గౌతమ్ వాళ్లది గుంటూరు….గౌతమ్ బీటెక్ చేసి క్యాంపస్ సెలక్షన్స్ లోనే ఇన్ఫోసిస్ లో జాబ్ కొట్టి ఇప్పటికీ అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు…. ఇన్ఫోసిస్ లో జాయిన్ అయినా రెండు సంవత్సరాలు తర్వాత తన అమ్మానాన్నలు గౌతమ్ కి పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తూ ఉండగా గౌతమ్ నాన్నగారి ఫ్రెండ్ దాదాపు పది సంవత్సరాల తర్వాత ఒక బంధువుల పెళ్ళిలో కలిసి ఇద్దరూ మాట్లాడుకుని తన కూతురు నందు కి కూడా సంబంధాలు చూస్తున్నాము ఆమె కూడా డిగ్రీ చదివిందని పై చదువులు చదివించ లేక పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నామని అంటారు….
గౌతమ్ నాన్నగారు కూడా గౌతమ్ కి సంబంధాలు చూస్తున్నామని నందు నాన్నగారికి ఇష్టమైతే గౌతమ్ కి నందుని ఇచ్చి పెళ్లి చేద్దామని అడుగుతారు….
గౌతమ్ నాన్నగారు కూడా ప్రైవేట్ ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నంతలో హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు…..
నందు నాన్నగారు కూడా అలాగే ప్రైవేట్ ఆఫీసులో గుమస్తాగా వర్క్ చేస్తూ ఉంటారు….. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు మొదటి అమ్మాయి మన హీరోయిన్ నందిక రెండవ అమ్మాయి మౌనిక…. నందు నాన్నగారు ఉన్నంతలోనే బ్రతుకుతూ మౌనిక ఇంటర్ చదువుతుంటే నందుని డిగ్రీ వరకు చదివించి పై చదువులు చదివించే స్తోమత లేక అక్కడితో ఆపేసి నందుకి పెళ్లి చేయాలని అనుకుంటారు….. గౌతమ్ నాన్నగారి గురించి నందు నాన్నగారికి తెలిసి ఉండటం వలన ఆయన ఇబ్బందిగా “మేము కట్నం మీరు అడిగినంత ఇచ్చుకోలేము….” అని అంటారు
గౌతమ్ నాన్నగారు “అసలు మాకు కట్నమే వద్దు గౌతమ్ ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు రెండు సంవత్సరాలుగా…. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి మన స్నేహాన్ని బంధుత్వం గా మార్చుకుందాం…. నా మాట మా అబ్బాయి తప్పకుండా వింటాడు….” అని నవ్వుతూ అడుగుతారు
నందు నాన్నగారికి కూడా ఇక ఏ ఇబ్బంది లేక అలాగే అని ఒప్పుకొని అడ్రెస్ ఫోన్ నెంబర్ చెప్పి పెళ్ళిచూపులకి రమ్మంటారు…..
గౌతమ్ నాన్నగారు నందు నాన్నగారు ఉండేది ఓకే ఊరిలోనే కాబట్టి గౌతమ్ నాన్నగారు ఇక ఆలస్యం చేయకుండా పంతులు గారికి ఫోన్ చేసి నందు నాన్నగారి ఎదురుగానే పెళ్ళిచూపులకి ఈ వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని తెలుసుకొని ఆ రోజే వస్తామని చెప్తారు….
నందు నాన్నగారు కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళాక గౌతమ్ నాన్నగారు కూడా ఇంటికి వెళ్లి తన భార్యామణితో అంతా చెప్పి ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోగానే గౌతమ్ కి ఫోన్ చేసి “నా ఫ్రెండ్ కూతురితో నీకు ఒక వారంలో పెళ్లి చూపులు ఫిక్స్ చేశాను…. నువ్వు కచ్చితంగా రావాలి ఈ సంబంధం ఎలాగైనా ఫిక్స్ అవ్వాలి…. నేను వాళ్లకు ఈ పెళ్లి జరుగుతుందని మాట ఇచ్చేశాను….” అని చెప్తారు
గౌతమ్”నాకు అమ్మాయి ఎలా ఉంటుందో?? కనీసం తెలియకుండా ఎలా నాన్న పెళ్లి చేసుకోవటం???కనీసం అమ్మాయి ఫోటో అయినా పంపండి…” అని అసహనంగా అడుగుతాడు
” నేను నా ఫ్రెండ్ ఫోన్ లో అమ్మాయి ఫోటో చూశాను…. తను కచ్చితంగా నీకు నచ్చుతుంది నువ్వు డైరెక్టుగా ఇక్కడికి వచ్చి చూద్దువు…. అన్ని మూసుకొని వారం రోజుల్లో ఇక్కడ ఉండాలి….” అని సీరియస్ గా చెప్తారు
గౌతమ్ ఇక ఏమనలేక అమ్మాయి నచ్చకపోతే అక్కడే డైరెక్ట్ గా అందరి ముందే నచ్చలేదు అని చెప్దాము అనుకుని సరే అని ఆ వారం రోజుల్లో తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తాడు….
ఇంటికి వెళ్లగానే గౌతమ్ అమ్మగారు “ఏంటి నాన్న ఇలా చిక్కి పోయావు???? అందుకే ఇలా దూరంగా ఉండే ఉద్యోగాలు చెయ్యద్దు అని చెప్పాను…. ఇప్పటికీ ముంచి పోయింది ఏమీ లేదు అక్కడ మానేసి ఇక్కడే మన ఊరిలోనే ఏదైనా జాబ్ చూసుకుంటే పోతుంది కదా!!!!”అని అంటూ కొడుకు మీద ప్రేమ కురిపించేస్తారు