జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 17 50

ఇక్కడ కంట్రోల్ రూమ్ లో సర్ ఫోన్ సిగ్నల్ తెలుస్తోంది అని విక్రమ్ సర్ ను లేపి చెప్పగా వెంటనే కాల్ చెయ్యగా , ఇక్కడ మొబైల్ సిగ్నల్ తగలగానే రింగ్ అవ్వగా , చూడగా విక్రమ్ సర్ నుండి వస్తుండటంతో ఎత్తగా మహేష్ మెనూ చెప్పేది జాగ్రత్తగా విను అని నేను ఇప్పుడు వైజాగ్ లోనే ఉన్నాను , మీ అమ్మ గారు మరియు మీ అమ్మ గారి ఫ్రెండ్ ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నారు అన్న మాట వినగానే గుండె ఆగినంత పని అయ్యి చేతులు కాళ్ళు వణుకుతుండగా కంగారుగా సర్ అమ్మకు ఏమయ్యింది అని ఆతృతగా అడుగగా కృష్ణ గాడు ఏమయ్యిందిరా మామా అని నన్నే చూస్తూ ఉండగా స్పీకర్ on చెయ్యగా మాటలు వినసాగాడు , ఇప్పుడు పూర్తి ఆరోగ్యన్గా ఉన్నారు , వెంటనే వైజాగ్ వచ్చెయ్యమని చెప్పగా ,

క్యాబ్ ను పక్కన ఆపమని డ్రైవర్ కు చెప్పి ఇద్దరు బయటకు దిగి అమ్మకు మరియు అంటీ కి ఏమి జరిగింది అని అడుగగా , మొబైల్ ను విశ్వ కు ఇస్తున్నానని ఇవ్వగా , సర్ ఏమి జరిగింది అని అడుగగా బిహారీ దొంగలు సెక్యురిటి ని కొట్టి లోపలికి వెళ్లడం , ఇద్దరి చేతులను రక్తం కారేలా కొయ్యడం , పాప చూసి అందరిని పిలుచుకొని రావడం వెంటనే హాస్పిటల్ కు పిలుచుకొని వెళ్లడం చెప్పి వెంటనే చికిత్స చెయ్యడంతో ఇప్పుడు పూర్తిగా కొలుకునగా రేపు డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పారని ఏమి భయపడాల్సిన పనిలేదని చెప్పి ఉదయం నుండి నేను విక్రమ్ అమ్మ గారి దగ్గరే ఉన్నామని చెప్పి పడుకున్నాక నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ కు వచ్చామని వివరించగా,

కాస్త ధైర్యం రాగా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగగా , కాశీ కి ఒక 50 km దూరం లో ఉన్నానని సిటీ వైపు వస్తున్నానని చెప్పగా మొబైల్ విక్రమ్ అందుకొని వెంటనే టికెట్స్ బుక్ చేసి మొబైల్ కు పంపిస్తానని చెప్పి కాల్ కట్ చెయ్యగా , వేణు వెంటనే missed కాల్ అలర్ట్స్ , మెసేజెస్ మరియు వాయిస్ కాల్ అలర్ట్స్ 5 నిమిషాల పాటు వస్తూనే ఉండటంతో చూడగా విక్రమ్ సర్ , విశ్వ సర్ , దివ్యక్క , అంకుల్ , ఇందుమతి గారు మరియు ఇందు అమ్మ నుండి కాల్స్ , మెసేజిస్ మరియు వాయిస్ మెసేజెస్ లు వస్తూనే ఉన్నాయి.

పడుకున్నారని చెప్పి ఉండటం వల్ల డిస్టర్బ్ చేయరాదని అనుకోని 5 నిమిషాలు వేచి చూడగా విక్రమ్ సర్ నుండి మెసేజ్ రాగా ఇంకో రెండు గంటలలో వైజాగ్ కు ఫ్లైట్ ఉండగా క్యాబ్ లో ఎక్కి ఎయిర్పోర్ట్ కు త్వరగా పోనివ్వమనగా , రోడ్లన్నీ నిర్మానుశ్యంగా ఉండటంతో వేగంగా కారును పోనివ్వగా గంటలో ఎయిర్పోర్ట్ కు చేరుకొనగా డ్రైవర్ కు అనుకున్నదానికంటే ఎక్కువే డబ్బు ఇచ్చి థాంక్స్ చెప్పి లోపలికి వెళ్లగా 4 గంటలకు ఫ్లైట్ వైజాగ్ కు బయలుదేరింది.ఇందుమతి గారు 5 గంటలకే లేచి నిన్న అవసరానికి కొనుక్కున్న చిన్న స్టవ్ లోనే అమ్మ వాళ్లకు tiffen తయారుచేసి 8 గంటలకు ఆటోలో హాస్పిటల్ కు చేరుకొనగా అక్కడ దివ్యక్క కిషోర్ కి రాత్రి కాల్ చేసి విషయం చెప్పినందువల్ల వారి కుటుంబం మొత్తం అక్కడే ఉంది.

ఇందుమతి గారు లోపలికి వెళ్ళి దివ్యక్కకు tiffen తెచ్చాను అని చెప్పగా అమ్మకు ఇందుమతి గారిని పరిచయం చెయ్యగా , మహేష్ మాకు చాలా సహాయం చేసారు , మీరు త్వరగా కోలుకోవాలని , సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము అని ఉద్వేగంతో చెప్పగా , అమ్మ వాళ్ళు సంతోషిస్తూ , బాత్రూం కు వెళ్లి ఫ్రెష్ అయ్యి ఆమె తెచ్చిన టీఫ్ఎం అందరూ తినసాగారు. విక్రమ్ సర్ ఇందు అమ్మకు కాల్ చేసి ఇంకో గంటలో మహేష్ వస్తున్నాడు అని చెప్పగా అమ్మ ఎంత సంతోషించిందో అంత కంగారుపడసాగింది.

1 Comment

Comments are closed.