తిరిగితే 374

శంకరయ్య తన గుడిసెలో మోకాళ్ళమీద తల పెట్టుకుని వెక్కివెక్కి ఎడుస్తూ తన జీవితం ఏమైతుందో అని బాధ పడుతున్నాడు.

అది ఒక మారుమూల కుగ్రామం, నాగరికత అంతగా అంటని పల్లె, చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని, తల్లి కాయకష్టం చేసి పెంచింది, కొద్దీ రోజుల ముందే తల్లి కూడా చనిపోవడం తో దిక్కులేకుండా పోయాడు శంకరయ్య.

18 సంవత్సరాల వయస్సు, సన్నగా 5.5 అడుగుల పొడవుతో సాధారణంగా ఉంటాడు, ఇంతకాలం తల్లి చాటు బిడ్డగా గడిపాడు.

ఇప్పుడు ఎవరు లేని అనాథ గా మారిపోయాడు, తనకు మిగిలివున్న ఒక్క జత బట్టలను తీసుకుని అడవి దారి పట్టాడు, ఎక్కడికో తెలియదు, గమ్యం లేని ప్రయాణం.

పగలు దొరికింది తినడం రాత్రికి ఎదో ఒక చెట్టు పై పడుకోవడం, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. గడ్డం మీసాలు పెరిగిపోయాయి, దాదాపు అడవి మనిషిలా మారిపోయాడు.బట్టలు చిరిగిపోయి ఒంటిమీద స్పృహ కూడా లేనంతగా మారిపోయాడు.

అలా దట్టమైన కికారణ్యం లో తిరుగుతు ఒక కొండ గుహ కనబడితే అందులోకి వెళ్లి చూసాడు, కొంతకాలం ఉండడానికి బాగుంటుంది అని చుట్టూ గమనించాడు.

ఒక మూలన ఎవరో ఉన్నట్లు కనబడితే వెళ్లి చూసాడు, శరీరం మీద ఎముకలు తప్ప కండ ఏమాత్రం లేని ఒక మనిషి కనబడ్డాడు, ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తే చాలా నెమ్మదిగా ఉపిరి తీసినట్లు అనిపించింది.
శంకరయ్య వెంటనే పరిగెత్తుకెళ్లి దూరంగా ఉన్న ఏరు నుండి వెదురు బొంగులో నీళ్లు తీసుకుని, దారిలో కనబడ్డ తినడానికి పనికివచ్చేవి పట్టుకొని గుహలోకి వచ్చాడు.

మెల్లిగా ముసలి వ్యక్తిని కూర్చోబెట్టి కొద్దీ కొద్దిగా నీళ్లు నోట్లో పోశాడు, చాలా సేపటికి ఆ వ్యక్తి కళ్ళు తెరిచి శంకరయ్య ను చూసాడు,
నేను మెత్తగా వుండే ఫలాలను అతనికి తినిపించాను, అతనికి కొద్దిగా నెమ్మదిన్చింది. అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాడు,
నేనుకూడా పళ్ళు తిని నీళ్లు తాగి, ఆ గుహలో ఒక మూలకు పడుకున్నాను.

తెల్లవారిపోయింది, అడవి మేలుకోంది.

నేను లేచి ముసలయాన్ని కదిపి చూసాను, ఉపిరి భారంగా తీస్తూన్నాడు, కళ్ళు తెరిచి నావైపు చూసి ఒక మూలన ఉన్న తొలి సంచి వైపు సైగ చేసాడు, నేను ఆ సంచి అతనికి ఇచ్చాను, అతను సంచినుండి వేదురు బొంగును తొలుతో కట్టి ఉన్న దాని తీసి నాకు ఇచ్చాడు.

నేను దాన్ని తీసుకుని అతని వైపు చూసాను, అతను వెదురు బొంగు మూతను తీయమని సైగ చేసాడు, నేను తీసాను, దాని నిండా ఒక రకమైనా కషాయం లాంటి పదార్ధం ఉంది.

ఆ వ్యక్తి వేలితో తీసుకుని తినమని సైగ చేసాడు, నేను భయపడ్డాను, అతను నా కళ్ళలోకి సూటిగా చూసాడు, నేను అసంకల్పితంగా రెండు వేళ్ళతో వేదురు బొంగు లోని పదార్ధాన్ని తీసుకుని నోట్లో పెట్టుకున్నాను.
ముసలతని కళ్ళల్లో ఎదో ఒక రకమైన సంతోషం కనబడింది.

చాలా సేపు నన్ను గమనిస్తున్నడు. నాలో ఎదో మార్పు జరుగుతున్నట్లు అనిపించింది, నా కళ్ళు ఎర్రబడ్డాయి, శరీరం కాస్త పొంగినట్లు అనిపించింది,
నేను ఆయన్ని అడిగాను దీని వల్ల నాకు ఏమైనా ప్రమాదమా అని, అతను బలహీనం గా నవ్వి ఏమి కాదు అన్నట్లు సైగ చేసాడు.