పూర్ణ చంద్రుడు 4

ఆ తర్వాత శ్రీను, శ్రీ ఇద్దరు మాత్రమే auditorium లో ఉన్నారు దాంతో శ్రీను కొంచెం ధైర్యం తెచ్చుకుని “ఆ రోజు నువ్వు చనిపోలేదా” అని అడిగాడు దానికి శ్రీ నవ్వుతూ తన జాకెట్ విప్పి, వెనకు తిరిగి తన t షర్ట్ విప్పి తన భుజం నుంచి వీపు పైన కాలిన గాయాలు చూపించింది దాంతో శ్రీను, శ్రీదేవి భుజం మీద చేయి చెయ్యి వేసి తాకి చూశాడు మొదటిసారి ఒక మగాడు తన ఒంటి మీద చెయ్యి వేసే సరికి శ్రీదేవి కీ బాడి మొత్తం కరెంట్ పాస్ అయ్యింది దాంతో తల వెనుకు తిప్పి “రా బయటికి వెళ్లదాం” అని అడిగింది దానికి శ్రీను “పిచ్చా నీకు ఇంత పని పెట్టుకుని ఎలా వెళ్లతాం” అని శ్రీను మాట పూర్తి కాకముందే తన మీద వేగంగా తుపాను గాలి వచ్చినట్లు గాలి తగిలింది ఏంటి అని చూస్తే మొత్తం గోడలు అన్నిటికీ పేయింట్ వేసి ఉంది శ్రీను అది చూసి ఆశ్చర్య పోయే లోపే తన చెయ్యి పట్టుకుని మెరుపు వేగంతో లాకుని వెళ్లింది శ్రీ దాంతో శ్రీను కీ కొంచెం తల తిరిగింది అప్పుడు తన ముందు ఉన్న దృశ్యం చూసి కళ్లు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండి పోయాడు ధర్మశాల లోనే అతి పెద్ద కొండ పైన వాళ్లు ఉన్నారు సూర్యుడి కిరణాలు తాకి కింద అడవిలోని చెట్లు మొత్తం ఇంద్రధనుస్సు భూమి మీద వాలినట్టు ఉంది. “శ్రీనివాసుడికి శ్రీదేవి కన్న ఎప్పుడు పద్మావతి దేవి అంటే నే ప్రేమ ఎక్కువ కానీ శ్రీదేవి కీ శ్రీనివాసుడు మాత్రమే ఇష్టం” అని చెప్పింది దానికి శ్రీను నవ్వి శ్రీ నీ కౌగిలించుకున్ని థాంక్స్ చెప్పాడు ఆ తర్వాత ఇద్దరూ అడవి నుంచి వస్తుండగా శ్రీను కీ మెదడులో ఒకటే ఆలోచన అంత పెద్ద కొండను 5 నిమిషాల వేగం లో ఎక్కిన శ్రీ ఆ రోజు రాత్రి తనను పట్టుకోవాలి అనుకుంటే పట్టుకునేది కానీ అలా జరగలేదు అంటే శ్రీ ఎవరినో కాపాడాలని చూసింది ఆ అమ్మాయి మీద దాడి చేసింది శ్రీ కాదు అని అర్థం అయ్యింది శ్రీను కీ అలా ఇద్దరు వస్తుంటే వాళ్ళకి దారిలో ఒక శవం కనిపించింది దాని చూసి శ్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది ఎందుకంటే అక్కడ పడి ఉన్నది vendatins కీ చెందిన ఒక vampire శవం ఆ చనిపోయిన మనిషి ఎవరో కాదు శ్రీ తమ్ముడూ ఆది.

ఆది చనిపోయి శవంలా పడి ఉండటం చూసిన శ్రీదేవి గట్టిగా అరుస్తూ వెళ్లి ఆది మీద పడి ఏడ్వడం మొదలు పెట్టింది తనని ఓదార్చాడు కానీ శ్రీదేవి ఆవేశం గా తన గోళ్లతో పక్కన ఉన్న చెట్టు కొడితే అది ముక్కలు అయ్యింది, అప్పుడు అక్కడ ఆది గర్ల్ ఫ్రెండ్ నిషా కూడా ఉంది వెళ్లి తనని చూసింది శ్రీదేవి చూస్తే తనకు రక్తం ఇస్తే బ్రతుకుతుంది అని తన తమ్ముడి శవం నీ నిషా నీ ఇద్దరిని తీసుకొని మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది శ్రీను కాలేజీ కీ వెళ్లి పద్దు నీ కలిశాడు జరిగింది అంతా చెప్పాడు దాంతో పద్దు కంగారుగా స్టూడెంట్స్ వైపు చూసింది వెంటనే dean రూమ్ కి వెళ్ళి “మేడమ్ urgent గా holiday declare చేయండి code red” అని చెప్పింది దాంతో అనిత వెంటనే తన రూమ్ లో ఉన్న మైకు ద్వారా సెలవు ప్రకటించింది దాంతో స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్లారు అప్పుడు పద్దు శ్రీను తో “శ్రీను ఇంటి నుంచి బయటికి రాకు ఏదైనా వెండి వస్తువు ఉంటే అది నీ పక్కన పెట్టుకో నీ జాగ్రత్త కోసమే” అని చెప్పి స్టూడెంట్స్ నీ ఇంటికి పంపే పనిలో ఉంది పద్దు.

శేఖర్ ఇంట్లో తన మేనల్లుడు అలా శవం గా పడి ఉండటం చూసి తట్టుకోలేక పోయాడు “ఈ ఊరిలో మన కుటుంబం మీద చెయ్యి వేసి దమ్ము ఎవరికి వచ్చింది” అని కోపంగా తన పిడికిలి బిగించి పక్కన ఉన్న స్తంభాని కోడితే అది ముక్కలు అయ్యింది అప్పుడు శేఖర్ వాళ్ల నాన్న రామ్మోహన్ “శేఖర్ ఆవేశం అణిచి పెట్టు దాని ఎప్పుడు వాడాలో తెలుసుకో మన శత్రువులు ఎవరో గుర్తించు” అని చెప్పాడు దానికి పద్దు “ఆ ఎస్పి ఠాకూర్ తమ్ముడూ బచ్చు తో నాకూ పెళ్లి cancel అయినప్పుడు ఆది కీ బచ్చు కీ గొడవ జరిగింది అప్పుడు ఆది నీ చంపుతా అన్నాడు” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది అది చూసిన రామ్మోహన్ “ఈ శవం తో ఇంకా కొన్ని శవాలు తోడు వెళ్లే లాగా ఉన్నాయి శేఖర్ ఆది నీ హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళండి శేఖర్ వెళ్లి శ్రీ నీ తీసుకోని రా” అని చెప్పాడు శేఖర్ వెళ్లే సరికి అక్కడ ఒక పది మంది చనిపోయి పడి ఉన్నారు బచ్చు తో గొడవ పడుతున్న శ్రీ కంటే బలంగా ఉండటం తో తన గోళ్లతో కొట్టడానికి చెయ్యి పైకి లేపాడు, ఆ గాలిలో లేచిన చెయ్యి శ్రీ నీ తాకే లోపు శేఖర్ వెళ్లి బచ్చు చెయ్యి పట్టుకుని ఎత్తి అవతల వేశాడు “నీకు సమానమైన వారితో తలబడు అని బచ్చు కాలు పట్టుకుని ఎత్తి పడేశాడు తరువాత శ్రీ నీ లేపి ఇంటికి వెళ్లమని చెప్పాడు ఆ తర్వాత బచ్చు పీక పట్టుకుని తన పంజా దెబ్బ తో చంపాలీ అని చెయ్యి ఎత్తాడు శేఖర్, అప్పుడే ఠాకూర్ వచ్చి శేఖర్ నీ పక్కకు తోశాడు దాంతో శేఖర్ తన కోర పళ్ల తో ఠాకూర్ వైపు చూసి గర్జించాడు దానికి ఠాకూర్ కూడా తన కొర పళ్ల తో గర్జించాడు “చూడు శేఖర్ నా తమ్ముడి కీ నీ అల్లుడు కీ గొడవలు ఉండొచ్చు కానీ వాడు కాదు నీ అల్లుడు నీ చంపింది నెల రోజులు టైమ్ ఇవ్వు వాడు ఎవడో కనిపెట్టి తేస్తా లేదు అంటే నా తల నరికి నీ చేతిలో పెడతా” అని చెప్పాడు ఠాకూర్ దానికి శేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *