మొగుడు Part 3 41

అదే సాయంత్రం భారతి,గోరింటాకు ఆంటీ తో కలిసి గుడికి వెళ్తే,,ఆ పక్కనే ప్రవచనం చెప్తున్నారు ఒకరు.
ఇద్దరు కొద్ది సేపు కూర్చున్నారు.
“భార్య ఎప్పుడు కూడా మొగుడి వద్ద లేకిగా ఉండరాదు.
శయనేషు రంభ అంటే, ఏది పడితే అది చేయమని కాదు శృంగారం లో.
దాని అసలు అర్ధం…నిద్ర పోతున్న పెళ్ళాన్ని చూస్తే మొగుడికి రంభ గుర్తు రావాలి”అన్నారు.

ఇంటికి వస్తున్న భారతి”నాకు అవన్నీ తెలియదు ఆంటీ కానీ భర్త వద్ద అలుసు ఆవకూడదు అంటే,,హద్దు ల్లో ఉండాలి అని చెప్పింది మా అమ్మ “అంది.
ఆమె ఇంటికి వచ్చేసరికి ,నేను కుట్ర గురించి ఆలోచిస్తూ మేడ మీద కూర్చున్నాను.
***

రెండు రోజుల తర్వాత”ఏమండీ బెంగాల్ లో మహిమ గల ఏరియా ఉందిట.నిప్పుల గుండం వేస్తారు ట.గోరింటాకు ఆంటీ వెళ్తున్నారు కొందరితో,నన్ను కూడా రమ్మన్నారు”అంది.
నేను సంతోషం గా తల ఊపాను.
మందు తాగి ఎంత కాలం అయ్యింది,భారతి కొన్ని రోజులు ఊరికి పోతే,వీలైతే దోస్త్ తో లేదంటే ఒంటరిగా తాగొచ్చు.

వాళ్ళు టికెట్ బుకింగ్ చేయించుకున్నారు కానీ ఆ సాయంత్రం ఆంటీ ఇంటికి వచ్చింది.
“అదేమిటి తమ్ముడు నువ్వు రాకపోతే ఎలా.”అంది.
“,అబ్బే నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు,భారతి తో వెళ్ళండి.తను టికెట్ చెయించుకుంది ట”అన్నాను.
ఈలోగా భారతి మా ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది.

“భలే వాడివి ,నిప్పులు గుండం లో భర్తవి కదా,,నువ్వే నడవాలి ట.అమ్మాయి వచ్చి ఏమి చేస్తుంది”అంది.
వింటున్న నేను ఉలిక్కి పడ్డాను,భారతి కూడా అర్థం కానట్టు చూసింది.
“అవును కోరికలు ఉన్నవారు అక్కడికి వెళ్లి గుండం లో నడవాలి.పిల్లలు కావాలి అని నువ్వు నడువు”,అంది.
“ఇలాంటివి చెప్పినవారిని దుషిస్తాను.ఎవరు చెప్పారు మీకు “అన్నాను కోపం గా.
“కిందటి వారం మీ అమ్మగారితో మాట్లాడితే చెప్పారు”అంది మామూలుగా.
భారతి వస్తున్న నవ్వు ఆపుకుంది.
“అయినా టికెట్స్ లేవు, అయిపోయాయి”అన్నాను కొద్ది సేపటికి irctc చూస్తూ.
నా ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు.
“తత్కాల్ లో కొడదాం లే తమ్ముడు”అంది వెళ్తూ.

ఆమె వెళ్ళాక”నువ్వు mba చేసావు,ఏమిటి ఈ గోల”అన్నాను భారతి తో.
“నాకు ఇలాంటి వాటి గురించి తెలియదు.పెద్దలు చెప్తే ఫాలో అవుతాను”అంది నవ్వుతూ.

ఆఫిస్ లో బాస్ వద్ద దొబ్బులు తిని రెండు వారాల తరువాత తత్కాల్ లో టికెట్ దొరికితే ఏడుపు ముఖం తో బయలుదేరాను.
స్టేషన్ కి వెళ్ళేసరికి తెలిసింది,భారతి టికెట్ అప్గ్రేడ్ అయ్యి,,సెకండ్ ఏసీ లోకి వెళ్ళింది.
మిగిలిన వి థర్డ్ ఏసీ,ఒకే బోగీ,కానీ అక్కడక్కడ.

“అరే ఇదేమిటి”అంది భారతి బాధగా.
“తమ్ముడు నువ్వు వెళ్ళు,భారతి నీ బెర్త్ వాడుకుంటుంది”అంది గోరింటాకు ఆంటీ.
అసలే ఈ ప్రోగ్రాం కి అగైన్స్ట్ గా ఉన్న నాకు పగ తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది…”నో నెవర్.భారతి చిన్న పిల్ల కాదు. తనే వెళ్తుంది”అన్నాను.

ట్రైన్ వచ్చేసరికి ,నేను భారతి బోగీ వరకు వెళ్ళాను.
లోపలికి వెళ్ళి ఆమె బెర్త్ వద్ద,ఆమె బ్యాగ్ ఉంచాను.
భారతి కూర్చుంటూ”అవసరం అయితే వాట్సప్ చేస్తాను”అంది ఎదురుగా ఉన్న తండ్రి కూతుర్లని చూస్తూ.
“మీరు ఎక్కడి వరకు”,అడిగాను.
వాళ్ళు కూడా అదే స్టేషన్ వరకు వస్తున్నారు.
“నాకు వేరే బోగీ లో బెర్త్,అక్కని చూస్తూ ఉండు”అన్నాను అమ్మాయి తో.
“సరే,అన్నయ్యా,,నా పేరు బిజిలి”అంది నవ్వుతూ.
“ఓహ్ నా పేరు భారతి,మీ నాన్నగారి పేరు ఏమిటి”అడిగింది.
ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ “ఇది నా నాలుగో పెళ్ళాం బీజిలి”అన్నాడు.
భారతి విస్మయం గా చూసింది,నేను అర్థం కానట్టు చూసాను.

“ముగ్గురు పెళ్లలకి కడుపు రాకపోతే నన్ను చేసుకున్నారు”అంది బిజీలి,నన్ను చూసి కన్ను కొట్టి.
“ఓహో నిప్పులు గుండం లో నడవడానికి వెళ్తున్నారా”అన్నాను నవ్వుతూ.
“అవును,బెంగాల్ నవాబుల కాలంలో,ఎవరో పెద్ద గురువు ఇది మొదలు పెట్టాడు”అన్నాడు ఆయన.
“వీడు డాక్టర్ వద్దకు వెళ్తే మంచిది కదా”అన్నాను ,భారతి చెవిలో.
“ఊరుకోండి,పెద్దాయన బాధ పడతారు,వింటే”అంది భారతి.

1 Comment

  1. Palaprathi jagadeesh

    సూపర్ ❤️❤️❤️❤️❤️❤️❤️ సూపర్

Comments are closed.