జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 18 60

అమ్మ తలపై ముద్దులు పెడుతూ ముందుకు నడిపించుకుంటు వెళ్లి కప్ బోర్డ్ తెరిచి పలుచటి నైట్ డ్రెస్ అందుకొని అమ్మ అని ప్రేమగా పీలుస్తూ అందివ్వగా , నా గుండెలపై ముద్దు పెట్టి నవ్వుకుంటూ పలుచటి షర్ట్ మరియు ప్యాంట్ వేసుకోగా , అమ్మ వెనుక పిరుదులపై రెండు చేతులు వేసి అమాంతం గాలిలోకి ఎత్తగా , అమ్మ గట్టిగా నవ్వుతూ సంతోషంతో నా ముఖం పై ముద్దులు పెడుతూ నా మెడ వెనుక రెండు చేతులు వేసి పట్టుకోగా , టవల్ తోనే గట్టిగా అమ్మతోపాటు నవ్వుతూ తలుపు తెరిచి నడుచుకుంటూ బయటకు రాగా , ఇద్దరి నవ్వులను వింటూ అటువైపు టీవీ చూస్తూ కూర్చున్న అమ్మ పైకి లేచి ఇందు అమ్మ సంతోషాన్ని చూస్తూ ఆనంద భాస్పాలు కారుస్తుండగా , are you happy అమ్మ అని కాళ్లతో సైగ చెయ్యగా , నా కన్నయ్య బంగారం అని చేతులను అమ్మ చెవులపై అదుముకోగా ,

అమ్మ ముందు ఆగి ఇందు అమ్మను నెమ్మదిగా కిందకు దింపి అమ్మ అమ్మను చూడాలని ఆత్రంగా ఉందా అని అడుగగా , నాకే గనుక దేవుడు వరమిస్తే రెక్కలు కావాలని కోరుకొని ఈ నిమిషమే ఎగిరి వెళ్లి మా అక్కను కలిసి గట్టిగా కౌగిలించుకొని అక్క ప్రేమను పొందాలని ఉంది అని తీవ్ర ఉద్వేగంతో కళ్లల్లో నీటి చెమ్మతో చెబుతూ నా గుండెలపై వాలిపోగా ,ఆ మాటలు విన్న అమ్మకు సంతోషంతో కళ్లల్లో ఆనంద భాస్పాలు కారుతూ తన చెల్లిని ఎప్పుడెప్పుడు తన హృదయానికి హత్తుకుందామా అని తన రెండు చేతులను బలవంతంగా బిగిపెడుతోయి తనను తాను కంట్రోల్ చేసుకుంటుండగా , ఇక ఆలస్యం చెయ్యకూడదు నిర్ణయించుకొని , అమ్మ అని ప్రేమగా పిలుస్తూ నా రెండు చేతులతో అమ్మ తలను పైకెత్తి అమ్మ కళ్ళల్లోకి ఆప్యాయంగా చూస్తూ అయితే ఆ రెక్కలు నేనే అమ్మ అని అమ్మ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి అమ్మ భుజాలపై రెండు చేతులు వేసి వెనక్కు తిప్పగా ,అమ్మను చూస్తూ నమ్మలేనట్లు షాక్ లో కదలకుండా ఉండిపోగా , అమ్మ “చెల్లి….”

అని ప్రేమగా హృదయం నుండి వస్తున్న స్వరంతో మనఃస్ఫూర్తిగా పిలువగా , అమ్మ తేరుకొని “అక్క” అని గౌరవంగా అమ్మ పాదాలను తాకాబోతుండగా , “చెల్లి నాలో నీ స్థానం ఇక్కడ” అని హృదయాన్ని చూపుతూ ఉద్వేగంతో అమ్మను మనసారా కౌగిలించుకొని , “చెల్లి ముందుగా నన్ను క్షమించు తెలిసో తెలియక మీరు కలవకుండా అడ్డం పడినందుకు” అని క్షమాపణ కోరగా , “అక్కయ్య అంత మాట” అని అమ్మ కాళ్లపై పడిపోతూ “మీరే నన్ను క్షమించాలి , అత్యవసర పరిస్థితుల్లో మీ ఇద్దరిని దూరంగా ఉంచినందుకు , మీ బాధకు కారణమైనందుకు” అని కన్నీళ్లు కారుస్తూ చెబుతుండగా , వెంటనే అమ్మ కింద కూర్చుని ఇందు అమ్మ చేతులను పాదాల దగ్గర నుండి తీసి ఇందు అమ్మను కౌగిలించుకొని , “చెల్లి అదంతా ఒకరి గురించి మరొకరికి తెలియకుండా , అనుకోకుండా జరిగింది.

అందులో ఏ ఒక్కరి తప్పు లేదు , జరిగిందేదో జరిగిపోయింది , ఇప్పటి నుండి మన ఇద్దరు కలిసి ఇద్దరికి ప్రాణమైన కన్నయ్యను ప్రాణంగా చూసుకుండాము” అని ఇందు అమ్మ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి హృదయానికి హత్తుకొని కౌగిలించుకోగా , ఇందు అమ్మ, అమ్మ కన్నీళ్లను తుడుస్తూ , ఏడుస్తూ నవ్వుతూ “అక్కయ్య మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది” అని అడుగగా , “రక్తం ఇచ్చింది ఎవరు నా ప్రియమైన చెల్లి ఒక్క రోజులో మాములు స్థితికి వచ్చేసాను” అని నవ్వుతూ చెబుతూ ,

“మాకు బాగుండాలని నువ్వు ఇలా చేస్తే ఎలా చెల్లి ఆ అమ్మాయి అంతా చెప్పింది , ఇంకెప్పుడు అలా చెయ్యకు” అని ఇందు అమ్మ కన్నీళ్లను తుడుస్తూ , “ఇప్పుడు నీకు ఎలా ఉంది చెల్లి” అని అడుగగా , “మా అక్కయ్యను , మన ప్రాణాన్ని చూసిన వెంటనే నాకు 100 ఏనుగుల బలం వచ్చింది అక్కయ్య , మీరు దగ్గరుంటే నాకు ఇంకేమి భయం లేదు” అని అమ్మను ఇంకా గట్టిగా కౌగిలించుకొని , ఇద్దరు ఒకరి వీపుపై మరొకరు ప్రేమగా నిమురుకుంటు ఒక్కటవ్వగా , అదంతా చూస్తున్న నాకు ఇంత కంటే ఈ జన్మకు ఇంకేమి కావాలి అని ఆనంద భాస్పాలు కారుస్తూ అమ్మలిద్దరి తలలపై ఊహకే అందని ప్రేమతో , ఉద్వేగంతో ముద్దులు పెడుతూ , వంట గదిలోకి వెళ్లి పెద్ద ప్లేట్ అందుకొని నిండా భోజనం పెట్టుకొని అమ్మలిద్దరి మధ్యలో పక్కనే కూర్చుని 5 నిమిషాలు , 10 ……..15…….

నిమిషాలు అయినా కూడా అమ్మలిద్దరు ఒకరి కౌగిలిలో నుండి మరొకరు బయటకి రాక ఉద్వేగంతోనే ఒకరి వెనుక మరొకరు ప్రేమగా నిమురుకొంటుండగా , అమ్మలు చాలా ఆకలిగా ఉంది అని తిన్న తరువాత మీ అక్క చెల్లెల్లు ఎంతసేపు కావాలంటే ఎంతసేపు ఒకరి ప్రేమను మరొకరు పంచుకోండి అని ఒక చేతితో అన్నం కూర కలుపుతూ మరొక చేతిని నా కడుపుపై వేసి ఆకలి అమ్మోయ్ అని దీనంగా చెప్పగా , అమ్మలిద్దరు కౌగిలిలో నుండి వేరయ్యి ఒకరి కళ్లల్లో కారుతున్న కన్నీళ్లను మరొకరు తుడుస్తూ , ఇద్దరూ నవ్వుకుని నా వైపు ప్రేమగా చూస్తూ , కన్నయ్య బేబీ అని కొద్దిగా పీకి లేచి నా ఒక్కొక్క తొడపై ఒక్కొక్కరు కూర్చొని , మేము ఉన్నదే నిన్ను సంతోషంగా ,

ప్రేమగా చూసుకోవటానికి అని నా చెరొక బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టగా , లవ్ యు మదర్స్ అని ఇద్దరి నుదుటిపై ప్రేమగా చెరొక ముద్దు పెట్టి ఒక చేతితో ప్లేట్ అందుకొని కలిపి ఇద్దరికి ఒక ముద్ద పెట్టగా , ఆనంద భాస్పాలు కారుస్తూ తింటూ , ఇద్దరు ప్లేట్ కు చెరొక పక్క కలిపి చేతితో నా నోటి దగ్గరకు తీసుకు రాగా ఇద్దరిది ఒకేసారి అందుకొని సంతోషంగా తింటూ , ముగ్గురు క్లాక్ వైస్ , యాంటీ క్లాక్ వైస్ మరియు ఎలా పడితే అలా ముగ్గురు ఆప్యాయంగా తినిపించుకుంటూ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేయ్యగా , అమ్మ ఒక్క నిమిషం అని అమ్మలిద్దరిని కింద కూర్చోబెట్టి పరిగెత్తుకుంటూ వెళ్లి వడ్డించుకొని రాగా అది కూడా ఖాళీ చేసి అమ్మలిద్దరు చాలు బేబీ కన్నయ్య అని అనగా , ముగ్గురు పైకి లేచి చేతులు కడుక్కొని అమ్మలిద్దరికి టాబ్లెట్స్ తెచ్చి ఇవ్వగా వద్దు అని నన్ను సోఫాలో మధ్యలో కూర్చోబెట్టుకొని ఇద్దరు చెరొక వైపు నా భుజం పై తల వాల్చి సెదతీరుతుండగా , అమ్మ ఒక సారి విక్రమ్ సర్ ను కలిసి థాంక్స్ చెప్పి అటు నుండే సాగర్ ను కలిస్తాను , మీరూ కావాల్సినంతసేపు ప్రేమించుకొని నన్ను ఎప్పుడు రమ్మని ఫోన్ చేస్తే అప్పుడు మీ ఒడిలో వాలిపోతాను అని నవ్వుకుంటుండగా ఇద్దరు నా చేతులపై చిన్నగా కొడుతూ పెదాలను ముడుచుకోగా ,

1 Comment

Comments are closed.