుడా విష్ చేసేది అంది. పడుకున్న సారీ అన్నాను. రాత్రి నుంచి ఎదురు చూస్తున్న అంది. సారీ సారీ అని చెప్పాను. తను సరే పొద్దున్న 10కి దుర్గమ్మ టెంపుల్ కి వెళ్దాము వస్తావా అంది. ఎవరెవరు వస్తారు అన్నాను. క్లాస్ అంతా అంది. అవునా నాకు ఎవరూ చెప్పలేదు అన్నాను. ఇపుడు చెప్తున్న కదా అంది. సరే వస్తా అని చెప్పను. మరిచిపోకూడదు 10కి అంది. సరే అన్నాను.
పొద్దున్న రెడీ అయ్యి భవ్య వస్తుంది కదా అని ఫోన్ చేశాను. విష్ చేశాను. ఇప్పుడా చేసేది అంది. పడుకున్న అన్నాను. ఆహా మరి రాత్రి అంతా ఫోన్ ఫుల్ బిజీ వచ్చింది అంది. సిగ్నల్ వచ్చి ఉండక అలా వచ్చి ఉంటది లే అన్నాను. నాకు తెలుసు లే మౌనిక తో మాట్లాడవు అంది. లేదు అన్నాను. నాకు తెలుసు తను నీకు కేక్ ఇవ్వడం గ్రీటింగ్ కార్డ్ లో నంబర్ రాసి ఇవ్వడం చూసాను అంది. నీకు చెప్పిందా అన్నాను. లేదు అంది. మరి నీకు ఎలా తెలుసు అన్నాను. దసరా సెలవులు అయ్యాక తను నీకు బాక్స్ ఇచ్చి తను ఏమి తినకుండా ఉన్నప్పుడే డౌట్ వచ్చింది నాకు అంది. అవునా అన్నాను. అవును అంది. అది వదిలేయ్ గుడికి వస్తున్నవా అన్నాను. ఏం గుడి అంది. నీకు తెలీదా మన క్లాస్ వాళ్ళు అంతా కలుస్తున్నాము గుడిలో అన్నాను. ఎవరు చెప్పారు నీకు అంది. మౌనిక అన్నాను. తను నువ్వు రావేమో అని అలా చెప్పి ఉంటది లే, వెళ్లి ఎంజాయ్ చేసి రా అంది. అయితే ఎవరికి చెప్పకు అన్నాను. నేను ఎందుకు చెప్తాను నువ్వు నా బ్రదర్ అంది. థాంక్స్ సిస్టర్ అన్నాను. తను నాతో మంచి వైట్ కలర్ డ్రెస్ ఉంటే వేసుకో నువ్వు బాగుంటావు వైట్ డ్రెస్ లో. బ్లూ లేదా బ్లాక్ జీన్స్ వేసుకో . బైక్ తీసుకెళ్ళు ఓక గిఫ్ట్ ఇవ్వు అండ్ చాక్లెట్ మరిచిపోకు అంది. డబ్బులు లెవెమో కదా నేను వస్తా 5 నిమిషాల లో నువ్వు బయటకి రా అంది. సరే అని డ్రెస్ మార్చుకుని బయటకి వచ్చాను. అపుడే జాహ్నవి ఫోన్ చేసింది. మధ్యాహ్నం లంచ్ కి కలుద్దమా లేక సాయంత్రం కలుద్దమా అంది. మధ్యాహ్నం లెట్ అయితే కష్టం అనుకుని సాయంత్రం కలుద్దాం అని చెప్పాను. 5 నిముషాల కి భవ్య వచ్చి, ఒక వాచ్ నా చేతికి పెట్టింది. 1000rs డబ్బులు ఇచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది. విత్ లవ్ అని నా పేరు రాయించింది. ఎందుకు ఇవన్నీ అన్నాను. భవ్య బ్రదర్ అంటే తగ్గకూడదు అని చెప్పింది. బైక్ కావాలా అంది. మా బాబాయ్ ది ఉంది అన్నాను. తను సూపర్ గా ఉన్నావు అసలు అంది. థాంక్స్ అన్నాను. సరే ఆల్ ది బెస్ట్ చెప్పి వేళ్ళు అంది. నేను గుడికి వెళ్ళాను.
నేను వెళ్ళిన 1 నిమిషానికి నాకు ఫోన్ చేసింది. ఎక్కడ ఉన్నావు అంది. పార్కింగ్ దగ్గర అన్నాను. వస్తున్న అక్కడే ఉండు అంది. సరే అన్నాను. తను వచ్చి లుకింగ్ హండ్సం అంది. థాంక్స్ నువ్వు కూడా చాలా అందం గా ఉన్నావు అన్నాను. తను మంచి డిజైన్ ఉన్న చుడీదార్ వేసుకుని వచ్చింది. చాలా ట్రెడిషనల్ గా ఉంది డ్రెస్. క్యూట్ గా ఉంది తను ఆ డ్రెస్ లో. నేను చాలా క్యూట్ ఉన్నావు అన్నాను. అసలు మాట్లాడవు అనుకున్న బాగా మాట్లాడుతావు అంది. అదేమీ లేదు జస్ట్ చెప్పాను అన్నాను. చాక్లెట్ తీసి తనకి ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అన్నాను. తను థాంక్స్ చెప్పింది. పద వెళ్దాము అంది. మన క్లాస్ వాళ్ళు అంతా రానివ్వు అన్నాను. నువ్వు ఒక ట్యూబ్ లైట్ అంది. నువ్వే కదా చెప్పావు పొద్దున్న అన్నాను. ఇపుడు వాళ్ళు రాకుంటే రావా అంది. అలా ఏమి లేదు లే అని వెళ్ళాను. కింద నుంచి కొండ పైకి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇద్దరం సైలెంట్ గా ఉన్నాము. ఎప్పుడూ అంత క్లోజ్ గా మాట్లాడలేదు తనతో. కొద్ది సేపటికి సైలెన్స్ బ్రేక్ చేయాలి అని తిన్నావా అని అడిగాను. తను ఏమి అడిగావు అసలు నువ్వు సూపర్ అంది. నువ్వు ఏది మాట్లాడటం లేదు అని ఏదో ఒకటి అడిగాను అన్నాను. తను నవ్వుతూ ఇంత అమాయకంగా ఎలా ఉన్నావు అంది. ఏదో అలా అన్నాను. అలా తను నా గురించి అడుగుతూ ఉంది. నేను చెప్తూ ఉన్నాను. తను క్లాస్ విషయాలు అండ్ క్లాస్ లో ఉన్న లవ్ స్టోరీస్ చెప్పింది. న్యూ ఇయర్ అవ్వడం తో ఫుల్ రష్ గా ఉంది గుడి. మా దర్శనం అయ్యే సరికి మధ్యాహ్నం అయింది. తను బొట్టు పెట్టుకుని నాకు పెట్టింది. తను నన్ను అద్దం లో చూపిస్తూ చూడు బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావో అంది. తను ఆ రెండు గంటలలో చాలా క్లోజ్ అయింది. నేను టెంకాయలు పట్టుకుని ఉంటే ప్రసాదం తినిపించింది. నాకు సడెన్ గా సరయూ గుర్తు వచ్చింది. ఇక కిందకి వస్తుంటే తను నా భుజం ని తన చేతులతో పట్టుకుని నడుస్తూ వస్తుంది. నీకు ఒకటి చెప్పాలి అంది. చెప్పు అన్నాను. మన క్లాస్ లో బయట నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు కానీ నాకు ఎందుకో నువ్వు నచ్చావు అంది. ఎందుకు అన్నాను. నీలో ఉండే ఇన్నోసెన్స్, నీ నవ్వు, నీతో మొదట్లో ఎవరూ మాట్లాడకపోయినా నువ్వు నీ పని చూసుకుంటూ ఉండడం. నీ ధైర్యం అండ్ నువ్వు బాగా చదువుతావు, ఓవర్ యాక్షన్ చేయవు, అన్నిటి కంటే ఎక్కువగా నీ మొహం ఎంత ప్రశాంతం గా ఉంటది అలా చూస్తూ ఉండచ్చు అంది. అసలు మనకు మధ్య ఎలాంటి కన్వర్జేషన్ లేదు అలా ఎలా అనుకుంటావు అన్నాను. కన్వర్జేషన్ అవసరం ఏమీ ఉంది. ఒక డే లో ఎక్కువ టైమ్ college లోనే ఉంటాము తెలీదా నాకు అంది. నన్ను ఎవరూ ఎపుడూ ఇంతగా పొగడలేదు. నాకు కూడా కాలేజ్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపించింది. తను నీ ఆన్సర్ ఏంటి అంది. అపుడే నేను గిఫ్ట్ తీసి తనకి ఇచ్చాను. గిఫ్ట్ మీద విత్ లవ్ అని ఉండటం తో తను ఫిక్స్ అయింది నాకు కూడా తాను అంటే ఇష్టమే అని.