——————————————————————-
మార్నింగ్ వచ్చి ఉష స్వీటీ నీ కార్ లో తీసుకు వెళ్తుంది, వెళ్ళేటప్పుడు స్వీటీ కి మీ అమ్మ పేరు శ్వేత నాన్న పేరు రమేష్ అని చెప్ప మంది, మాటలు చెప్తూ చెప్తూ స్వీటీ పడుకొంది,మధ్యలో లంచ్ టైం లో రెస్టారెంట్ లో భోజనం చేసి, సాయంత్రం కళ్ళ ఇంటికి చేరారు, ఉష రాగానే వల్ల అమ్మ ప్రేమతో హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ లోపలకి తీసుకు వెళ్ళింది, పక్కన వున్న పాపని చూసి ఎవరూ అని దగ్గరకి తీసుకుంది, మా ఫ్రెండ్ వాళ్ల అమ్మాయి వాళ్ళు us వెళ్ళారు ఒక ఓన్ మంత్ ఏదో ప్రాబ్లెమ్ వల్ల దీనిని తీసుకు వెళ్ళటం కుదరలేదు అని ఉష చెప్పింది, ఉష వల్ల అమ్మ కుర్చీలో కూర్చుంటూ పాప నీ దగ్గరికి తీసుకొని నీ పేరు ఎంటి అమ్మ అంటే స్వీటీ అని ముద్దుగా చెప్పింది, ఉష వైపు చూస్తూ బాగానే మానేజ్ చేశావు కానీ నెల రోజులు కాకుండా ఓన్ వీక్ అంటే నమ్మెద్దని అని, ఏడుస్తూ తన మెడలో వున్న చైన్ తీసి స్వీటీ మెడలో వేస్తుంది, ఉష చూసి కంగారు పడుతూ ఏమీ అయ్యింది అమ్మ అంది, ఏమే నువు చెప్పకపోతే నాకు తెలీదా దీనిలో వల్ల అమ్మ కనిపిస్తుంది, వర్ష ఎలా వుందే దాన్ని ఒక్కసారి చూడాలని వుంది, చిన్నప్పటి నుండి దాన్ని ప్రేమగా చూసుకుందాం అంటే కుదరలేదు వీళ్ళ పంతాలు ఏంటో కానీ ఇంట్లో పిల్లల్ని కూడ చుడుకొనివ్వ కుండా చేశారు, పోనీలే మీ అమ్మని చూసుకోలేదు నిన్ను అయిన చూసుకునే అవకాశం వచ్చింది బంగారు తల్లి ఎంత ముద్దుగా ఉన్నావో అని స్వీటీ నీ ముద్దులతో మించింది, స్వీటీ కూడా అమ్మమ్మ అంటూ ముద్దు ముద్దు గా తనతో కలిసిపోయింది, అమ్మమ్మ అనగానే ఉష అమ్మ ఏడుస్తూ ఎది ఇంకో సారి పిలువు తల్లి అన్ని పిలిపించుకొని హత్తుకొని మురిసిపోయింది, నిన్ను చూస్తే నాకే ఇలా వుంది అంటే, మీ నానమ్మ అమ్మమ్మ తట్టుకో గలరా, అంటూ వాటేసుకొని ముద్దులు పెడుతూ వదలటం లేదు, అది చూస్తున్న ఉష కి కళ్ళు చెమ్మగిల్లాయి ఆనంద బాష్పాలు ఒక్కొకటి నేలను తాకుతూ వున్నాయి, వీళ్ళను చూసి స్వీటీ కూడా ఏడుస్తుంది.
