హ్యాండ్ రైటింగ్ తేడా ఉంటది కదా అన్నాను. నువ్వు కూడా నా లాగే రాస్తవు కదా అంది. అయ్యో సారీ అని చెపాను. తను ఏమి మాట్లాడలేదు. ఇక సుల్తానా నేను ఏమి అడిగిన ఇచ్చేది కాదు. ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వచ్చాయి. అయిపోయాక సెలవులు 15 రోజులు ఇచ్చారు. నేను మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కొంచెం పని ఉంటే. అపుడే ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాను. మా క్లాస్ లో అందరికి రిక్వెస్ట్ పెడుతూ సుల్తానా కి కూడా పెట్టాను. తను ఆక్సెప్ట్ చేసిన మెసేజెస్ కి రిప్లై ఇచేది కాదు. కానీ ఒక రోజు తన బర్త్ డే సో మెసేజ్ చేశా. థాంక్స్ అని రిప్లై ఇచ్చింది. నేను అడిగాను ఎందుకు అంత కోపం నేకు నేను అంటే అని. కోపం ఏమి కాదు నీతో మాట్లాడితే మనం లవర్స్ అనుకుంటూ ఉన్నారు అంతా అంది. అసలు ఎపుడు మాట్లాడవు నాతో అన్నాను. అవును కానీ మన క్లాస్ లో చాలా మంది అడిగారు అందుకే నిన్ను ఇగ్నోర్ చేస్తున్న అంది. అయితే ఫేస్ బుక్ లో అయినా మాట్లాడదాం కదా అన్నాను. నేనే నీకు మెసేజ్ చేద్దాం అని చాలా రోజుల నుంచి చూసాను కానీ నీకు ఫేస్బుబుక్ లేదు కదా అంది. రీసెంట్ గా క్రియేట్ చేశా తరువాత నీకు రిక్వెస్ట్ పెట్టాను అని చెప్పాను. అవును చూసా అంది. మరి మెసేజ్ చెస్తే రిప్లై ఇవ్వలేదు ఎందుకు అని అడిగాను. నీ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేయగానే అందరూ అడిగారు మళ్ళీ అందుకే రిప్లై ఇవ్వలేదు అంది. అన్నిటికీ నీకు భయం అన్నాను. అలా కాదు ఎందుకు లేనిపోని తల నొప్పి అని అంతే అంది. ఇలా రోజూ మొత్తం తనతోనే చాట్ చేస్తూ ఉండేవాడిని సెలవులు మొత్తం. మౌనిక, జాహ్నవి, సరయూ అసలు మరిచి పోయారు నన్ను. ఒక్క రోజు కూడా ఫోన్ లేదు మెసేజ్ లేదు. నేను కూడా సుల్తానా తో మాట్లాడడం మొదలు పెట్టాను రోజు.
సెలవులు అయిపోయాక కాలేజ్ కి వెళ్ళాను. మా నాన్న గురించి తెలిసిందే కదా మొదటి రోజు పంపాడు. కానీ చాలా తక్కువ మంది వచ్చారు. సుల్తానా 3 రోజుల తరువాత వచ్చింది. తను చాల మారింది. కొంచెం బొద్దుగా సెక్సీ గా అయింది. కానీ నాతో క్లాస్ లో కూడా ఫ్రీ గా మాట్లాడేది. నేను చాలా సింపుల్ గా ఉండేవాడిని. ఫ్యాషన్ గా ఉండేవాడిని కాదు. ట్రెండింగ్ గా డ్రెస్సింగ్ కూడా ఉండేది కాదు నా డ్రెస్సింగ్ స్టైల్. ఒక రోజు సుల్తానా అడిగింది నువ్వు ఎందుకు చాలా ఏజెస్ లా బట్టలు వేసుకుంటావు అని. నాకు ఇవే ఉన్నాయి అన్నాను. తను అయితే సాయంత్రం షాపింగ్ వెళదాం అంది. నేను మా నాన్న మిడిల్ క్లాస్ అనుకునేవాడిని. మా నాన్న నాకు మనీ గురించి చెప్పేవాడు కాదు. నేను సాయంత్రం కాలేజ్ అయ్యాక మా అమ్మని అడిగాను బట్టలు కొనాలి అని. మా అమ్మ నాన్న నీ అడుగు అంది. నాకు అసలే భయం ఏమంటాడో అని. సరే అమ్మాయితో వెళ్తున్న సో అడగాలి అని అడిగాను. మా నాన్న అడిగిన వెంటనే ఏమి మాట్లాడకుండా 5000₹ ఇచ్చి చూసి కొను మంచి బట్టలు అన్నాడు. సరే అని సుల్తానా కి ఫోన్ చేసి మార్కెట్ కి రమ్మని చెప్పాను. తను నేను హాస్టల్ నుంచి కొంచెం దూరం వస్తాను నువ్వే వచ్చి పిక్ చేసుకో అంది. సరే అని వెళ్ళాను. నాకు భయం గా ఉంది. మా సొంత ఊరు ఎవరైన చూస్తే మా నాన్న చంపేస్తాడు అని. సో తనకి చెప్పాను పక్క ఊరికి వెళ్దాం అని. తను లేట్ అయితే హాస్టల్ లోకి అలో చేయరు అంది. వచ్చేద్దాం లే తొందరగా అని ఫాస్ట్ గా తీసుకెళ్ళాను. బట్టలు అన్ని ట్రెండీ గా ఉండేవి కొనింది. ఏమైనా తిందాం అంటే టైం లేదు సో ఫాస్ట్ గా హాస్టల్ లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చాను.
తను రాత్రి చాట్ చేస్తూ చెప్పింది నీ దగ్గర మనీ లేవు ఏమో అని నేను కొనిద్దాం అనుకున్న కానీ నీకు మనీ ఎవరు ఇచ్చారు అంది. మా నాన్నే అన్నాను. అవునా మరి నువ్వు ఎపుడూ అడగలేదా మని నీ మీ నాన్న తో అంది. లేదు కానీ ఈ రోజు అడిగాను ఇచ్చాడు అని చెప్పను. నువ్వు ఎందుకు కొనివ్వాలి అనుకున్నావు అని అడిగాను. నీకు ఇంకా అర్ధం కాలేదా అంది. నాకు అపుడు బల్బ్ వెలిగింది.