బనిషా: నొకుల్ కి రేపు టెస్తు ఉంది తన కోచింగ్ సెంటర్లో. అన్నట్లు ఇప్పుడు రాత్రి 8:30 అయ్యింది, ఎక్కడున్నావు నువ్వు?
అర్జున్: నేను రజియాను కలవడానికొచ్చాను, ఇప్పుడు అక్కడే వాళ్ళతోపాటు ఉన్నాను.
బనిషా: వావ్, ఫోను రజియాకిస్తావా, చాలా రోజులైంది తనతో మాట్లాడి.
నేను ఫోన్ రజియాకిచ్చాను.
బనిషా: హాయ్ రజి, ఏంటి విశేషాలు, మీ ఆయన, నీ కొడుకు, అత్తామామ ఎలా ఉన్నారు?
రజియా: బావున్నా. నా కొడుకు మా అమ్మానాన్నల దగ్గరికెళ్ళాడు కొన్ని రోజులు ఉండి రావడానికి. మా ఆయన, అత్తామామ కూడా బావున్నారు. వాళ్ళ గదిలో టీవీ చూస్తున్నారు. నీ గురించి చెప్పు, నువ్వెలా ఉన్నావ్?
బనిషా: నేనా, నేను చాలా సంతోషంగా ఉన్నా, ప్రతిది చాలా బావుంది.
రజియా: అవునా, నువ్వెందుకో ఇవాళ చాలా ఎక్కువ సంతోషంతో ఉన్నట్లు అనిపిస్తోంది..?
బనిషా: అంటే, నీ ఉద్దేశ్యం?
రజియా: హ..హా..జోక్ చేసాలే. వచ్చే మంగళవారం కలుద్దాం, నీ మామూలు మెడికల్ చెకప్ కు ఆలస్యం చేయొద్దు, ఉంటా, బాయ్.
బనిషా: బాయ్, గుడ్ నైట్, ఫోన్ మా ఆయనకివ్వవా ప్లీజ్.
అర్జున్: నేనింకో గటలో అక్కడ ఉంటాను, బాయ్.
బనిషా: ఓకే లవ్, అప్పుడే కలుద్దాం.
ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు బనిషా చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపించింది. ఆమె సంతోషానికి కారణం నేనేనా? నా తమ్ముళ్ళకు ఇంతసేపటి వరకు చదువు చెప్పడం కాస్త వింతగా ఉంది. మామూలుగా సాయంత్రం 6 గంటలకంతా అది అయిపోతుంది. నేను తనని చూసింది సాయంత్రం 4 గంటలకు, తను వాళ్ళకు చదువే చేప్తోందా?
రజియా: సరే అర్జున్ మనమెక్కడ ఉన్నాము?
అర్జున్: ఆ..ఏంటి?
రజియా: ఫోన్ రావడానికి ముందు నువ్వేం చెప్ప్తున్నావు?
అర్జున్: ఆ..నేను మామూలుగా రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వెళ్తాను, కాస్సేపు అందరితో సమయం గడిపి, కాస్సేపు టీవీ చూసి, భోంచేసి పడుకుంటాను. నాకేవిదమైన వ్యత్యాసం కనిపించలేదు.
రజియా: సరే, ఈ రోజు మంగళవారం. నువ్వు కాస్త మెలకువగా ఉండాలి. నువ్వు గదిలో ఉన్నఫ్ఫుడు వాళ్ళేమన్నా సైగలు లాంటివి చేసుకుంటారా అని గమనించు. మనమికేదైనా చేయాలి ఇంకా ఎక్కువ ఆ ఇంటి విషయాలను తెలుసుకోవడానికి.
అర్జున్: చూడండి, మీ అందరికి నేనెలా కనిపిస్తున్నాను, ఒక చవటలా, పనికిమాలినవాడిలా కనిపిస్తున్నానా? అసలు మీరంతా ఏం చేస్తున్నారో తెలుసా?
రజియా: నువ్వు వాళ్ళని నమ్మావు అందుకే నీకు వాళ్ళపైన ఎలాంటి అనుమానము కలుగలేదు. అదే కాదా కుటుంబమంటే. నమ్మకం. వాళ్ళకోసం నువ్వెన్ని త్యాగాలు చేసావో నాకు తెలుసు. నేను నీ స్నేహితురాల్ని, మేమందరం నీ స్నేహితులమే. నీ కష్టకాలంలో మేమంతా నీ తోడుంటాం, నువ్వేం దిగులు పడొద్దు.