“నాకు తెలుసు గౌతమ్ నీకు నాకు సారీ కొనివ్వడం నీకు కొంచెం కూడా ఇష్టం లేదు…. అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నవు???? రాత్రి నీకు కావలసింది ఇచ్చాను కదా!!!! అందుకే నీ ముందు చులకన అయ్యాను….”అని చిరు కోపం గా అంటుంది
నందు అన్న మాటలకి గౌతమ్ నోరు తెరిచి “నువ్వెక్కడ ఈజీగా ఇచ్చావే??? నీకు నచ్చిన సారీ కొనిస్తా అంటే ఒప్పుకున్నావు కానీ!!! అయినా ఇప్పుడేమైంది నువ్వు అలగటానికి??? ఆ సారీ నీకు చాలా బాగుంది…. నేను నెక్స్ట్ మంత్ స్మార్ట్ వాచ్ కొనుక్కుంటానులే డోంట్ వర్రీ…. ఇప్పుడు నీ అలక తీరాలంటే నేనేం చేయాలి చెప్పు….” అని తన చేతులతో నందు నడుముని వత్తేస్తూ అడుగుతాడు
“అయితే ఈ పూట వంట మీరే చెయ్యండి…. నా దగ్గర షాపింగ్ చేసే సరికి ఓపిక లేదు…” అని అంటుంది
గౌతమ్ ఇక చేసేదేమీ లేక “సరేలే ఏం చేస్తాం తప్పదు…. భార్య అలక తీర్చాలి కదా!!!!”అని డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ ట్రాక్ వేసుకుని కిచెన్ లోకి వెళ్లి వంట చేసుకుంటూ “ఏంటో నా బతుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా ఈ బ్యాచిలర్ బ్రతుకు మాత్రం మారలేదు…. పెళ్ళాం వచ్చాక అయినా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే ఇదేమో ఇలా తయారయ్యింది….. అయినా ఇదంతా నువ్వు చేసుకున్నదే లేరా గౌతమ్!!! ఇప్పుడు ఎన్ని అనుకొని ఏమి లాభం???”అని నిట్టూరిస్తూ వంట చేస్తూ ఉంటాడు
నందు గౌతమ్ వంట చేస్తుంటే కిచెన్ దగ్గర ఉండే తను అన్న మాటలకి నవ్వుకుంటూ వెంటనే సీరియస్ గా మొహం పెట్టి “మరి ఎందుకు పెళ్లి చూపుల్లో చూడగానే ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు??? నా గురించి అంత అర్థమయ్యేలా చెప్పాను కదా!!! అయినా పెళ్లి చేసుకున్నాక నన్ను ఇన్ని మాటలు అంటూ రాచి రంపాన పెడుతున్నారు???” అని ముక్కు చీదుతూ అడుగుతుంది
నందు వాయిస్ కి టెన్షన్ గా వెనక్కి తిరిగిన గౌతమ్ నందు తన మాటలు వినిందని అర్థమై నందు రియాక్షన్ కి కళ్ళు తేలేసి “నేను అన్న మాటల్లో అంత అర్థం ఉందా నందు??? నాకు తెలియదు నేను ఏదో జస్ట్ నన్ను నేను అనుకున్నాను…. నిన్నెందుకు అంటాను నువ్వు నా జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవతవి, నా బంగారానివి…..” అని నందుని మాటలతోనే కోటలు కట్టేసి అందులో మహారాణిని చేస్తాడు….
నందు ఒక కనుబొమ్మ పైకెత్తి యాటిట్యూడ్ గా గౌతమ్ వైపు చూస్తూ నడుం మీద చేతులు పెట్టుకుని “ఇప్పుడు నిజం చెప్పండి….” అని సీరియస్గా అడుగుతుంది
గౌతం అమాయకంగా మొహం పెట్టి “ప్రామిస్ బంగారం నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా??? రాత్రంతా చూపించాను కదా నా ప్రేమ నీ మీద ఎంత ఉందో???” అని కొంటెగా నందు కళ్ళల్లోకి చూస్తూ అంటాడు
గౌతమ్ చూపులకి నందు సిగ్గుపడుతూ ” ఛీ పోండి గౌతమ్ ఏంటా మాటలు?? నేను ఏదో మీకు వంట లో హెల్ప్ చేద్దామని వస్తే మీరు మీ మాటల తోనే నన్ను మునగచెట్టు ఎక్కించడానికి చూస్తున్నారు….” అని నవ్వుతూ అంటుంది
నందు సిగ్గు పడటం చూసి గౌతమ్ మనసులో “హమ్మయ్య తప్పించుకున్నాను…” అనుకుని “అవునా అయితే ఇంకా అక్కడే ఉన్నావు ఏంటి??? ఇక్కడికి రా….” అని చెప్పి నందు చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని తనను వెనకనుంచి హగ్ చేసుకొని నందు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని నందు చేతులతోనే కూరగాయలు కట్ చేస్తూ తన చేతులతోనే వంట చేస్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ ఒక గంటకి ఇద్దరూ కలిసి వంట పూర్తి చేస్తారు…..
ఇద్దరూ ఒకరికొకరూ తినిపించుకొని “ఇక పడుకుందామా నందు??? మళ్ళీ నైట్ నిద్రపోవటానికి లేట్ అవుతుంది….” అని కొంటెగాచెప్పి ఇద్దరు వెళ్లి హాయిగా నిద్ర పోతారు
@@@@@@@@
Arey neeku inka eay story dorakaleda
Avnu
Erpuku story
Loda story
Loda story