అర్జున్ రొమాన్స్ 2 163

ప్రస్తుతం

డిన్నర్ చేస్తూ కార్తిక్ రియా ఇంకా అను కాసేపు మాట్లాడుకుని ముగించేసిన తరువాత అను ని తనతో పాటు పడుకోమని కార్తిక్ ని అర్జున్ దగ్గర పడుకోమని రియా చెప్పడం తో అలాగే అని కార్తిక్ అర్జున్ రూం కి అక్కడ కాస్త విషాదంగా కూర్చున్న నర్స్ పాప దగ్గరికి వెళ్లి భోజనం చేయడానికి ఎందుకు రాలేదు అని అడిగితే మేడం రావొద్దు అన్నారు అని అను కి తనంటే ఎందుకో ఈర్ష్య గా ఉందని తను పడుకున్న తరువాత డిన్నర్ చేసి పడుకోమందని చెప్పింది.

కార్తిక్ నర్స్ మాటలు విని అను పైన కోపం వచ్చిన ఇంత చిన్న దానికే అలా రియాక్ట్ అవ్వాలా అని కాస్త నవ్వు కూడా వచ్చింది, రియా jr. సంజు ని అను ని తన రూంకి తీసుకెళ్లి డోర్ వేసుకోగానే ఇక్కడ నర్స్ లేచి భోజనం చేయడానికి వెళ్తుంటే తను కూర్చున్న సోఫా కాళీ అవ్వడం తో కార్తిక్ అక్కడ పడుకున్నాడు, నర్స్ భోజనం చేసిన తరువాత అర్జున్ గదిలో కార్తిక్ సోఫాలో పడుకున్నాడని తను హాల్ లో సోఫాలో పడుకుండిపోయింది.

తెల్లారింది అందరికంటే ముందు లేచే రియా రాత్రంతా తన ఆడపడుచు తో ముచ్చట్లు పెట్టి పడుకునే సరికి లేట్ అవ్వడం తో ఇంకా నిద్ర లేవలేదు, కార్తీక్ టైం 7 దాటినా ఇంకా లేవడం లేదేంటి అని తనే బెడ్రూం దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుని బైటికి వచ్చి చూస్తే హాల్ లో సోఫాలో పడుకుని ఉన్న నర్స్ ని చూసి ఓహ్ షిట్ తినని మర్చేపోయానే రాత్రి అర్జున్ దగ్గర కూర్చుని అలాగే పడుకుండిపోయాను లాభం లేదు త్వరలో ఒక 4 బెడ్రూం ఫ్లాట్ చూడాలి ఇప్పుడే సరిపోవడం లేదు వాళ్ళు ముగ్గురు కూడా వచ్చేసారంటే అసలే సరిపోదు అనుకుంటూ బెడ్రూం డోర్ ఓపెన్ గానే ఉండడం తో తెరిచి లోపలికి వెళ్ళి బేడీషీట్స్ కప్పుకుని పడుకుని ఉన్న వాళ్లలో రియా ఎవరా అని ఆలోచిస్తూ ఒకరి దగ్గరికి వెళ్లి మొహం పైన కప్పుకుని ఉన్న బేడీషీట్ తీసి చూసాడు.

తను ఊహించినట్టుగానే ఎప్పుడు అదే పక్క పడుకోడానికి ఇష్టపడే తన భార్యే ఉండడం తో తనని మెల్లిగా తట్టి లేపాడు ఇంకా మత్తు నిద్దట్లో ఉన్న రియా ఎదో కలవరించింది, కార్తీక్ కి సరిగ్గా వినిపించకపోవడం తో చిన్నగా నవ్వి హేయ్ రియా ఎం కలవరిస్తున్నావ్ త్వరగా లే బాబుకి నాకు స్కూల్ కి ఆఫీస్ కి టైం అవుతుంది అంటూ లేపాడు, 2 నిమిషాలు అటు ఇటు మెసులుతూ మూలుగుతూ మొత్తానికి లేచింది.
రూం నుండి బైటికి వస్తూ హాల్ లో ఎవరో సోఫాలో పడుకున్నది చూసి ఇదెవరు అని ఆలోచిస్తూ ఇంట్లో మిగిలింది నర్స్ ఏ కదా అనుకుని చ్చ ఆయన్ని అర్జున్ దగ్గర పడుకిమన్నప్పుడు తిను ఉందని ఎందుకు గుర్తు రాలేదు నాకు అనుకుని కార్తీక్ ని పిలిచి త్వరలో కాస్త పెద్ద ఇంటికి షిఫ్ట్ అవుదామని చెప్తే తానూ అదే ఆలోచించాడు కాసేపడి క్రితం అని చెప్తూ ఎలాగూ నర్స్ బయటే ఉండడం తో కార్తీక్ అర్జున్ రూంలోనే ఫ్రెష్ అయ్యి రియా కాఫీ ఇస్తే తాగి అర్జున్ రూంలోనే స్నానం గట్రా ముగించుకుని ఆఫీస్ కి రెడి అయ్యాడు,

రియా కార్తీక్ కి బ్రేక్ఫాస్ట్ పెట్టి jr. సంజు ని నిద్ర లేపి వాడిని స్కూల్ కి రెడి చేసి కొంత వాడికి టిఫిన్ తినిపించి స్కూల్ బస్ రావడం తో కార్తీక్ వాడిని కిందకి తీసుకెళ్లి బస్ ఎక్కించి వీడి కార్లో వీడు ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.

ఇంత హడావుడి గోల గోల జరుగుతున్నా మేలుకోలేదు ఏంటి ఈ అమ్మాయి అని నర్స్ ని లేపడనికి వెళ్లి బేడీషీట్ లాగి చూస్తే సోయి లేకుండా పడుకున్న తనని చూసి కదుపుతూ లేపితే లేవలేదు తల పైన చేయి వేసి చూస్తే చల్లగా ఉంది శరీరం అంత చల్ల బడి పోయింది రియా కి భయం కలిగింది వెంటనే పక్కనే ఉన్న ల్యాండ్ లైన్ నుండి ముందు రోజు వచ్చిన డాక్టర్ కి కాల్ చేసి కండిషన్ చెప్పగానే వెంటనే అంబులెన్స్ తీసుకొని వచ్చాడు.

నర్స్ పాప ని అంబులెన్స్ లో ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఇక్కడ ఇంట్లో రియా తెగ కంగారు పడుతుంది అసలేమైంది ఈ పిల్లకి ఎందుకు అలా అయింది అని ఆలోచిస్తూ ఉంది ఇంతలో అను నిద్ర లేచి రూం నుండి బైటికి వచ్చి హాల్లో టెన్షన్ పడుతూ ఉన్న రియా ని చూసి వెళ్లి వెనక గుండా వాటేసుకుని గుడ్ మార్నింగ్ వదిన ఏంటి ఇలా ఉన్నావ్ అని అడిగితే నర్స్ గురించి చెప్పడం తో అను కి చిరాకు గా అనిపించి ఏంటి వదిన దాని గురించి ఇంత టెన్షన్ పడుతున్నావ్ అంటే రోడ్ పైన ఎవరికి ఎం జరిగినా ఇలాగే రియాక్ట్ అవుతావా ఏంటి, అసలు ఎవరది ఎదో అర్జున్ కి పర్సనల్ నర్స్ గా వచ్చింది అంతే గా దాని గురించి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావ్ నువ్వు చేసేది చేసేసావ్ డాక్టర్ కి కాల్ చేసి చెప్పేశావ్ గా ఇక రిలాక్స్ అవ్వు దా నాకు టిఫిన్ పెట్టు ఆకలిగా ఉంది అంది.

రియా కరెక్ట్ ఏ కదా నేనెందుకు టెన్షన్ పడుతున్నాను అనుకుని అను తో మొహం కడిగావ టిఫిన్ అంటున్నావు అంటూ కిచెన్ వైపు వెళ్లి దోసలు వేస్తుంది అను కిచెన్ గట్టు పైన కూర్చుని వదిన వేసిన దోసలు తింటూ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు.

టిఫిన్ తినడం పూర్తి అయ్యాక అను స్నానం చేసి ప్రేష్ గా వదిన తో ఏదన్నా గుడికి వెళ్దాం అంది రియా కూడా సరే అని ఫ్రెష్ అయ్యి ఇద్దరు కలిసి గుడికి వెళ్లారు, ఇక్కడ హాస్పిటల్ లో డాక్టర్ నర్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అక్కడ కార్తీక్ కి యు యెస్ నుండి కాల్ వచ్చింది తెల్లారి 4 ఇంటికి ఫ్లైట్ ఎక్కుతాం అని అర్జున్ చెల్లెళ్ళు చెప్పారు ఇక్కడ ల్యాండ్ అయిన తరువాత కూడా కాల్ చేయమని చెప్తే సరే అని కాల్ కట్ చేసేసి తన ఇల్లు వెతికే పనిలో పడ్డాడు.

గుడికి వెళ్లిన అను ఇంకా రియా దర్శనం బాగా చేసుకుని ఒక పక్కన కూర్చుని కొన్న ప్రసాదాన్ని తింటూ అను రియా తో వదిన ఆ నర్స్ గురించే కదా కోరుకున్నావ్ అని అడగగానే రియా నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది, దానికి అను నాకు అంత తెలుసు నువ్వు గుడికి వెళ్దాం అనగానే రెడి అయ్యావంటే నే డౌట్ వచ్చింది. వదిలేయి వదిన అర్జున్ కి ఇంకో నర్స్ ని మాట్లాడమని అన్నయ్యతో చెప్తే సరే దానికి పోయి అని ఆపేసింది.

రియా అను అన్న దానికి ఎదో సమాధానం చెప్పే లోపే మొబైల్ రింగ్ అవ్వడం తో లిఫ్ట్ చేసి హా….. హలో…. కార్తిక్…. ఏంటి….. వచేస్తున్నార….. అవునా… దొరికిందా… చాలా..దూరం ఆ….. మరి… బాబు స్కూల్…. అంతే అంటావా… సరే… ఒక్కనిమిషం…. అది… ఆ… నర్స్ ఉందిగా…. చెప్పారా… సరే… అలాగే… అని కాల్ కట్ చేసింది.

రియా కాల్ కట్ చేసి అనుతో ఇక వెళ్దాం అని ఇద్దరు ఇంటికి బయలుదేరారు, ఇక్కడ హాస్పిటల్ లో నర్స్ పాప కళ్ళు తెరిచింది పక్కనే ఉన్న డాక్టర్ తన తల పైన చేయి పెట్టి మళ్ళీ అదే కల నా అంటూ అడిగితే నర్స్ అవునన్నట్టు తల నిలువుగా ఊపింది, డాక్టర్ తనకి ఇంకా ఎందుకు అదే కల గురించి ఆలోచిస్తావ అదంతా అయిపోయింది గా ఇప్పుడు నువ్వు సేఫ్ గానే ఉన్నావ్ గా అసలీ ఆలోచన మళ్ళీ ఎందుకోచ్చింది మళ్ళీ అని అడిగితే, నర్స్ తన చేయి తో ఏమో అన్నట్టు సైగ చేస్తే డాక్టర్ తనని సముదాయించి ఇక ఇంటికి వెళ్దాం అని తనని బెడ్ పైనుండి లేపి నడిపించుకుంటు తన కార్లో ఇంటికి తీసుకొచ్చాడు.

ఇంట్లో టీ వి లో ఎదో చూస్తూ ఉన్న రియా ఇంకా అను కి డోర్ బెల్ డిస్తర్బ్ చేయడం తో ఎవరు అంటూ రియా వెళ్లి డోర్ తెరిస్తే డాక్టర్ తనతో పాటు నర్స్ ని చూసి బానే ఉందని తెలిసి సంతోషంగా ఇంట్లోకి రమ్మంది, ముగ్గురు ఇంట్లోకి వస్తూ ఉంటే అను వాళ్ళని చూసి ఇదేందీ మళ్ళీ వచ్చింది పొద్దున వదిన దీనికి అంత సీరియస్ గా ఉందని చెప్పింది గా అప్పుడే నయం అయిపోయిందా అన్ని నాటకాలు చెప్తా దీని పని అనుకుని మళ్ళీ టీ వీ లో మొహం పెట్టింది.

1 Comment

  1. Note book rastunava bro sex stories a waste

Comments are closed.